STOCKS

News


52 షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌!

Tuesday 19th March 2019
Markets_main1552979269.png-24689

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 52 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో టాటా మోటర్స్‌, స్టెరిలైట్‌ టెక్‌, రిలయన్స్‌ నావల్‌, జైప్రకాశ్‌ పవర్‌, ప్రజ్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ హిందుస్థాన్‌, డెల్టా కార్‌‍్ప, బాటా ఇండియా, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌, గాయత్రి ప్రాజెక్ట్స్‌, అపోలో హాస్పిటల్‌, టేక్‌ సొల్యూషన్స్‌, ఆవాసా ఫైనాన్షియర్స్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. మరోవైపు 4 షేర్లలో  ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, షాపర్స్‌స్టాప్‌, సస్తసుందర్‌ వెంచర్స్‌, క్రిసిల్‌ ఈ జాబితాలో వున్నాయి. 
ఎంఏసీడీ అంటే...
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.   మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  

 



You may be interested

ఆర్‌కామ్‌-ఆర్‌జియో ఒప్పందం రద్దు

Tuesday 19th March 2019

అనుమతులు రాకపోవడం వల్లే న్యూఢిల్లీ: అంబానీ సోదరులకు చెందిన టెలికం కంపెనీలు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (అనిల్‌ అంబానీ), రిలయన్స్‌ జియో (ముకేశ్‌ అంబానీ) టెలికం ఆస్తులకు సంబంధించి 15 నెలల క్రితం తాము చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు ప్రకటించాయి. ప్రభుత్వం, రుణదాతల నుంచి అనుమతుల్లో జాప్యాన్ని కారణంగా పేర్కొ‍న్నాయి. 15 నెలల కాంలో 45 సమావేశాలు జరిగిన తర్వాత కూడా ఆర్‌కామ్‌కు రుణాలు ఇచ్చిన దేశ విదేశీ బ్యాంకులు ఆర్‌కామ్‌,

అనిల్‌ అంబానీకి తప్పిన ‘కారాగార’ ముప్పు

Tuesday 19th March 2019

- ఎరిక్‌సన్‌కు ఆర్‌కామ్‌  రూ.458.77 కోట్ల చెల్లింపులు - ఉన్నత న్యాయస్థానం  గడువుకు ఒకరోజు ముందు జమ న్యూఢిల్లీ: బిలియనీర్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి ‘కారాగార’ ముప్పు తప్పింది. అత్యున్నత న్యాయస్థానం విధించిన గడువుకు సరిగ్గా ఒక్కరోజు ముందు స్వీడన్‌ టెలికం పరికరాల తయారీ సంస్థ-  ఎరిక్‌సన్‌కు ఇవ్వాల్సిన రూ.458.77 కోట్లను రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) చెల్లించింది. సోమవారం ఎరిక్‌సన్‌కు బకాయిలు చెల్లించినట్లు ఆర్‌కామ్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆర్‌కామ్‌ నుంచి రావాల్సిన

Most from this category