News


షార్ట్‌ టర్మ్‌ కోసం ఐదు సిఫార్సులు

Tuesday 9th October 2018
Markets_main1539068266.png-20974

వచ్చే ఒకటి రెండు నెలల కాలంలో 15 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. 
1. రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 320. స్టాప్‌లాస్‌ రూ. 400. ఏడాదిగా లోయర్‌ టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తూ డౌన్‌ట్రెండ్‌లో ఉంది. రూ. 500- 900 మధ్య మల్టీఇయర్‌ టాపింగ్‌ ఫార్మేషన్‌ ఏర్పరిచింది. ఈ పాటర్న్‌ను తాజాగా అధోముఖంగా ఛేదించి నెగిటివ్‌ బ్రేక్‌డౌన్‌ చూపింది. ఇండికేటర్లు సైతం మరింత డౌన్‌ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. 
2. జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1330. స్టాప్‌లాస్‌ రూ. 1120. ఆగస్టులో ఆల్‌టైమ్‌ హైని తాకిన అనంతరం వేగంగా కరెక‌్షన్‌ చూసింది. తాజాగా రూ. 1080 వద్ద మద్దతు పొందుతోంది. చార్టుల్లో హామర్‌ టైప్‌ క్యాండిల్‌నే ఏర్పరిచి బౌన్స్‌బ్యాక్‌ సంకేతాలు ఇస్తోంది. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది.
3. వోల్టాస్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 420. స్టాప్‌లాస్‌ రూ. 505.  తాజాగా నెగిటివ్‌ బ్రేక్‌డౌన్‌ చూపి ఏడాది కనిష్ఠానికి దిగజారింది. చార్టుల్లో పెద్ద బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. వాల్యూంలు సైతం అధోముఖ ప్రయాణానికే అనుకూలంగా ఉన్నాయి. ఎంఏసీడీ నెగిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది.
4. పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 240. స్టాప్‌లాస్‌ రూ. 200. కొన్ని సెషన్లుగా దీర్ఘ హ్యామర్‌ క్యాండిల్స్‌ను ఏర్పరుస్తోంది. దిగువన కొనుగోళ్ల మద్దతు దొరుకుతుందని ఈ క్యాండిల్స్‌ సూచిస్తున్నాయి. స్టోకాస్టిక్‌ ఇండికేటర్‌ పాజిటివ్‌ సంకేతాలు  ఇస్తోంది. 
5. పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 1900. స్టాప్‌లాస్‌ రూ. 2200. గతనెల ఆల్‌టైమ్‌ హైని తాకిన అనంతరం క్షీణత మొదలైంది. చార్టుల్లో దీర్ఘమైన బేరిష్‌ క్యాండిల్స్‌ ఏర్పడుతూ మరింత డౌన్‌ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. ఇటీవలే కీలక మద్దతు రూ. 2275ను కోల్పోయి మరింత పతనానికి సిద్ధమైంది. You may be interested

ఎర్నింగ్స్‌ బాగుంటే.. రిలీఫ్‌ ర్యాలీ!!

Tuesday 9th October 2018

కంపెనీల ఎర్నింగ్స్‌ బాగుంటే మార్కెట్‌లో రిలీఫ్‌ ఉంటుందని సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ జగనాథం తునుగుంట్ల తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. రూపాయి పతనం వల్ల ఐటీ, ఫార్మా కంపెనీలు ఏమేరకు ప్రయోజనం పొందాయనే విషయాన్ని త్వరలో చూడబోతున్నామని తెలిపారు. రెండు విభాగాలు బాగానే ర్యాలీ చేశాయని పేర్కొన్నారు.

నిఫ్టీకి తగిన విలువ 9600-9800

Tuesday 9th October 2018

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ నిప్టీ సరైన విలువ ఎంతో తెలుసా? 9,600-9,800 స్థాయి సరైన విలువ అని చెబుతోంది ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌. ప్రఖ్యాత ఇన్వెస్టర్‌ బెంజమిన్‌ గ్రాహామ్‌ తన సెక్యూరిటీ అనాలసిస్‌ పుస్తకంలో ఉపయోగించిన రెండు పద్ధతుల ప్రేరణతో ఈ విలువ లెక్కించినట్లు తెలిపింది. నాన్‌-బ్యాకింగ్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్లలో లిక్విడిటీ ఆందోళనలు, స్థూల ఆర్థికాంశాలు క్షీణించడం వంటి అంశాల కారణంగా ఇటీవల మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొందని, దీంతో బుల్‌ మార్కెట్‌

Most from this category