STOCKS

News


కొత్త ఏడాదికి ఐసీఐసీఐ డైరెక్ట్‌ సిఫార్సులు

Tuesday 1st January 2019
Markets_main1546321957.png-23343

నూతన సంవత్సరంలో మంచి రాబడులిచ్చే ఏడు స్టాకులను ఐసీఐసీఐ డైరెక్ట్‌ రికమండ్‌ చేస్తోంది.
1. యాక్సిస్‌ బ్యాంక్‌: టార్గెట్‌ రూ. 755. స్టాప్‌లాస్‌ రూ. 569. నాలుగు సంవత్సరాల సౌష్ఠవాకార త్రిభుజాకృతి పాటర్న్‌ నుంచి పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. ప్రస్తుతం రూ. 580 వద్ద బలమైన మద్దతు స్థాయి ఏర్పరుచుకుంది. గత అప్‌మూవ్‌కు 123.6 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి 770 రూపాయల వరకు అప్‌మూవ్‌ కొనసాగవచ్చు.
2. బ్రిటానియా ఇండస్ట్రీస్‌: టార్గెట్‌ రూ. 3790. స్టాప్‌లాస్‌ రూ. 2740. దీర్ఘకాలిక బుల్‌ట్రెండ్‌లో పయనిస్తూ మధ్యమధ్య క్రమానుగత కరెక‌్షన్‌​‍్స చవిచూస్తూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం పతనానంతర కొనుగోలు స్థాయిల వద్ద ఉంది. గత అప్‌మూవ్‌కు 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి రూ. 2650 వద్ద బలమైన మద్దతు దొరుకుతోంది.
3. అబాట్‌ ఇండియా: టార్గెట్‌ రూ. 9368. స్టాప్‌లాస్‌ రూ. 6380. గతేడాది దీర్ఘకాలిక నిరోధం 6170 రూపాయలను ఛేదించి పైకి ఎగిసింది. దీర్ఘకాలిక చార్టుల్లో హయ్యర్‌ హై, హయ్యర్‌ లో ఏర్పరుస్తూ బుల్లిష్‌గా కొనసాగుతోంది. గత మూడు నెలలు స్వల్ప కరెక‌్షన్‌ చవిచూసి ప్రస్తుతం కొనుగోళ్లకు రెడీగా ఉంది. 
4. వోల్టాస్‌ ఇండియా: టార్గెట్‌ రూ. 688. స్టాప్‌లాస్‌ రూ. 497. రెండేళ్ల క్రితం ఏర్పరిచిన గరిష్ఠాన్ని దాటేసింది. ఇకపై ఈ స్థాయి(రూ. 400) మంచి మద్దతుగా పనిచేస్తుంది. ప్రస్తుత పతనంలో కొనుగోలుకు యత్నించవచ్చు.
5. టీవీఎస్‌ మోటర్స్‌: టార్గెట్‌ రూ. 720. స్టాప్‌లాస్‌ రూ. 495. దాదాపు ఏడాది కాలవ్యవధి ఉన్న అధోముఖ వాలు రేఖను ఇటీవలే ఛేదించింది. ఇది ట్రెండ్‌ రివర్సల్‌కు సంకేతం. రెండు నెలలుగా రూ. 500- 520 స్థాయిలో మంచి కన్సాలిడేషన్‌ చూసింది. ఇకపై ముందుకు సాగేందుకు రెడీగా ఉంది. 
6. జేఎస్‌డబ్ల్యు ఎనర్జీ: టార్గెట్‌ రూ. 96. స్టాప్‌లాస్‌ రూ. 56. గత అప్‌మూవ్‌కు 80 శాతం రిట్రేస్‌మెంట్‌ స్ధాయి వద్ద డబుల్‌ బాటమ్‌ సాధించింది. ఇక్కడనుంచి ట్రెండ్‌ రివర్సల్‌ చూపుతోంది. అప్‌మూవ్‌లో అధిక వాల్యూంలు, కరెక‌్షన్‌లో అల్పవాల్యూంలు చూపుతోంది. ఇకపై పాజిటివ్‌ పరుగు కొనసాగవచ్చు.
7. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌: టార్గెట్‌ రూ. 263. స్టాప్‌లాస్‌ రూ. 163. దాదాపు రెండున్నరేళ్ల కన్సాలిడేషన్‌ స్థాయిలను దాటుకొని బయటపడింది. బ్రేకవుట్‌లో భారీ వాల్యూంలు నమోదయ్యాయి. ఇకపై ప్రైమరీ అప్‌ట్రెండ్‌ కొనసాగనుంది. 



You may be interested

నిఫ్టీ 11,000 పాయింట్లు దాటకపోవచ్చు!

Tuesday 1st January 2019

సమీప భవిష్యత్‌లో నిఫ్టీ 11,000 పాయింట్లను దాటలేకపోవచ్చని ప్రముఖ అనలిస్టు శుభమ్‌ అగర్వాల్‌ అంచనా వేశారు. జనవరి సీరిస్‌లో నిఫ్టీకి 10,500 పాయింట్ల వద్ద మద్దతు దొరుకుతుందన్నారు. ఎగువన 11,000 పాయింట్ల వద్ద నిరోధం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని బేర్‌ పుట్‌ స్ప్రెడ్‌ వ్యూహం అనుసరించాలని సూచించారు. ఇది ఒక బేరిష్‌ వ్యూహం. ఇందులో ఒక లాట్‌ ఎట్‌ ద మనీ పుట్‌ను కొనుగోలు చేసి, ఒక లాట్‌

జీఎస్టీ తగ్గింపు ఎఫెక్ట్‌...

Tuesday 1st January 2019

న్యూఢిల్లీ: జనవరి ఒకటి నుంచి 23 వస్తుసేవలపై తగ్గించిన జీఎస్‌టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. డిసెంబర్‌ 22న జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌లో 23 రకాల వస్తు సేవలపై జీఎస్‌టీ శ్లాబులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ తగ్గింపుతో సామాన్యుడికి అవసరమైన పలు వస్తు సేవల ఖరీదు తగ్గనుంది. పన్ను తగ్గింపుతో సినిమాటికెట్లు, టీవీలు, మానిటర్లు, పవర్‌బ్యాంకులు, నిలవచేసిన కూరగాయలు ఇకపై చౌకగా లభిస్తాయి.పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి

Most from this category