STOCKS

News


స్వల్పకాలానికి నార్నోలియా సిఫార్సులు

Monday 17th September 2018
Markets_main1537169888.png-20325

తక్కువ సమయంలో 26 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ రికమండ్‌ చేస్తోంది.
1. యూఫ్లెక్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 430. స్టాప్‌లాస్‌ రూ. 305. ఇటీవల కాలంలో రూ. 250 వద్ద బాటమ్‌ అవుట్‌ అయింది. తాజాగా నెక్‌లైన్‌ వద్ద బుల్లిష్‌ క్యాండిల్స్‌ ఏర్పరుస్తూ బ్రేకవుట్‌ సంకేతాలు ఇస్తోంది. ఎంఏసీడీ, ఆర్‌ఎస్‌ఐ ఇండికేటర్లు ఇదే అంశాన్ని బలపరుస్తున్నాయి. రూ. 330- 340 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు.
2. బీఓఐ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 109. స్టాప్‌లాస్‌ రూ. 85. ఫాలింగ్‌ ఛానెల్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది. ప్రస్తుతం ఫాలింగ్‌ ఛానెల్‌ అప్పర్‌లైన్‌ గట్టి మద్దతుగా నిలుస్తోంది. డైలీ చార్టుల్లో మార్నింగ్‌ స్టార్‌ క్యాండిల్‌ బుల్లిష్‌నెస్‌కు సంకేతం. ఆర్‌ఎస్‌ఐ 30 స్థాయి వద్ద బాటమ్‌ అవుట్‌ అయింది. ఫాలింగ్‌ ఛానెల్‌ అప్పర్‌లైన్‌కు ఎగువన ఉన్నంత కాలం బుల్లిస్‌నెస్‌కు అవకాశం ఉంది. 
3. యస్‌బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 370. స్టాప్‌లాస్‌ రూ. 298. డైలీ చార్టుల్లో మార్నింగ్‌ స్టార్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. రూ. 310 వద్ద బాటమ్‌ అవుట్‌ చెందుతున్న సంకేతాలున్నాయి. ఊర్ధ్వముఖ వాలు రేఖ వద్ద మద్దతు పొందింది. ఇండికేటర్లు ఓవర్‌సోల్డ్‌ స్థితి చూపుతున్నాయి. రూ. 320 రేంజ్‌లో కొనుగోలు చేయవచ్చు. 
4. అపోలో హాస్పిటల్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1220. స్టాప్‌లాస్‌ రూ. 1049. గత గరిష్ఠం నుంచి మంచి కరెక‌్షన్‌ చవిచూసింది. దిగువన డబుల్‌బాటమ్‌ స్థాయి ఏర్పరుచుకుంది. ఆర్‌ఎస్‌ఐ ట్రెండ్‌ రివర్సల్‌ సిగ్నల్స్‌ ఇస్తోంది. రూ. 1125కు పైన అప్‌సైడ్‌ వేగం పెరుగుతుంది. 
5. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2185. స్టాప్‌లాస్‌ రూ. 1948. డైలీ చార్టుల్లో రూ. 1989 వద్ద బాటమ్‌అవుట్‌ అవుతున్న సంకేతాలున్నాయి. చార్టుల్లో మార్నింగ్‌స్టార్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. పొలారిటీ సూత్రం ప్రకారం అప్‌మూవ్‌ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంఏసీడీ, ఆర్‌ఎస్‌ఐల్లో ట్రెండ్‌ రివర్సల్‌ కనిపిస్తోంది. 



You may be interested

బాటమ్‌కు సమీపంలో వర్ధమాన మార్కెట్లు

Monday 17th September 2018

వర్ధమాన మార్కెట్ల పతనం బాటమ్‌కి సమీపంలో ఉందని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అంచనా వేసింది. ఫిలిప్పిన్స్‌ వంటి దేశాలు ఇంకా సతమతమౌతున్నాయని పేర్కొంది. ఇక డాలర్‌ పొజిషన్లపై తటస్థ వైఖరిని అవలంబించింది. డాలర్‌ దిశ ఎటువైపు అయినా ఉండొచ్చని, ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అంచనాకు రాలేమని పేర్కొంది. అధిక ట్రేజరీ ఈల్డ్స్‌, అమెరికాలో పన్ను తగ్గింపు చర్యలు, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు వంటి అంశాలు వర్ధమాన కరెన్సీల పతనానికి ప్రధాన

ర్యాలీకి ఇక ముగింపు!!

Monday 17th September 2018

గత 3-4 నెలలుగా ఔట్‌పర్ఫార్మ్‌ చేస్తూ వచ్చిన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు ఆలసిపోయినట్లు కనిపిస్తున్నాయి. గోల్డ్‌మన్‌ శాక్స్‌ కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ల ర్యాలీ ఇక అయిపోయిందని తెలిపింది. వ్యాల్యుయేషన్స్‌ పెరిగిపోవడం, ఆర్థిక వృద్ధి మందగించ్చొనే అంచనాలు, రానున్న ఎన్నికలు వంటి వాటి వల్ల సెన్సెక్స్‌, నిఫ్టీ ఇండెక్స్‌లు తక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. కాగా గోల్డ్‌మన్‌ శాక్స్‌.. భారత్‌ రేటింగ్‌ను బై నుంచి

Most from this category