STOCKS

News


షార్ట్‌టర్మ్‌ కోసం ఐదు రికమండేషన్లు

Wednesday 3rd October 2018
Markets_main1538553474.png-20824

వచ్చే ఒకటి రెండు నెలల్లో 13 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ శాంక్టమ్‌ వెల్త్‌ రికమండ్‌ చేస్తోంది.
1. ఇన్ఫోసిస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 850. స్టాప్‌లాస్‌ రూ. 710. ఏడాదిగా హయ్యర్‌ టాప్స్‌ ఏర్పరుస్తూ అప్‌ట్రెండ్‌లో ఉంది. తాజాగా వచ్చిన పతనంలో ఊర్ధ్వముఖ ట్రెండ్‌లైన్‌ వద్ద మద్దతు తీసుకుంది. ఇదే ప్రాంతంలో 21 రోజుల డీఎంఏ స్థాయి కూడా ఉంది. సోమవారం షేరు మరో ఆల్‌టైమ్‌ హైని తాకింది. ఎంఏసీడీ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇతర ఇండికేటర్లు సైతం బుల్లిష్‌గా మారాయి.
2. సన్‌ఫార్మా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 720. స్టాప్‌లాస్‌ రూ. 605. ఆల్‌టైమ్‌ హై 1200 రూపాయలను తాకిన అనంతరం రూ. 430 కనిష్ఠానికి జారింది. అనంతరం రూ. 430- 600 మధ్య డబుల్‌బాటమ్‌ ఏర్పరుచుకుంది. తాజాగా ఆగస్టులో పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. అనంతరం రెండునెలలుగా రూ. 670 రేంజ్‌లో కన్సాలిడేట్‌ అవుతూ వస్తోంది. ఇప్పుడిక ఈ స్థిరీకరణ జోన్‌ నుంచి మరో ర్యాలీకి సిద్ధమైంది.
3. పేజ్‌ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌: రూ. 36500. స్టాప్‌లాస్‌ రూ. 31500. దీర్ఘకాలిక చార్టుల్లో అప్‌ట్రెండ్‌లో ఉన్నట్లు సూచిస్తోంది. ఇటీవల చిన్న కరెక‌్షన్‌ చూసి అనంతరం గతవారం రూ. 29500 వద్ద మద్దతు తీసుకుంది. గత నాలుగు వారాలుగా ఎంత పతనం వచ్చినా కీలక 31500 పాయింట్ల పైనే వారాంతంలో క్లోజవుతూ రావడం పాజిటివ్‌ విషయం. త్వరలో ర్యాలీకి సిద్ధంగా ఉన్నట్లు ఇండికేటర్లు సంకేతాలు ఇస్తున్నాయి. 
4. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2190. ఆల్‌టైమ్‌హై 2220 రూపాయలను చేరి వేగంగా 1910 రూపాయల వరకు పతనమైంది. గత ర్యాలీకి ఇది 78.2 శాతం రిట్రేస్‌మెంట్‌స్థాయి. ఇక్కడ మద్దతు కూడగట్టుకొని క్రమంగా రూ. 2000 పైకి ఎగిసింది. ఇక్కడ నుంచి మరింత ముందుకు పోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు టెక్నికల్‌ ఇండికేటర్లు సూచిస్తున్నాయి.
5. ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2100. స్టాప్‌లాస్‌ రూ. 1850. రెండు వారాల క్రితం రూ. 1880 నిరోధాన్ని భారీ వాల్యూంలతో ఛేదించింది. అనంతరం చిన్న పాటి పతనం, కన్సాలిడేషన్‌ చవిచూసింది. తిరిగి 50 రోజుల డీఎంఏ స్థాయికి పైన క్లోజయి పాజిటివ్‌ మూమెంటమ్‌ చూపుతోంది. ఎంఏసీడీ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఇచ్చింది. 

 You may be interested

రూపాయి రికవరీ: నష్టాల్లో ఐటీ షేర్లు

Wednesday 3rd October 2018

ముంబై:- రూపాయి మారకం రికవరీ కారణంగా బుధవారం మిడ్‌ సెషన్‌ సమయానికి ఐటీ షేర్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 85 డాలర్లకు చేరడంతో నేడు ఇండియన్‌ రూపాయి తన జీవిత కాలంలోనే తొలిసారిగా 73 మార్క్‌ దిగువకు పతనమైంది. నేటి ఇంట్రాడేలో డాలర్‌ మారకంలో రూపాయి 73.34 వద్ద కొత్త కనిష్ట స్థాయిన్ని నమోదు చేసింది. రూపాయి పతననానికి అడ్డుకట్టు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంధన

రూపీ ఇంకా పడొచ్చు.. ఐటీ, ఫార్మాపై కన్నేయండి..

Wednesday 3rd October 2018

ఇండియన్‌ రూపాయి బుధవారం 73 మార్క్‌ దిగువకు పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే జీవిత కాల కనిష్ట స్థాయి 73.40ని తాకింది. అయితే ఈ పతనం మరింత కొనసాగవచ్చని మర్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఫౌండర్‌ సౌరభ్‌ ముఖర్జీ తెలిపారు. ‘ఆర్‌బీఐ చర్యలు మార్కెట్‌లో లిక్విడిటీ సమస్యను శాంతింపజేస్తున్నాయి. అయితే ఆర్‌బీఐ రూపాయి పతనాన్ని నియంత్రించకపోవచ్చు. క్రూడ్‌ ధరలు పెరుగుతున్నాయి. ఆర్‌బీఐ వ్యవస్థలోకి ఎక్కువ లిక్విడిటీని తీసుకువస్తోంది. దీని వల్ల రూపాయిలో

Most from this category