STOCKS

News


ఫార్మా క్యూ1 లాభాల్లో 50 శాతం వృద్ధి..!

Friday 13th July 2018
Markets_main1531471267.png-18280

ముంబై: జూన్‌ త్రైమాసికంలో ఫార్మా రంగ కంపెనీల నికర లాభాలు 50 శాతం వరకు వృద్ధి చెందేందుకు అవకాశం ఉందని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఈ రంగంలో ధరల ఒత్తిడి కొనసాగుతూనే ఉన్నప్పటికీ.. నియంత్రణా పరమైన వాతావరణం సానుకూలంగా మారుతుండడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనత కారణంగా లాభాలలో వృద్ధికి ఆస్కారం మెండుగా ఉందని భావిస్తున్నాయి. ఫార్మా రంగ ఆదాయం తొలి త్రైమాసికంలో 17 శాతం వరకు పెరుగుదలను నమోదుచేయవచ్చని అంచనావేసిన ఎడిల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌.. నికర లాభం 50 శాతం వరకు పెరగవచ్చని అంచనావేస్తోంది. నికర లాభం 44 శాతం వరకు పెరిగేందుకు అవకాశం ఉందని మరో బ్రోకింగ్‌ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ అంచనావేసింది. ఇదే స్థాయి అంచనాను ప్రకటించిన ఫిలిప్ క్యాపిటల్‌.. అబ్రివేయేటెడ్ న్యూ డ్రగ్‌ అప్లికేషన్స్‌ (ఏఎన్‌డీఏ) అనుమతుల రేటు గడిచిన మూడు నెలలకాలంలో 112 నుంచి 200 వద్దకు పెరిగినట్లు వివరించింది. బయోకాన్, సిప్లా, దివీస్ లాబ్స్, ఐపీసీఏ ల్యాబ్, సన్ ఫార్మా షేర్లపై పాజిటీవ్‌గా ఉన్నట్లు తెలిపిన ఈ బ్రోకింగ్‌ సంస్థలు.. త్రైమాసిక ఫలితాల ఆధారంగా గ్లెన్‌మార్క్‌ ఫార్మా, లుపిన్‌ షేర్లపై ప్రతికూలంగా ఉన్నట్లు వెల్లడించాయి. ఫార్మా రంగంలపై సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించిన హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. లార్జ్‌క్యాప్‌ కంపెనీలు ఫలితాలు ఈ రంగ క్యూ1ను ముందంజలో నడిపిస్తాయని అంచనావేసింది. నియంత్రణా పరమైన ఇబ్బందులు తొలిగిపోతుండడం, నూతన ఉత్పత్తుల విడుదల, ధరల ఒత్తిడి కూడా తగ్గిపోతుండడం లాంటి అంశాలు ఈసారి ఫలితాలను ఆశాజనకంగా మార్చనున్నాయని విశ్లేషించింది. ఆరు త్రైమాసికాల కాలంలో రెండంకెల వృద్ధి రేటు నమోదైన త్రైమాసికంగా ఈసారి ఫలితాలు నిలవనున్నాయని భావిస్తోంది. అయితే, సాధారణ ఎన్నికలు దగ్గర పడుతుండడం వల్ల డ్రగ్‌ ప్రైస్‌ కంట్రోల్‌ ఆర్డర్‌(డీపీసీఓ) కారణంగా పలు కంపెనీలపై ఈ ఒత్తిడి ఉండనుందని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ అంచనావేస్తోంది. ఈ చట్టాన్ని పక్కాగా అమలు పరచడం వల్ల సామాన్యులకు తగ్గింపు ధరల్లో మందులను అందుబాటులో ఉంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా.. ఈ మేరకు ఔషధాలను అందించాల్సి ఉన్న కంపెనీల ఆదాయం, లాభాలపై ఒత్తిడి ఉంటుందని వివరించింది. ఈ రంగంలో మరిన్ని విలీనాలు, సముపార్జనలు, విక్రయాలు జరిగినప్పుడు వృద్ధిరేటు కొనసాగుతుందని భావించినట్లు తెలిపింది.

జూన్‌ త్రైమాసిక కాలంలో రూపాయి మారకం విలువ డాలరుతో 3.8 శాతం బలహీనపడగా.. యూరోతో 12.7 శాతం పడిపోయింది. ఇదే సమయంలో రష్యన్ రూబుల్, బ్రెజిలియన్ రియల్, సౌత్ ఆఫ్రికన్ రాండ్ మారకంలో పుంజుకున్న కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఫార్మా ఎగుమతులు పెరగనున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ (బోఫా–ఎమ్‌ఎల్‌) వ్యాఖ్యానించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక శాతం బలహీనపడితే ఫార్మా కంపెనీల సగటు ఎబిడిటా 1.1 శాతం పెరుగుతుందని విశ్లేషించింది. హెడ్జింగ్‌, వడ్డీ చెల్లింపులు తరువాత కూడా ఈ స్థాయి ప్రయోజనం ఉంటుందని వివరించింది. 

స్టాక్‌ మార్కెట్‌ పతనం చోటుచేసుకోకముందు వరకు కూడా ఫార్మా రంగంలో అధిక వాల్యూయేషన్స్‌ కొనసాగినట్లు బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. నిఫ్టీతో పోల్చితే ఏడాది కిందట 42.5 శాతం ప్రీమియంతో ఉన్న ఫార్మా రంగం ప్రస్తుతం 10.4 శాతం ప్రీమియంతో ఉన్నట్లు ఎడిల్‌వీజ్‌ వివరించింది. ప్రస్తుతం ఈ రంగం 18 రెట్లు ఫార్వార్డ్‌ ఎర్నింగ్స్‌ వద్ద ట్రేడవుతున్నట్లు తెలిపింది. డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, ఐపీసీఏలపై పాజిటీవ్‌గా ఉన్నట్లు వెల్లడించింది. గడిచిన ఆరు త్రైమాసికాలలో ఎర్నింగ్స్‌ అంచనాలు తక్కువగా ఉన్న కారణంగా ఇప్పటికీ అనేక ఫ్రెంట్‌లైన్‌ ఫార్మా షేర్లు దీర్ఘకాల సగటు వాల్యూయేషన్స్‌ వద్దనే కొనసాగుతున్నట్లు వివరించిన షేర్‌ఖాన్‌ బ్రోకింగ్‌ సంస్థ.. బయోకాన్‌, కాడిలా హెల్త్‌కేర్‌, సిప్లా, సన్‌ఫార్మా షేర్లను సిఫార్సు చేసింది. ఈ రంగంలో ఇప్పుడు చూడవలసిన ముఖ్య విషయాల పరంగా.. ఉత్పత్తుల అనుమతి, ఎఫ్‌డీఏ అప్‌డేట్స్‌, యాజమాన్య వ్యాఖ్యానాలు, ఎక్స్ఛేంజ్‌ రేట్‌ చూడాలని వివరించిన షేర్‌ఖాన్‌, ఎర్నింగ్స్‌ పెరుగుదల తగ్గుదలకు ఇవే ముఖ్యంగా ఉన్నట్లు తెలిపింది.


 



You may be interested

ఓవర్‌బాట్‌లోకి పోతున్నాం... జాగ్రత్త!

Friday 13th July 2018

నిపుణుల హెచ్చరిక దేశీయ సూచీలు వర్ధమాన దేశాల సూచీలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాయి. అయితే అంతర్జాతీయంగా లిక్విడిటీ పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయని, ఈ నేపథ్యంలో సూచీల పరుగుపై అప్రమత్తత అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు అప్రమత్తతకు సంకేతంగా భావించే మరికొన్ని సంకేతాలను కూడా చూపుతున్నారు... - ప్రస్తుతం 200 డీఎంఏకు పైన ట్రేడయ్యే స్టాక్స్‌ శాతం ఓవర్‌బాట్‌ రీజియన్‌లోకి ప్రవేశిస్తోంది. సెన్సెక్స్‌లో దాదాపు 55 శాతం వాటాకు సమానమైన షేర్లు ప్రస్తుతం

రూ.1100 దాటిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

Friday 13th July 2018

రూ.7లక్షల కోట్లకు చేరిన మార్కెట్‌ క్యాప్‌ ముంబై:- రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు రికార్డు ర్యాలీ పరంపర ఆగడం లేదు. శుక్రవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు మరో 2.31శాతం లాభపడి రూ.1107.2ల వద్ద తమ సరికొత్త ఆల్‌టైం హైని నమోదు చేసింది. ఆ క్రమంలోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌మార్కెట్ క్యాపిటలైజేషన్‌ తొలిసారి రూ.7లక్షల కోట్లకు చేరింది. నేడు బీఎస్‌ఈలో రిలయన్స్‌ షేరు రూ.1082.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గత వరుస లాభాల ట్రేడింగ్‌ను

Most from this category