STOCKS

News


ఈ ఏడాదిలో తీవ్ర నష్టాలను పంచిన షేర్లివే..!

Friday 28th December 2018
Markets_main1545990825.png-23289

ఈ ఏడాదిలో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ తీవ్రమైన ఆటుపోట్ల మధ్య ర్యాలీ చేసింది. అంతర్జాతీయంగా అమెరికా - చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు పెరిగి మార్కెట్లో అనిశ్చితి ఏర్పడటంతో పాటు దేశీయంగా ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ద్రవ్య కొరత సంక్షోభం, బ్యాంకింగ్‌ వ్యవస్థలో పెరిగిన మొండిబకాయిలు, కార్పోరేషన్‌ గవర్నెన్స్‌ సమస్యతో పాటు పలు వివాదస్పదమైన రాజకీయ అంశాతో మార్కెట్‌ తీవ్రఒడిదుడుకులకు లోనైంది. అయినప్పటికీ.., ఇదే ఏడాదిలో సెన్సెక్స్‌ సూచీ ఆగస్ట్‌ 29వ తేది 38,989 వద్ద జీవితకాల గరిష్టాన్ని, అక్టోబర్‌ 26న 33,349 ఏడాది కనిష్టాన్ని నమోదు చేసింది. ఇక నిఫ్టీ సూచి ఆగస్ట్‌ చివరిలో 11,750ల వద్ద జీవితకాల గరిష్టాన్ని, అక్టోబర్‌ చివరిలో 10,030 ఏడాది కనిష్టాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం 10800 స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు 15-25శాతం క్షీణించాయి. అయితే చిత్రంగా ఇదే ఏడాదిలో సూచీల కదలికలకు భిన్నంగా షేర్ల ట్రేడింగ్‌ జరిగింది.  మొత్తం 2,347 ఈక్విటీ షేర్లకు గానూ 2011 షేర్లు (85 శాతం) ఎలాంటి లాభాలను పంచకపోగా వీటికి నమ్ముకున్న ఇన్వెస్టర్లకు తీవ్రమైన నష్టాలను మిగిల్చాయి. డజన్ల కొద్ది స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లు ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను మిగిల్చాయి. వాటిలో...
1.    నీరవ్‌ మోదీ కుంభకోణంతో సంబంధమున్న గీతాంజలి జెమ్స్‌ షేరు 98.55శాతం క్షీణించి ఈ ఏడాదిలో అత్యధిక నష్టాలను పంచిన షేరుగా అపఖ్యాతి మూటగట్టుకుంది. జనవరి 1, 2018 నాడు రూ.71.05వద్ద ట్రేడైన గీతాంజలి జెమ్స్‌ షేరు నేడు (డిసెంబర్‌ 28న) రూ.1.10ల వద్ద ట్రేడవుతుండటం గమనార్హం.
2.    రియల్‌ ఎస్టేట్‌, ఫైనాన్స్‌, ఎన్‌ఎఫ్‌బీసీ రంగాల్లో ద్రవ్వత్వ కొరత కారణంగా సన్‌స్టార్‌ రియల్టి, కృష్ణా వెంచర్స్‌, యామిని ఇన్వెస్ట్‌మెంట్‌, క్రీసెంట్‌ లీజింగ్‌ షేర్లు ఈ ఏడాదిలో 95శాతం క్షీణించాయి.
3.    క్వాలిటీ, ఆశాపుర ఇంటిమేట్‌ ఫ్యాషన్స్‌, బాంబే రేయాన్‌, వక్రంజీ, జీటీఎల్‌ ఇన్ఫ్రాక్చర్స్‌, ఆమ్నెక్ట్‌ అటో, రోల్టా ఇండియా, పుంజ్‌లాయిడ్‌, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌, 8కే మైల్స్‌, అట్లాంటా, గామన్‌ ఇండస్ట్రీస్‌ షేర్లతో పాటు దాదాపు 90 షేర్లు 80 నుంచి 95శాతం క్షీణించాయి.
4. యస్‌ బ్యాంక్‌, దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, పీసీ జ్యూవెలరీస్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇన్ఫీబీమ్ అవెన్యూ, రిలయన్స్‌ క్యాపిటల్‌, బాంబే డైయింగ్‌, జుబిలెంట్‌ ఫుడ్స్‌, టాటా మోటర్స్‌, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, అవంతి సీడ్స్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేర్లు 50శాతానికి పైగా పతనమయ్యాయి.

గతేడాది చివరి రోజైన డిసెంబర్‌ 31వ తేదిన నాడు బీఎస్‌ఈ క్యాపిటలైజేషన్‌ రూ.151 లక్షల కోట్లు నమోదవ్వగా, నిన్న(డిసెంబర్‌ 27) రూ.143 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ ఏడాదిలో ఆగస్ట్‌ 31వ తేదిన అత్యధికంగా రూ.159.34లక్షల కోట్ల బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌ నమోదైంది.
అయినప్పటికీ..,  360 షేర్లు తన ఇన్వెస్టర్లకు భారీ లాభాల్ని పంచాయి. వాటిలో సదన్‌ నైట్రో కెమ్‌,  డోలట్ ఇన్వెస్ట్మెంట్స్, డార్జిలింగ్ రోప్ వే కంపెనీ, ఓరియంట్ ట్రేలెలింక్, వికాస్ ప్రొపాంప్ట్ & గ్రానైట్ అండ్ థింక్ ఇంక్ స్టూడియోస్ కంపెనీ షేర్లు తమ ఇన్వెస్టర్లకు ఇదే ఏడాదిలో 900శాతం వరకు లాభాల్ని పంచడటం విశేషం.You may be interested

జనవరి సీరిస్‌లో పెరిగిన రోలోవర్లు

Friday 28th December 2018

డిసెంబర్‌ సీరిస్‌తో పోలిస్తే జనవరి సీరిస్‌లోకి నిఫ్టీ రోలోవర్లు పెరిగాయి. డిసెంబర్‌తో పోలిస్తే రోలోవర్లు దాదాపు 13.66 శాతం పెరిగి జనవరిలో 74.27 శాతానికి చేరాయి. నిఫ్టీ గత మూడునెలల సరాసరి రోలోవర్లు 69.85 శాతమున్నాయి. మార్కెట్‌ పరిస్థితిని బట్టి చూస్తే ఎక్కువగా షార్ట్స్‌ రోలోవర్ జరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పలువురు ఇన్వెస్టర్లు ఆచితూచి పొజిషన్లు తీసుకుంటున్నారు. ఎఫ్‌ఐఐలు డిసెంబర్‌లో మిశ్రమ పొజిషన్లు తీసుకొని చివర్లో ఎగ్జిట్‌

ఫార్మా షేర్లకు‘‘సన్‌ ఫార్మా’’ అండ

Friday 28th December 2018

4శాతం లాభపడ్డ సన్‌ఫార్మా షేర్లు ముంబై:- సన్‌ ఫార్మా షేర్ల ర్యాలీ అండతో శుక్రవారం ఫార్మా షేర్లు పరుగులు పెడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పార్మా ఇండెక్స్‌ 2శాతానికి పైగా లాభపడింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 8,700.30ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇండెక్స్‌ 2శాతం లాభపడి 8830.10 ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:30లకు ఇండెక్స్‌ గతముగింపు (8,665.75)తో పోలిస్తే 1.75శాతం లాభపడి

Most from this category