STOCKS

News


85 శాతం స్టాక్స్‌లో ఈ ఏడాది నష్టాలే

Friday 28th December 2018
Markets_main1546021628.png-23295

నష్టాల సంవత్సరంగా 2018 స్థిరపడిపోతుంది. ఎందుకంటే 85 శాతం స్టాక్స్‌ ఈ ఏడాది ప్రతికూల రాబడులు (నష్టాలు) ఇచ్చాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. చురుగ్గా ట్రేడయ్యే 2,371 స్టాక్స్‌లో 2,011 స్టాక్స్‌ నష్టాలనే మిగిల్చాయి. కొన్నింటిలో నష్టాలు నామమాత్రంగా ఉంటే, కొన్నింటిలో మోస్తరు, కొన్నింటిలో భారీగాను ఉన్నాయి. 90 శాతం వరకూ పతనమైన మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ పదుల సంఖ్యలో ఉన్నాయి. 

 

గీతాంజలి జెమ్స్‌ ఇన్వెస్టర్లకు కన్నీరే మిగిలింది. నీరవ్‌మోదీ భారీ స్కామ్‌ తర్వాత ఈ స్టాక్‌ విలువ పూర్తిగా హరించుకుపోయింది. గీతాంజలి జెమ్స్‌ ప్రమోటర్‌ మెహుల్‌చోక్సీ అందులో నిందితుడుగానూ ఉండి, విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. 52 వారాల క్రితం ఈ స్టాక్‌ ధర రూ.83. ఈ ఏడాది జనవరి 1న రూ.71.05. చివరిగా ఈ నెల 24న ట్రేడ్‌ అయిన ధర 99 పైసలు. ఈ స్టాక్‌ను స్టాక్‌ ఎక్సేంజ్‌లు సస్పెండ్‌ చేశాయి. ‘‘2013 కరెక్షన్‌లో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ నిఫ్టీతో పోలిస్తే 700 బేసిస్‌ పాయింట్లు డిస్కౌంట్‌తో ట్రేడ్‌ అయితే, 2018 జనవరిలో 2,200 బేసిస్‌ పాయింట్ల ప్రీమియంతో ట్రేడ్‌ అయింది. ఈ మొత్తం దిగొచ్చింది’’అని ఆల్కెమీ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన హీరెన్‌వేద్‌ తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌, ఫైనాన్స్‌, ఎన్‌బీఎఫ్‌సీ రంగాలకు చెందిన స్టాక్స్‌లో ఎక్కువ నష్టాలు వచ్చాయి. 

 

క్వాలిటీ, ఆశాపుర ఇంటిమేట్‌ ఫ్యాషన్స్‌, బోంబే రేయాన్‌, వక్రంగీ, జీటీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఆమ్‌టెక్‌ ఆటో, రోల్టా ఇండియా, పుంజ్‌లైడ్‌, వీడియోకాన్‌, 8కే మైల్స్‌, అట్లాంటా, గ్యామన్‌ ఇన్‌ఫ్రా స్టాక్స్‌ 80 నుంచి 95 శాతం మధ్య నష్టపోయాయి. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 15-25 శాతం మధ్య నష్టపోయాయి. యస్‌ బ్యాంకు, దివాన్‌ హౌసింగ్‌, పీసీ జ్యుయలర్స్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, జుబిలంట్‌ ఇండస్ట్రీస్‌, బోంబే డయింగ్‌, టాటా మోటార్స్‌, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, అవంతి ఫీడ్స్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కౌంటర్లలో ఇన్వెస్టర్ల పెట్టుబడులకు పెద్ద గండి పడింది. రిలయన్స్‌ క్యాపిటల్‌ అయితే, ఈ ఏడాది 65 శాతం విలువను కోల్పోయింది. మార్చితో పోలిస్తే రెండో త్రైమాసికం (సెప్టెంబర్‌) నాటికి రూ.8వేల కోట్ల నెట్‌వర్త్‌ను కంపెనీ కోల్పోయిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, సన్‌ఫార్మా అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ కంపెనీల్లోనూ నష్టాలే మిగిలాయి. బీఎస్‌ఈలో కేవలం 360 స్టాక్స్‌ మాత్రమే ఇన్వెస్టర్లకు ఈ ఏడాది లాభాలను పంచాయి. సాధన నైట్రోకెమ్‌, దోలత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, డార్జిలింగ్‌ రోప్‌వే, ఓరియంట్‌ ట్రేడ్‌లింక్‌ తదితర స్టాక్స్‌ భారీ లాభాలను పంచిన వాటిల్లో ఉన్నాయి.You may be interested

ఐపీఓకు... ఆరు ప్రభుత్వ సంస్థలు

Saturday 29th December 2018

ఆమోదం తెలిపిన సీసీఈఏ  న్యూఢిల్లీ: ఆరు ప్రభుత్వ రంగ సంస్థలు త్వరలో ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) రానున్నాయి. ఈ ఆరు పీఎస్‌యూలు ఐపీఓకు రావడానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపినట్లు న్యాయ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. అంతే కాకుండా కుద్రేముఖ్‌ ఐరన్‌ ఓర్‌ కంపెనీ (కేఐఓసీఎల్‌) ఫాలో ఆన్‌ ఆఫర్‌కు (ఎఫ్‌పీఓ) కూడా సీసీఈఏ ఆమోదం తెలిపింది. ఈ ఆరు పీఎస్‌యూలను

ఫండ్స్‌లో పెట్టుబడులను ఎప్పుడు తీసేసుకోవచ్చు?

Friday 28th December 2018

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడిపై కేవలం మూడు నెలల్లోనే 20 శాతం రాబడి వచ్చింది... వెంటనే బుక్‌ చేసుకోవాలా? నెల క్రితం ఇన్వెస్ట్‌ చేస్తే దానిపై నష్టాలు చూపిస్తున్నాయి... అమ్మేసేస్తే పోదూ...? సాధారణంగా మ్యూచువల్‌ పండ్స్‌ ఇన్వెస్టర్లలో ఎక్కువ మందికి ఇవే తరహా సందేహాలు ఎదురవుతుంటాయి. దీంతో ఏదో ఒక సందర్భంలో వారు తోచినట్టు నిర్ణయాలను అమలు చేస్తుంటారు. కానీ, దీర్ఘకాలంలో సంపద పోగుబడాలంటే ఈ తరహా ఆలోచనలకు దూరంగా

Most from this category