STOCKS

News


పదేళ్లలో పదివేల శాతం రాబడులను ఇచ్చిన స్టాక్స్‌

Monday 17th September 2018
Markets_main1537123327.png-20297

స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించి పెట్టుబడి నాడి తెలిస్తే సామాన్యులు సైతం కుబేరులవుతారనడానికి ఎన్నో ఉదాహరణలు, నిదర్శనాలు ఉన్నాయి. ఎవరినో చూసి ఫాలో అయిపోకుండా తెలివైన ఇన్వెస్టర్లు పూర్తి అవగాహనతో, సరైన అడుగులు వేస్తే స్టాక్‌ మార్కెట్లో మంచి రాబడులనే సమకూర్చుకోవచ్చు. ఇందుకు ఈ స్టాక్సే నిదర్శనం.

 

2008లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు పెద్ద పతనా‍న్ని చవిచూశాయి. ఇన్వెస్టర్ల సంపదలో 40 శాతం ఆవిరైపోయింది. లెహమాన్‌ బ్రదర్స్‌ 2008లోనే దివాలా తీసింది. దాంతో నిఫ్టీ 2008 ఆగస్ట్‌లో 4,500 స్థాయి నుంచి అక్టోబర్‌ 27 నాటికి 2,261 పాయింట్లకు పతనమైంది. అక్కడి నుంచి నిఫ్టీ 400 శాతం ర్యాలీ చేయగా, ఇదే కాలంలో కొన్ని స్టాక్స్‌ 10,000 నుంచి 50,000 శాతం రాబడులను ఇచ్చాయంటే నమ్మక తప్పదు. సాధారణంగా పెద్ద పతనాల్లో బలమైన కంపెనీల స్టాక్స్‌ సైతం చాలా చౌక ధరలకు పడిపోతాయి. కారణం భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు చేయడం వల్లే. కానీ, ఇవి ప్రైస్‌ కరెక్షన్లే కానీ, ఆయా కంపెనీల మూలాలకు ఎటువంటి నష్టం ఉండదు. కనుక ఈ తరహా ప్రతికూల సమయాల్లో మంచి కంపెనీల స్టాక్స్‌ను చౌకగా కొనుగోలు చేస్తే భారీ రాబడులను దీర్ఘకాలంలో సమకూర్చుకునేందుకు అవకాశాలు ఉంటాయి.

 

2008 అక్టోబర్‌ 27 నాటికి ఉన్న ధర, ఈ ఏడాది సెప్టెంబర్‌ 12 నాటికి ఉన్న ధరల ఆధారంగా చూస్తే... టేస్టీ బైట్‌ ఈట్స్‌ నాడు రూ.17.55వద్ద ట్రేడ్‌ కాగా, అక్కడి నుంచి ఒక్కో షేరు రూ.9,752(55,460 శాతం)కు చేరుకుంది. సింఫనీ రూ.2.23 నుంచి రూ.1,011కు (45,350 శాతం), రిలాక్సో ఫుట్‌వేర్‌ రూ.2.97 నుంచి రూ.832కు, సఫారీ ఇండస్ట్రీస్‌ రూ.3.20 నుంచి రూ.883కు, అవంతి ఫీడ్స్‌ రూ.1.84నుంచి రూ.413.40కు, ఆస్ట్రాల్‌ పాలీ టెక్నిక్‌ రూ.5.57 నుంచి రూ.1,100కు, ఐచర్‌ మోటార్స్‌ రూ.152.45 నుంచి రూ.28,819కు, అజంతా ఫార్మా రూ.6.68 నుంచి రూ.1,190కు, భారత్‌ రసాయన్‌ రూ.48 నుంచి రూ.7,641కు, లాఒపాలా ఆర్జీ రూ.1.63 నుంచి రూ.230.85కు, వినతి ఆర్గానిక్స్‌ రూ.11.12 నుంచి 1,331 వరకు, నాట్కో ఫార్మా రూ.7.99 నుంచి రూ.824 (10,210 శాతం) వరకు పెరిగాయి. ఇక మరో 449 కంపెనీలు 1,000 శాతం నుంచి 10,000 శాతం మధ్య ఈ పదేళ్లలో రాబడులను ఇవ్వడం విశేషం. అవి జేబీఎం ఆటో, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, ఇండోకౌంట్‌ ఇండస్ట్రీస్‌, వీగార్డ్‌, వీఐపీ ఇండస్ట్రీస్‌, ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్‌, అతుల్‌ ఆటో, వెంకీస్‌ ఇండియా ముత్తూట్‌ క్యాపిటల్‌ తదితర కంపెనీలు ఉన్నాయి.



You may be interested

మధ్య కాలానికి మూడు స్టాక్‌ రికమండేషన్స్‌

Monday 17th September 2018

గత వారంలో మొదటి రెండు సెషన్లలో మార్కెట్లు 1,000 పాయింట్ల వరకు పడిపోయి ఆ తర్వాత వేగంగా రికవరీ అయ్యాయి. అయితే, మొత్తం మీద వారంలో మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. గత వారం మార్కెట్ల కనిష్ట స్థాయి మద్దతుగాను, గరిష్ట స్థాయి నిరోధంగాను పనిచేస్తాయని, వచ్చే పక్షం రోజుల పాటు ఈ శ్రేణిలో ట్రేడ్‌ కావచ్చని  ‘ఈక్విటీ99’ వ్యవస్థాపకుడు సుమిత్‌ బిల్గియాన్‌ తెలిపారు. మన మార్కెట్లు అధిక విలువకు చేరడం,

ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ దెబ్బ ఎవరికి తగిలేనో?!

Saturday 15th September 2018

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌)రేటింగ్‌ను ఇక్రా తాజాగా జంక్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. దీంతో ఈ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్‌ ఫండ్స్‌తో పాటు వీటికి రుణాలిచ్చిన బ్యాంకులు సైతం ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌కు ప్రైవేట్‌ బ్యాంకుల కన్నా ప్రభుత్వ రంగ బ్యాంకులే ఎక్కువగా రుణాలిచ్చాయి. ఈ గ్రూప్‌లో ఆర్థిక బలహీనతలు ఇలాగే కొనసాగితే పలు పీఎస్‌బీలకు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Most from this category