STOCKS

News


78 కౌంటర్లలో ఎంఎసీడీ పాజిటివ్‌ సిగ్నల్స్‌

Saturday 29th December 2018
Markets_main1546076243.png-23311

గతవారం ముగింపు ప్రకారం 78 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా మారిన కంపెనీల్లో ఎన్‌సీసీ, జెట్‌ ఎయిర్‌వేస్‌, అదానీ పోర్ట్స్‌, జీఎస్‌ఎఫ్‌సీ, వొక్‌హార్ట్‌, గ్రాసిమ్‌, టెక్‌మహీంద్రా, టాటా ఎలాక్సి, మైండ్‌ట్రీ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను సూచిస్తోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఎంఏసీడీ అంటే...
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు. 
వీటిలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 77 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. వీటిలో ఏసియన్‌ పెయింట్స్‌, సెంట్రమ్‌ క్యాప్‌, సిమ్‌కో, అపోలో హాస్పిటల్స్‌, ఇంటర్నేషనల్‌ పేపర్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి. 
మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి. 



You may be interested

ఎఫ్‌ఎంసీజీపై జెఫర్రీస్‌ మక్కువ

Saturday 29th December 2018

రాబోయే కొన్ని నెలల్లో ఎఫ్‌ఎంసీజీ స్టాకులు పాజిటివ్‌గా ఉండొచ్చని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ జెఫర్రీస్‌ అంచనా వేస్తోంది. సమీప భవిష్యత్‌లో ముడిపదార్ధాల ధరలు తగ్గడం, వినిమయ డిమాండ్‌ పెరగడంతో ఎఫ్‌ఎంసీజీ స్టాకుల రీరేటింగ్‌ సంభవించవచ్చని తెలిపింది. ముడిపదార్ధాల ధరలు చల్లారడంతో ఈ కంపెనీల మార్జిన్లు విస్తృతమవుతాయని వివరించింది. అయితే ఈ రంగంలో స్టాకులను ఎంచుకునేముందు వాల్యూషన్లు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. గత కొన్ని నెలలుగా ముడిపదార్ధాల ధరల పెరుగుదలతో ఆహార

సిప్లాను కొనవచ్చు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

Saturday 29th December 2018

ఔషధ రంగ దిగ్గజం సిప్లా షేరును కొనవచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌ సం‍స్థ కోటక్‌ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సూచిస్తుంది. ఇటీవల షేరు ధర బాగా పతమనమై, తక్కువ ధర వద్ద ట్రేడ్‌ అవుతోందని, ఈ అంశం షేరు కొనేవారికి మంచి అవకాశమని బ్రోకరేజ్‌ సంస్థ చెబుతుంది.  సిస్లా షేరుపై బ్రోకరేజ్‌ సంస్థ విశ్లేషణలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం షేరు:- సిప్లా రంగం:- ఔషధ రంగం టార్గెట్‌ ధర:- రూ.605లు ఉపోద్ఘాతం:- సిప్లా షేరు ఈ సెప్టెంబర్‌ 18న

Most from this category