STOCKS

News


ఈ స్టాకుల్లో ఎంఏసీడీ బేరిష్‌ సిగ్నల్స్‌

Tuesday 8th January 2019
Markets_main1546936678.png-23463

సోమవారం ముగింపు ప్రకారం 60 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారినకంపెనీల్లో ఐబీ హౌసింగ్‌. పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, టాటా ఎలెక్సి, ఎల్‌ఐసీ హౌసింగ్‌, రైన్‌ ఇండస్ట్రీస్‌, విజయా బ్యాంక్‌, గృహ్‌ ఫైనాన్స్‌, వొక్‌హార్డ్‌, ఎంసీఎక్స్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, సీపీసీఎల్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, పీఎన్‌బీ గిల్ట్స్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఈ షేర్లలో బుల్లిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 37 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. వీటిలో అనంత్‌రాజ్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, అన్సాల్‌ ప్రాపర్టీస్‌, అన్సాల్‌ హౌసింగ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టొరెంట్‌ పవర్‌, పీటీసీ ఇండియా, ఇన్ఫోఎడ్జ్‌, అజంతా ఫార్మా తదితరాలు ఈ జాబితాలో వున్నాయి.  మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంఏసీడీ అంటే...
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  



You may be interested

ఐటీ క్యు3 ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Tuesday 8th January 2019

దేశీయ ఐటీ కంపెనీల క్యు3 ఫలితాల సీజన్‌ ఈ వారం ఆరంభం కానుంది. మూడో త్రైమాసికంలో ఐటీ కంపెనీలు మంచి ఫలితాలనే చూపవచ్చని, అయితే యూఎస్‌ వ్యాపారంలో కనిపిస్తున్న మందకొడితనం ఐటీ కంపెనీల గైడెన్స్‌పై ఉండొచ్చని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు యూఎస్‌ వ్యాపారం అప్‌మూవ్‌లో ఉండడం, బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంలో స్థిర వృద్ధి, రూపీ పతనం.. క్యు3లో ఐటీ కంపెనీలకు కలిసివస్తాయని భావిస్తున్నాయి. క్యు3లో ఐటీ కంపెనీల

బంధన్‌బ్యాంక్‌పై బ్రోకరేజ్‌లు ఏమంటున్నాయ్‌?

Tuesday 8th January 2019

గృహ్‌ ఫైనాన్స్‌ను విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బంధన్‌ బ్యాంక్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో దాదాపు 2 శాతం పతనమయ్యాయి. ఈ విలీనంపై బ్రోకరేజ్‌ సంస్థలు న్యూట్రల్‌గా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు బ్యాంకు రేటింగ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదని బ్రోకరేజ్‌లు తెలిపాయి. అయితే ఒప్పంద అనంతరం ఇరు కంపెనీల సమన్విత సహవాసంపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గృహ్‌ ఫైనాన్స్‌ క్రమానుగతంగా లాభదాయక కంపెనీగా ఎదిగింది. అందువల్ల దీన్ని కొనుగోలు చేయడం

Most from this category