STOCKS

News


90 షేర్లు... 52వారాల కనిష్టానికి..!

Wednesday 23rd January 2019
Markets_main1548226844.png-23754

మార్కెట్‌ ఫ్లాట్‌ ట్రేడింగ్‌ భాగంగా బుధవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో 90 షేర్లు 52వారాల కనిష్టానికి పడిపోయాయి. వాటిలో భాగంగా ఆదిత్య బిర్లా క్యాపిటల్‌, భారత్‌ వైర్స్‌ రోప్స్‌, ది బైకే హాస్పిటాలిటీ, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, దీపక్‌ ఫర్టిలేజర్స్‌, దేనా బ్యాంక్‌, ఫినోలాక్స్‌ కేబుల్స్‌, జిందాల్‌ స్టీల్‌లెస్‌, కిర్లోస్కర్‌ ఆయిల్‌ ఇంజన్స్‌, ఎల్‌ఈఈఎల్‌ ఎలక్ట్రానిక్స్‌, మార్టిన్‌ అల్లాయస్‌, మెక్‌లాయిడ్‌ రస్సెల్‌, నీల్‌కమల్‌, ప్రభాత్‌ డైరీ, పుంజ్‌లాయిడ్‌, మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌, శంకర బిల్డ్‌కాన్‌ ప్రోడెక్ట్స్‌, తారా జ్యూవెలరీస్‌ తదితర షేరు ఎన్‌ఎస్‌ఈలో  52వారాల కనిష్టానికి పతనమయ్యాయి. అయితే, ఒడిశ్శా సిమెంట్స్‌, ధన్సురీ వెంచర్స్‌, విప్రో షేర్లు తాజాగా 52-వారాల గరిష్టాన్ని అందుకున్నాయి.
ఇక ప్రధాన సూచీల విషయానికొస్తే...
దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు ఇందుకు కారణం అవుతున్నాయి. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి అంతంత మాత్రంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి తన నివేదకలో వెల్లడించడంతో ప్రపంచమార్కెట్లలో బలహీనత సంకేతాలు నెలకొన్నాయి. ఫలితంగా నిన్న అమెరికా యూరప్‌ మార్కెట్లు నష్టాలతో ముగియగా, నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. అలాగే పలు కార్పోరేట్‌ కంపెనీలు తమ క్యూ3 ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత సైతం సూచీల ఫ్లాట్‌ ట్రేడింగ్‌ కారణమవుతోంది. మధ్యాహ్నం గం.12:00లకు సెన్సెక్స్‌ 25 పాయింట్ల లాభంతో 36,470 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 10,938 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అత్యధికంగా అటో షేర్లలో అ‍మ్మకాలు నెలకొగా, మిగితా అన్ని షేర్లలో స్వల్పంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి.


NSE

You may be interested

11150 పాయింట్ల దిశగా నిఫ్టీ!

Wednesday 23rd January 2019

నిఫ్టీ క్రమంగా 11150 పాయింట్ల దిశగా అడుగులు వేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెరివేటివ్స్‌ డేటా ఈ విషయాన్ని ధృవీకరిస్తోందన్నారు. ఈ వారం పాజిటివ్‌గా ఆరంభమైన నిఫ్టీ 11000 పాయింట్ల నిరోధాన్ని దాటలేక వెనుకంజ వేసింది. ప్రస్తుతం 10900 పాయింట్ల వద్ద కదలాడుతోంది. అయితే నిఫ్టీ తన స్వల్ప, మధ్యకాలిక డీఎంఏ స్థాయిలకు పైన ట్రేడవుతోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెప్పారు. దీనికితోడు చార్టుల్లో హయ్యర్‌ హై, హయ్యర్‌ బాటమ్‌ ఏర్పరుస్తోందని తెలిపారు.

19ఏళ్ల గరిష్ఠానికి విప్రో షేరు

Wednesday 23rd January 2019

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం విప్రో షేరు బుధవారం ట్రేడింగ్‌లో 19 సంవత్సరాల గరిష్ఠస్థాయి(రూ.354.60- మధ్యాహ్నం 12.25కు) వద్ద ట్రేడవుతోంది. గతేడాది జరిపిన అప్‌మూవ్‌ అనంతరం షేరు వెనుకంజ వేసింది. తిరిగి పుంజుకొని గత ర్యాలీకి 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి వరకు పెరిగింది. ఈ క్రమంలో రూ. 348.22 వద్ద పైస్థాయి నిరోధాన్ని అధిగమించింది. దీంతో విప్రో మరికొన్ని సెషన్లలో తదుపరి నిరోధం 360.56 రూపాయల వరకు చేరవచ్చని నిపుణులు అంచనా

Most from this category