News


ఈ స్టాక్స్‌లో నిఫ్టీకి మించి రాబడులు...!

Sunday 9th June 2019
Markets_main1560104051.png-26185

రానున్న నాలుగు త్రైమాసికాల్లో నిఫ్టీకి మించి అధిక రాబడులు యస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు తదితర స్టాక్స్‌లో వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్టు ఈక్విటీ99 వ్యవస్థాపకుడు సుమిత్‌ బిల్‌గయాన్‌ తెలిపారు. మార్కెట్ల కదలికలపై స్పందిస్తూ... బీఎస్‌ఈ పీఈ 2018-19లో 24పీఈ వద్ద ఉందని, అది 2020 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 28.3పీఈకి చేరిందన్నారు. ఎన్‌పీఏలకు కేటాయింపులు గరిష్ట స్థాయికి చేరడం, ఆస్తుల నాణ్యత మెరుగుపడడంతో బ్యాంకుల ఎర్నింగ్స్‌ వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. డిమాండ్‌ మెరుగుపడడం వల్ల కొన​ఇన మెటల్‌, మైనింగ్‌ కంపెనీల పనితీరు బాగున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో ఇండెక్స్‌ ఇంకా పెరుగుతుందని, ముఖ్యంగా బడ్జెట్‌కు ముందు అని బిల్‌గయాన్‌ అంచనా వేశారు. 

 

ముడి చమురు ధరలు, బ్యాంకింగ్‌ రంగంలో ఎన్‌పీఏలు, డీమోనిటైజేషన్‌, జీఎస్టీ తదితర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సెన్సెక్స్‌ను 40,000కు చేర్చినట్టు బిల్‌గయాన్‌ చెప్పారు. బీఎస్‌ఈ సూచలోని కంపెనీల సగటు ఎర్నింగ్స్‌ వృద్ధి 2007-2014 మధ్య 12 శాతంగా ఉండగా, 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో ఇది 5 శాతానికి తగ్గినప్పుటికీ పైన చెప్పిన కీలక అంశాల వల్లే సూచీల ర్యాలీ జరిగిందన్నారు. ఒత్తిడిలోని రుణ ఆస్తులను గుర్తించే విషయమై ఆర్‌బీఐ నూతన నిబంధనలతో ఎన్‌పీఏ సమస్య అధిక శాతం పరిష్కారమైనట్టేనని చెప్పారు. విద్యుత్‌కు డిమాండ్‌ గరిష్ట స్థాయికి చేరిపోవడం, కోల్‌ ఇండియా నుంచి సరఫరా మెరుగుపడడం, వ్యయ నియంత్రణ చర్యలు మైనింగ్‌ కంపెనీలైన కోల్‌ ఇండియా, వేదాంత, ఎన్‌టీపీసీ వంటి విద్యుదుత్పత్తి కంపెనీల పరిస్థితుల మెరుగునకు సంకేతంగా పేర్కొన్నారు. యస్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, వేదాంత లిమిటెడ్‌, టీసీఎస్‌ వచ్చే నాలుగు త్రైమాసికాల్లో నిఫ్టీ కంటే ఎక్కువ రాబడులను ఇస్తాయని సుమీత్‌ బిల్‌గయాన్‌ చెప్పారు. 

 

క్షీణించిన వినియోగ డిమాండ్‌, దిగువ స్థాయిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం వంటి రిస్క్‌ను ప్రస్తుతానికి మార్కెట్‌ విస్మరిస్తున్నట్టు బిల్‌గయాన్‌ అన్నారు. భారీ సంఖ్యలో వాహనాలు ఎలక్ట్రిక్‌ వైపునకు మళ్లడం వంటి నిర్మాణపరమైన మార్పులను ఆటోమొబైల్‌ రంగ కంపెనీలు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. 2023 నుంచి అన్ని త్రిచక్ర వాహనాలు ఎలక్ట్రిక్‌ రూపంలోనే ఉండాలని ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదేశాలను గుర్తు చేశారు. అలాగే, 2025 నుంచి అన్ని ద్విచక్ర వాహనాలు ఎలక్ట్రిక్‌ రూపంలో అన్న ప్రభుత్వ తాజా ఆదేశాల గురించి తెలియజేశారు. పెద్ద ఎత్తున మూలధన నిధుల అవసరం ఉంటుందన్నారు. ఈ దశలో ఆటోస్టాక్స్‌ కలిగిన వారు ఉంచుకోవడానికే పరిమితమని, సరైన ధరలకు రానంత వరకు కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం పరిశీలించతగినది కాదన్నారు. చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో పెయింట్స్‌, కెమికల్స్‌, ఆయిల్‌ రిఫైనరీ కంపెనీలను కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. గత మూడు నెలలుగా ధరలు తక్కువ స్థాయిలోనే ఉండగా, ఇక ముందు ఇదే స్థాయిల్లో ఉండొచ్చన్నారు. టైర్ల కంపెనీల్లో సియట్‌ను పరిశీలించొచ్చని చెప్పారు.You may be interested

బుల్లిష్‌ సంకేతాలు ఇవే..?

Sunday 9th June 2019

నిఫ్టీ, సెన్సెక్స్‌ ఎన్నికల ఫలితాల తర్వాత నూతన గరిష్ట స్థాయిలకు దూసుకుపోయాయి. స్థిరమైన ప్రభుత్వం, మునుపటి విధానాల కొనసాగింపు, బలమైన నిర్ణయాలకు అవకాశం ఇన్వెస్టర్లను కొనుగోళ్ల వైపు కదిలించింది. 2014లో స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ గరిష్టాలకు ర్యాలీ చేయడాన్ని చూశాం. మరి 2014తో పోలిస్తే మరింత బలమైన మెజారిటీతో ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో 2019లోనూ అదే తరహా ర్యాలీ ఉంటుందని అంచనా వేయడం సహజం. నిజానికి ఆ దిశగా మార్కెట్లు

ఎన్‌ఎస్‌ఈలో వాటా విక్రయించనున్న ఐడీబీఐ బ్యాంక్‌

Saturday 8th June 2019

ప్రభుత్వ రంగపు ఐడీబీఐ బ్యాంకు నేషనల్‌ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ)లో తన వాటాను విక్రయించేందుకు సిద్ధమైంది. ఎన్‌ఎస్‌ఈలోని తన మొత్తం 1.05శాతం వాటాకు సమానమైన  52.16లక్షల ఈక్విటీ షేర్లను రూ.500 కోట్లను విక్రయించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తుంది. అనధికారిక మార్కెట్లో ఈక్విటీ షేర్ల మొత్తం ధర రూ.900 కోట్లుగా ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాన్‌ కోర్‌ వ్యాపార రంగాల నుంచి నిష్క్రమించే వ్యూహంలో భాగంగా బ్యాంకు ఈ మేరకు

Most from this category