STOCKS

News


పెరిగిన డిఫాల్ట్‌ రిస్క్‌ కంపెనీల జాబితా

Thursday 29th November 2018
Markets_main1543489314.png-22494

default

ముంబై: రుణాలను చెల్లించడంలో వైఫల్యం చెంది చివరకు దివాళ దశ వరకు కూడా చేరుకోదగిన కంపెనీల జాబితా ఈ ఏడాదిలో మరింత పెరిగింది. బీఎస్‌ఈ 500 కంపెనీలలో ఈ ఏడాది ప్రారంభంలో కేవలం 24 సంస్థలు మాత్రమే 0.52 శాతం డిఫాల్ట్‌ రిస్క్‌ దాటిన సంస్థల ఈ జాబితాలో ఉండగా.. ఇప్పుడు వీటి సంఖ్య ఏకంగా 77కు చేరుకుంది. వోడాఫోన్ ఐడియా, దీవాన్ హౌసింగ్, బొంబే డైయింగ్, శ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, జెట్ ఎయిర్‌వేస్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కాపిటల్ వంటి సంస్థలు డిఫాల్ట్‌ రిస్క్‌ ప్రోబబిలిటీ మరింత పెరిగింది. అ‍త్యధికంగా ఆర్‌కామ్‌లో 11.98 శాతం డిఫాల్ట్‌ రిస్క్‌ ఉండగా.. ఆ తరువాత స్థానంలో పీసీ జ్యుయలర్స్ 6.59 శాతం, వోడాఫోన్ ఐడియా 4.99 శాతం, బొంబే డైయింగ్ 3.54 శాతం రుణాల చెల్లింపుల రిస్క్‌ను కలిగిఉన్నాయి. మిగిలిన సంస్థలు 0.52 నుంచి 3 శాతం వరకు వైఫల్యానికి అవకాశం ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ విశ్లేషణ ద్వారా వెల్లడైంది. షేర్ ధర, మార్కెట్ క్యాపిటలైజేషన్, షేరు ధరలో అస్థిరత, స్వల్పకాలిక రుణం, దీర్ఘకాలిక రుణాలు, వడ్డీ వ్యయాలు, కార్యకలాపాల నుండి నగదు ప్రవాహ సర్దుబాటులు వంటి ప్రధాన అంశాల ఆధారంగా రిస్క్‌ను నిర్ణయిస్తుంటారు. వచ్చే 12 నెలల్లో 0.52 శాతం డిఫాల్ట్‌ రిస్క్‌ ఉందని తేలితేనే సాధారణంగా ఇన్వెస్టర్లు దూరంగా ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఐఐఎఫ్‌ఎస్‌ రుణచెల్లింపుల వైఫల్యం తరువాత దీవాన్‌, ఇండియాబుల్స్‌లో రిస్క్‌ మరింత పెరిగిందని విశ్లేషించారు.



You may be interested

యస్‌ బ్యాంకు చైర్మన్‌ కానున్న రాణా కపూర్‌?

Friday 30th November 2018

ప్రైవేటు బ్యాంకింగ్‌ రంగంలో నాలుగో అతిపెద్ద సంస్థ ‘యస్‌ బ్యాంకు’ కొంత కాలంగా ఎదుర్కొంటున్న కష్టాలు అతి త్వరలోనే సమసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ బ్యాంకును స్థాపించినప్పటి నుంచి దాని అభివృద్ధిలో అత్యంత ముఖ్య పాత్ర పోషించిన రాణా కపూర్‌ను ఎండీ, సీఈవోగా మరో మూడేళ్ల పాటు కొనసాగేందుకు ఆర్‌బీఐ అనుమతించకపోవడం, జనవరి 31తో దిగిపోవాలని ఆదేశించడం తెలిసిందే. రాణాకపూర్‌ బయటకు వెళ్లిపోతే బ్యాంకు వృద్ధి ఏమవుతుందోనంటూ భవిష్యత్తుపై

ఆర్‌బీఐ, ఒపెక్‌ సమావేశాలపై మార్కెట్‌ దృష్టి..!

Thursday 29th November 2018

ముంబై: వచ్చే వారంలో వెల్లడికానున్నటువంటి కీలక అంశాల నేపథ్యంలో దేశీ మార్కెట్లు రేంజ్‌ బౌండ్‌లో ఉండేందుకు అవకాశం ఉందని ఆనంద్ రాఠీ బ్రోకింగ్‌ సంస్థలో ఈక్విటీ అడ్వైజరీ విభాగానికి చెందిన సిద్ధార్థ్ సెడాని వ్యాఖ్యానించారు. ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ ద్వారా ద్రవ్య లభ్యతను ఆర్బీఐ పెంచిన కారణంగా బాండ్‌ ఈల్డ్‌ 8.2 నుంచి 7.65 శాతానికి తగ్గినప్పటికీ.. ఎన్‌బీఎఫ్‌సీ, బ్యాంకింగ్‌ రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న రిస్క్‌ ఇన్వెస్టర్లను కాస్త వెనకడుగు

Most from this category