STOCKS

News


63 షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌!

Tuesday 9th April 2019
Markets_main1554800666.png-25032

సోమవారం ముగింపు ప్రకారం 63 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో యూనియన్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ, జీఐసీ, ముత్తూట్‌ ఫిన్‌క్యాప్‌, బయోకాన్‌, డా.రెడ్డీస్‌, గ్లెన్‌మార్క్‌, సింజన్‌ ఇంటర్నేషనల్‌, బీఈఎల్‌, హెచ్‌ఏఎల్‌, మన్‌ ఇన్‌ఫ్రా, సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రా, ఎంఈపీఇన్‌ఫ్రా తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఈ షేర్లలో బుల్లిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 45 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. వీటిలో జైకార్‌‍్ప, హెచ్‌డీఐఎల్‌, ఐజీఎల్‌, ధనలక్ష్మి బ్యాంక్‌, గుజరాత్‌ గ్యాస్‌, జేకే పేపర్‌, హిందుస్థాన్‌కాపర్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి.  మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంఏసీడీ అంటే...
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  



You may be interested

అరశాతం పెరిగిన ఐటీ ఇండెక్స్‌

Tuesday 9th April 2019

మార్కెట్‌ ఒడిదుడుకుల ర్యాలీలో భాగంగా ఐటీ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభపడింది. టీసీఎస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌టెక్‌ ర్యాలీ ఇండెక్స్‌ను లాభపడేందుకు దోహదపడ్డాయి. మధ్యాహ్నం గం.2:00లకు నిఫ్టీ ఇండెక్స్‌ 0.75శాతం లాభపడి 16,152.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా విప్రో 3.50శాతం లాభపడింది. హెచ్‌సీఎల్‌ 2శాతం, టీసీఎస్‌, ఇన్ఫీభీమ్‌, టెక్‌ మహీంద్రా, మైండ్‌ ట్రీ షేర్లు 1శాతం లాభపడ్డాయి.

ఈ పది కంపెనీల లాభాలు రెట్టింపు!

Tuesday 9th April 2019

అనలిస్టుల అంచనా క్యు4 సీజన్‌ ఆరంభం కాబోతున్నది. ఈ నేపథ్యంలో పది కంపెనీలు అదరగొట్టే ఫలితాలు ప్రకటిస్తాయని అనలిస్టులు భావిస్తున్నారు. ఈ సారి ఈ కంపెనీల లాభాలు రెట్టింపవుతాయని అంచనా వేస్తున్నారు.  1. జీఈ టీఅండ్‌డీ: మోతీలాల్‌ ఓస్వాల్‌ న్యూట్రల్‌ రేటింగ్‌. కంపెనీ రెవెన్యూ 32 శాతం పెరిగి రూ. 1070 కోట్లకు చేరవచ్చు. బలహీనమైన బేస్‌ ఎఫెక్ట్‌ రెవెన్యూపై ప్రభావం చూపుతుంది. నికర లాభం రూ. 100 కోట్లకు, ఆపరేటింగ్‌ మార్జిన్లు

Most from this category