STOCKS

News


ఎంఏసీడీ ఇండికేటర్‌ ఏం చెబుతోంది?

Tuesday 28th August 2018
Markets_main1535438425.png-19721

ప్రపంచ మార్కెట్లన్నీ ఈ వారం పాజిటివ్‌గా ఆరంభమయ్యాయి. దేశీయ సూచీలు సైతం ఆల్‌టైమ్‌ గరిష్ఠాలను చేరి ట్రేడవుతున్నాయి. సూచీల్లో బుల్స్‌ పట్టు పెరగడంతో పలు షేర్లలో ర్యాలీ సంకేతాలు కన్పిస్తున్నాయంటున్నారు నిపుణులు. సోమవారం ముగింపు ప్రకారం 50 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో ఆర్‌ఈసీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌, జీఎస్‌ఎఫ్‌సీ, ఓరియంట్‌ రిఫ్రాక్టరీస్‌, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, జైడస్‌ వెల్‌నెస్‌, కాప్లిన్‌ పాయింట్‌, నెట్‌వర్క్‌18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, టైమ్‌ టెక్నోప్లాస్ట్‌, బాలాజీ టెలిఫిల్మ్స్‌, వీఐపీ క్లోతింగ్‌, అశోక బుల్డ్‌కాన్‌, ఖైతాన్‌, కాక్స్‌అండ్‌ కింగ్స్‌, బేయర్‌ క్రాప్‌సైన్స్‌, ఎఫ్‌ఐఈఎం ఇండస్ట్రీస్‌; వైభవ్‌గ్లోబల్‌, యూరోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, ధున్‌సెరి టీ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను సూచిస్తోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 


బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడ్డ కౌంటర్లివే...
మరోవైపు 56 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. వీటిలోఆర్‌కామ్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫిన్‌, సన్‌వారియా కన్జూమర్‌, జేకే పేపర్‌, కర్నాటక బ్యాంక్‌, కరూర్‌వైశ్యా బ్యాంక్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి. 


ఎంఏసీడీ ఒక్కటే చాలదు..
మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి. 
ఎంఏసీడీ అంటే...
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  You may be interested

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు@రూ.1300

Tuesday 28th August 2018

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు మంగళవారం సరికొత్త రికార్డును సాధించింది. ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు నేటి ట్రేడింగ్‌లో రూ.1300ల మైలురాయిని అధిరోహించింది. తన టెలికాం అనుబంధ జియో జూన్ క్వార్టర్‌లో జియో రెవెన్యూ మార్కెట్ షేర్ 22.4 శాతానికి పెరగడంతో టెలికాం రంగంలో రెండో అతిపెద్ద టెల్కోగా అవతరించింది. జియో ఇచ్చిన బూస్ట్‌తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు కిత్రం ట్రేడింగ్‌లో

మార్కెట్లో ముందే దివాళీ!

Tuesday 28th August 2018

ఇండియా ఇన్ఫోలైన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ ఈక్విటీల్లో ఇన్వెస్టర్ల దూకుడుతో మార్కెట్లలో ముందే పండుగల సీజన్‌ వచ్చేసిందని ఇండియా ఇన్ఫోలైన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ వ్యాఖ్యానించారు. వచ్చే దీపావళిలోపే నిఫ్టీ 12,000 పాయింట్ల మైలురాయిని తాకే ఛాన్సులు ప్రస్ఫుటంగా ఉన్నాయన్నారు. అతిత్వరలో బ్యాంకు నిఫ్టీ 30వేల పాయింట్ల మైలురాయిని చేరుతుందని అంచనా వేశారు. ఇప్పటివరకు ఆర్‌ఐఎల్‌, ఐసీఐసీఐ, యాక్సిస్‌బ్యాంక్‌ మార్కెట్లను నడిపించాయని, ఇకపై సన్‌ఫార్మా, ఐటీసీ, ఎల్‌ అండ్‌ టీ షేర్లు

Most from this category