News


నిఫ్టీకి తగిన విలువ 9600-9800

Tuesday 9th October 2018
Markets_main1539067805.png-20973

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ నిప్టీ సరైన విలువ ఎంతో తెలుసా? 9,600-9,800 స్థాయి సరైన విలువ అని చెబుతోంది ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌. ప్రఖ్యాత ఇన్వెస్టర్‌ బెంజమిన్‌ గ్రాహామ్‌ తన సెక్యూరిటీ అనాలసిస్‌ పుస్తకంలో ఉపయోగించిన రెండు పద్ధతుల ప్రేరణతో ఈ విలువ లెక్కించినట్లు తెలిపింది. నాన్‌-బ్యాకింగ్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్లలో లిక్విడిటీ ఆందోళనలు, స్థూల ఆర్థికాంశాలు క్షీణించడం వంటి అంశాల కారణంగా ఇటీవల మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొందని, దీంతో బుల్‌ మార్కెట్‌ దిద్దుబాటుకు గురైందని పేర్కొంది. మిడ్‌-పాయింట్‌ విధానం ప్రకారం నిఫ్టీ 9,800 పాయింట్ల వద్ద ఫండమెటల్‌ వ్యాల్యు కలిగివుంది. సోమవారం నిప్టీ ముగింపు స్థాయి 10,348 నుంచి 5.3 శాతం క్షీణతను సూచిస్తోందని తెలిపింది. 
‘మార్కెట్‌ కొన్ని సమయాల్లో బాగా పెరుగుతుంటాయి. మిగిలిన సమయంలో ట్రెండ్‌ సాధారణ వ్యాల్యుయేషన్స్‌ వద్దే ఉంటుంది. దీన్ని నిజమని భావిస్తే.. మార్కెట్‌ ఊగిసలాటలను తెలియజేసే చుక్కలను కలుపుతూ మిడ్‌-పాయింట్‌ ఎక్కడుందో చూడాలి. దాని ద్వారా మార్కెట్‌ సాధారణ స్థాయిని తెలుసుకోవాలి. దీని ప్రకారం చూస్తే 2003 దగ్గరి నుంచి గమనిస్తూ వస్తే నిఫ్టీకి సాధారణ స్థాయి 9,800 వద్ద ఉంది’ అని వివరించింది. అలాగే క్యాపిటలైజేషన్‌ విధానంలో నిఫ్టీ చారిత్రాత్మక వన్‌ ఇయర్‌ ఫార్వర్డ్‌ పీఈ సగటుతో వన్‌ ఇయర్‌ ఫార్వర్డ్‌ ఈపీఎస్‌ విలువను పోల్చిచూస్తే నిఫ్టీ ఇండెక్స్‌ సరైన విలువ 9,300 స్థాయి వద్ద ఉందని పేర్కొంది. క్యాపిటలైజేషన్‌ విధానంలోనే మరో పద్ధతిలో నిఫ్టీ చారిత్రాత్మక పీఈ మల్టీపుల్‌ సగటుతో ప్రసుత్త ఏడాది అంచనా ఈపీఎస్‌ విలువతో పోల్చిచూస్తే ఇండెక్స్‌ సరైన విలువ 9,600 వద్ద ఉందని తెలిపింది. క్యాపిటలైజేషన్‌ విధానంలో నిఫ్టీ విలువ 9,300-9,600 శ్రేణిలో ఉన్నట్లు చూపిస్తోందని పేర్కొంది. అంటే 7-9 శాతం డౌన్‌సైడ్‌ను సూచిస్తోందని తెలిపింది. 
 You may be interested

షార్ట్‌ టర్మ్‌ కోసం ఐదు సిఫార్సులు

Tuesday 9th October 2018

వచ్చే ఒకటి రెండు నెలల కాలంలో 15 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.  1. రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 320. స్టాప్‌లాస్‌ రూ. 400. ఏడాదిగా లోయర్‌ టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తూ డౌన్‌ట్రెండ్‌లో ఉంది. రూ. 500- 900 మధ్య మల్టీఇయర్‌ టాపింగ్‌ ఫార్మేషన్‌ ఏర్పరిచింది. ఈ పాటర్న్‌ను తాజాగా అధోముఖంగా ఛేదించి నెగిటివ్‌ బ్రేక్‌డౌన్‌ చూపింది. ఇండికేటర్లు సైతం మరింత

10100 పాయింట్ల వద్ద కీలక మద్దతు

Tuesday 9th October 2018

గతవారమంతా నేల చూపులు చూస్తున్న సూచీలు సోమవారం కాస్త ఊపిరితీసుకున్నాయి. అయితే గతవారం ప్రధాన సూచీలు తమ కీలక మద్దతు స్థాయిలను కోల్పోయాయి. రూపీలో బలహీనత, క్రూడాయిల్‌ ధర పెరుగుదల, ఎన్‌బీఎఫ్‌సీల గోల, ఆర్‌బీఐ రేట్లు యథాతధంగా ఉంచడం.. మార్కెట్లను కుంగదీశాయి. అది, ఇది అని తేడా లేకుండా అన్ని రంగాలు పతనాన్ని నమోదు చేశాయి. ఈ వారం నుంచి కంపెనీల క్యు2 ఫలితాల సీజన్‌ ఆరంభం కానుంది. ఈ

Most from this category