STOCKS

News


మార్కెట్‌ విలువను పెంచిన 7 కంపెనీలు

Sunday 11th August 2019
Markets_main1565536491.png-27691

అత్యంత విలువైన 10 భారతీయ కంపెనీలలో,  ఏడు కంపెనీలు కలిపి గత వారం మార్కెట్ వాల్యుయేషన్‌కు రూ .87,965.88 కోట్లును జోడించాయి. మార్కెట్‌ విలువను పెంచిన టాప్‌ కంపెనీలలో హెచ్‌యుఎల్(హిందుస్థాన్‌ యూనిలీవర్‌), హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్‌ అగ్రస్థానంలో ఉండగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్‌), హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాతి స్థానాలలో ఉన్నాయి. కానీ ఆర్‌ఐఎల్‌(రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌), ఐటీసీ, ఎస్‌బీఐ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ గత వారం తగ్గిపోవడం గమనర్హం. గత వారం హెచ్‌యూఎల్‌ ఎం-క్యాప్(మార్కెట్‌ క్యాప్‌) రూ .22,145.92 కోట్లు పెరిగి రూ. 3,98,290.92 కోట్లకు, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్ ఎం-క్యాప్‌ రూ .18,264.93 కోట్లు పెరిగి రూ .6,23,892.08 కోట్లకు చేరుకున్నాయి. వీటితోపాటు హెచ్‌డీఎఫ్‌సి విలువ రూ .15,148.15 కోట్లు పెరిగి రూ .3,81,619.34 కోట్లకు, టీసీఎస్‌ ఎం-క్యాప్‌ రూ .14,840.68 కోట్లు పెరిగి రూ .8,42,635.51 కోట్లకు, ఇన్ఫోసిస్ రూ .6,335.19 కోట్లు పెరిగి రూ .3,39,372.78 కోట్లకు చేరుకోగా, ఐసీఐసీఐ బ్యాంక్ రూ .6,237.72 కోట్లు పెరిగి రూ .2,71,360.08 కోట్లకు, కోటక్ మహీంద్రా బ్యాంక్ విలువ రూ .4,993.29 కోట్లు పెరిగి రూ .2,92,866.47 కోట్లకు చేరుకున్నాయి. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎం-క్యాప్ రూ. 15,261.1 కోట్లు తగ్గి రూ. 2,60,018.56 కోట్లకు , రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) రూ. 14,072.8 కోట్లు పడిపోయి రూ. 7,36,602.08 కోట్లకు, ఐటీసీ విలువ రూ.12,606.9 కోట్లు తగ్గి రూ. 3,12,146.38 కోట్లకు చేరుకున్నాయి. టాప్ -10 సంస్థల ర్యాంకింగ్‌లో(మార్కెట్‌ వాల్యుషన్‌ పరంగా) టీసీఎస్‌ ప్రథమ స్థానంలో కొనసాగుతుండగా,  ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సి, ఇన్ఫోసిస్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐలు తర్వాతి స్థానాలలో ఉన్నాయి. గత వారంలో సెన్సెక్స్ 463.69 పాయింట్లు లేదా 1.24 శాతం లాభపడిన విషయం తెలిసిందే.



You may be interested

రుణాల చెల్లింపులకై నిధులను కోరిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

Sunday 11th August 2019

ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఫైనాన్స్‌ సంస్థ, దివాన్‌ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) తన రిటైల్ కస్టమర్లకు, ప్రాజెక్ట్ డెవలపర్లకు చెల్లించడానికి వెంటనే బ్యాంకుల నుంచి రూ .15 వేల కోట్లు కోరిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా రిజల్యూషన్‌ను డ్రాఫ్ట్‌ ప్రణాళికను ఈ సంస్థ రుణదాతలకు సమర్పించింది. ‘తీవ్ర నగదు కొరత వలన ఆగిపోయిన ముఖ్యమైన ప్రాజెక్టుల కోసం ఈ నిధులను ఉపయోగించనున్నారు’ అని పరిశీలకులు తెలిపారు. కంపెనీ రిజల్యూషన్‌

ఆర్థిక చర్యలుంటాయి.. కానీ జీఎస్టీ రేటు తగ్గదు

Sunday 11th August 2019

వ్యవస్థలో ఉత్పాదక రంగాలకు, నిధుల లభ్యతను సులభతరం చేయడానికి ఉన్న అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కానీ జీఎస్‌టీ రేట్లను మాత్రం తగ్గించే అవకాశం లేదని పరిశీలకులు తెలిపారు. గతంతో పోల్చుకుంటే పన్నులు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం భావించడమే దీనికి కారణమని అన్నారు. ‘ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వివిధ బ్యాంకర్లు, విదేశీ, దేశీయ ఇన్వెస్టర్లతో పాటు, వివిధ వాటాదారులతో పరస్పర చర్చలు జరిపి  ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. గత కొన్ని

Most from this category