STOCKS

News


69 స్టాకుల్లో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌

Tuesday 15th January 2019
Markets_main1547530198.png-23586

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 69 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సిండికేట్‌ బ్యాంక్‌, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్స్‌, పీటీసీ, నాల్కో, ఏసియన్‌ పెయింట్స్‌, సన్‌టీవీ, ఐసీఐసీఐ లుంబార్డ్‌, సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌, జేఎస్‌డబ్ల్యు ఎనర్జీ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఎంఏసీడీ అంటే...
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
ఈ షేర్లలో బుల్లిష్‌ క్రాసోవర్‌
మరోవైపు28 షేర్లలో  ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. జెట్‌ ఎయిర్‌వేస్‌, జేఅండ్‌కే బ్యాంక్‌, ఫినోలెక్స్‌ కెమికల్స్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, హికాల్‌, జీహెచ్‌సీఎల్‌, జీలెర్న్‌, ముక్తా ఆర్ట్స్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి.  మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  



You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 15th January 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు.. సైయంట్‌:- కంపెనీ చరిత్రలో తొలిసారి షేర్ల బైబ్యాక్‌ ప్రకటించనుంది. ఈ నెల 17న జరిగే బోర్డు సమావేశంలో క్యూ3 ఫలితాలతో పాటు షేర్ల బై బ్యాక్‌ ఇష్యూకూ ప్రకటించనుంది. యునైటెడ్‌ స్పిరిట్‌:- తన అనుబంధ సంస్థ ఫోర్‌ సీజన్స్‌ వైన్స్‌ లిమిటెడ్‌ను గ్రోవర్‌ జంపా వినియార్డ్స్‌ లిమిటెడ్‌, క్వింటెలా అసెట్స్‌ లిమిటెడ్‌ విక్రయించేందుక ఒప్పందాన్ని కుదర్చుకుంది. ఈ డీల్‌ విలువ రూ.32 కోట్లు

భారీ పతనాన్ని సూచిస్తున్న ఎఫ్‌పీఐ ఇండెక్స్‌ పొజిషన్లు

Tuesday 15th January 2019

నిఫ్టీ కొద్ది కాలంగా స్వల్ప శ్రేణిలో ట్రేడవుతోంది. పైకి పాజిటివ్‌ బ్రేకవుట్‌ ఇస్తుందా, కిందకు నెగిటివ్‌ బ్రేక్‌డౌన్‌ ఇస్తుందా? అని ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌లో ఎఫ్‌పీఐల పొజిషన్ల గణాంకాలు నిఫ్టీలో భారీ పతనాన్ని సూచిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది మార్చి నుంచి బ్యాంకు నిఫ్టీ, నిఫ్టీల ఉమ్మడి ఫ్యూచర్స్‌లో ఎఫ్‌పీఐ పొజిషన్ల ఓపెన్‌ ఇంట్రెస్ట్‌(ఓఐ)ని షేర్‌ఖాన్‌ సంస్థ పరిశీలిస్తోంది. ఈ రెండు సూచీల ఉమ్మడి ఓఐ -1,00,000ను

Most from this category