STOCKS

News


ఈ స్టాకులు బుల్లిష్‌!

Tuesday 1st January 2019
Markets_main1546331188.png-23346

సోమవారం ముగింపు ప్రకారం 63 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారినకంపెనీల్లో ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌సీఎల్‌ టెక్‌, లుపిన్‌, అంబుజా సిమెంట్‌, జైశ్రీటీ, పీవీఆర్‌, ఫిలిప్‌ కార్బన్‌, మహీంద్రా సీఐఈ ఆటో, ఏజిస్‌ లాజిస్టిక్స్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌, వినతి ఆర్గానిక్స్‌, ఎస్‌పీ అపెరల్స్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను సూచిస్తోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు టాటా స్టీల్‌ బీఎస్‌ఎల్‌, ఏసియన్‌ పెయింట్స్‌, సీఈఎస్‌సీ, మెర్కటార్‌, ఒమెక్స్‌, సన్‌టెక్‌ సిటీ, డంకెన్‌ ఇన్‌ఫ్రాటెక్‌తో పాటు 30 షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంఏసీడీ అంటే...
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు. 
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి. You may be interested

ఈ జనవరి చాలా బెటర్‌!

Tuesday 1st January 2019

స్టాక్స్‌ ఎంపికకు అనువైనది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ సీఐఓ ఎస్‌ నరేన్‌ ఎన్నికల కారణంగా ఈ సంవత్సరం మార్కెట్లో ఒడిదుడుకులు అధికంగా ఉండొచ్చని, అందువల్ల కొత్త ఇన్వెస్టర్లు సాధ్యమైనంత వరకు సిప్‌ మార్గాన్ని ఎంచుకోవాలని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ సీఐఓ ఎస్‌ నరేన్‌ సూచించారు. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరి స్టాక్స్‌ ఎంపికకు చాలా అనువుగా ఉందని అభిప్రాయపడ్డారు. గత జనవరిలో మార్కెట్లు భారీ వాల్యూషన్లతో ఉన్నాయని, స్మాల్‌, మిడ్‌ క్యాప్స్‌లో చాలావరకు

మూడు రంగాలు ఆకర్షణీయం

Tuesday 1st January 2019

మార్కెట్‌ నిపుణుడు జీతెన్‌ పరమార్‌ సలహా ఒక కంపెనీ షేరు దాని ఇంట్రెన్సిక్‌ విలువ కన్నా బాగా తక్కువగా ఉన్నప్పుడు దాన్ని కొనుగోలు చేయవచ్చని ప్రముఖ అనలిస్టు జీతెన్‌ పరమార్‌ సూచించారు. ఇలాంటి కాంట్రా ఇన్వెస్టింగ్‌ చాలా సార్లు మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. మార్కెట్లో నిరాశా పూరిత వాతావరణం ఉన్నప్పుడు ఇది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందన్నారు. ఈ తరహా కాంట్రా పెట్టుబడితో రెట్టింపు లాభాలు పొందవచ్చన్నారు. కొత్త సంవత్సరానికి క్యాపిటల్‌ గూడ్స్‌,

Most from this category