STOCKS

News


ఎఫ్‌ఐఐల వాటా ఎక్కువ ఉంటే రిస్కేనా.?!

Friday 28th September 2018
Markets_main1538074419.png-20650

ఇటీవలి స్టాక్‌ మార్కెట్‌ పతనానికి ఎన్నో అంశాలు నేపథ్యంగా ఉండగా, ఎఫ్‌ఐఐల అమ్మకాలతో స్టాక్స్‌ వారీగా నష్టాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఎఫ్‌ఐఐలు సెప్టెంబర్‌ నెలలోనే ఇంత వరకు రూ.12,000 కోట్లను భారత క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి తరలించుకుపోయారు. గత రెండు నెలల నుంచి వీరు నికర అమ్మకందారులుగానే ఉన్నారు. దీంతో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు ఎక్కువగా ఉన్న సుమారు 50 స్టాక్స్‌ ఏకంగా 20 నుంచి 50 శాతం మధ్య పతనం అయ్యాయి. ఎఫ్‌ఐఐల వాటా ఎక్కువగా ఉండడం ఆయా స్టాక్స్‌ భారీ నష్టాలకు కారణాల్లో ఒకటి.  

 

విదేశీ పోర్ట్‌ ఫోలియో ఇన్వెస్టర్లు 20 నుంచి 50 శాతం మధ్య వాటా కలిగి ఉన్న స్టాక్స్‌ నష్టాలను గమనిస్తే... ఒక్క సెప్టెంబర్‌ మాసంలోనే రెండంకెల స్థాయిలో ఉన్నాయి. వీటిలో దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, జైప్రకాష్‌ అసోసియేట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, యస్‌ బ్యాంకు, హెచ్‌డీఐఎల్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, యూనిటెక్‌, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, రాడికో ఖైతాన్‌, బ్యాంకు ఆఫ్‌ బరోడా, శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌, జేబీఎఫ్‌ ఇండస్ట్రీస్‌, శ్రేయి ఇన్‌ఫ్రా, నిట్కో, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, కిర్లోస్కర్‌ ఆయిల్‌ ఇంజన్స్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, వీఐపీ ఇండస్టీ‍్రస్‌, ఎస్కార్ట్స్‌, 5 పైసా క్యాపిటల్‌, ఇండోసోలార్‌ క్యాపిటల్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, ఎడెల్వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, పీఎన్‌బీ హౌసింగ్‌, డీబీ రియాలిటీ, మనప్పురం ఫైనాన్స్‌, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, డెల్టాకార్ప్‌, ఐడీఎఫ్‌సీ, ధనలక్ష్మి బ్యాంకు, క్యాపిటల్‌ ఫస్ట్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంకు, మాగ్మా ఫిన్‌కార్ప్‌ ఉన్నాయి. ఈ కంపెనీల్లో ఎఫ్‌పీఐలకు 10-54 శాతం మధ్య వాటా ఉండగా, ఇవి గరిష్ట స్థాయిల నుంచి 20-55 శాతం మధ్య నష్టపోవడం గమనార్హం. 

 

కారణాలు...?
‘‘వ్యాల్యూషన్లు మరింత విస్తరించడం సూచీల్లో దిద్దుబాటుకు దారితీసింది. విడిగా స్టాక్స్‌లో, మార్కెట్‌ వ్యాప్తంగా దిద్దుబాటు చాలా ఎక్కువగా ఉంది. పలు స్టాక్స్‌లో మార్కెట్‌ క్యాప్‌ 50 శాతం మేర ఆవిరైపోవడాన్ని చూస్తున్నాం. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు వాటా అధికంగా ఉన్న స్టాక్స్‌కు అధిక పెట్టుబడుల ఉపసంహరణ రిస్క్‌ ఉంటుంది. రూపాయి బలహీనత, క్రూడ్‌ ధరల వంటి అంశాల నేపథ్యంలో సమీప కాలంలో వారు మరింతగా విక్రయాలు జరపొచ్చు’’ అని గిన్నెస్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ సౌమేన్‌ ఛట్టర్జీ పేర్కొన్నారు. ప్రధాన సూచీల్లో ఎఫ్‌ఐఐల వాటా అధికంగా ఉన్న స్టాక్స్‌ కూడా 15-20 శాతం స్థాయిలో దిద్దుబాటుకు గురైన విషయాన్ని గుర్తు చేశారు. అయితే, ఎఫ్‌ఐఐల వాటా రెండంకెల స్థాయిలో కలిగిన సుమారు 9 స్టాక్స్‌ మాత్రం ఈ నెలలో 11-36 శాతం మధ్య లాభపడడం గమనార్హం. వీటిలో స్టార్‌కామ్‌ ఇన్ఫర్మేషన్‌, ప్రజ్‌ ఇండస్ట్రీస్‌, హాత్‌వే కేబుల్‌, బయోకాన్‌, రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌, పొన్ని షుగర్స్‌, యూనిఫాస్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఫైవ్‌కోర్‌ ఎ‍గ్జిమ్‌ ఉన్నాయి.
 You may be interested

కరెక్షన్‌తో చేతికి అందుతున్న ఫలాలు?

Friday 28th September 2018

మార్కెట్‌ ర్యాలీలో రోజురోజుకీ నూతన గరిష్ట స్థాయిలను నమోదు చేసిన కొన్ని స్టాక్స్‌, మార్కెట్‌ పతనంతో యూటర్న్‌ తీసుకున్నాయి. ర్యాలీలో కొందామన్నా పరుగులు తీస్తూ అందకుండా పోయిన స్టాక్స్‌ ఇప్పుడు కనిష్ట ధరలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాల ఇన్వెస్టర్లు మంచి విలువ కలిగిన స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లకు స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ విభాగంలో

11,000ల దిగువకు నిఫ్టీ

Thursday 27th September 2018

మార్కెట్‌ పతనం ఆగట్లేదు. సెప్టెంబర్‌ నెల డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు చివరి తేది కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత, ఇంట్రాడేలో డాలర్‌ మారకంలో రూపాయి మళ్లీ క్షీణించడం, ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం, కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ తదితర అంశాలు మార్కెట్‌ నష్టాలకు కారణమయ్యాయి. ఫార్మా, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ మెటల్‌ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు వరుసగా రెండోరోజూ నష్టాలతోనే ముగిశాయి. ఫలితంగా నిఫ్టీ

Most from this category