News


చిన్న కంపెనీలే... రాబడుల్లో రికార్డు

Sunday 24th March 2019
Markets_main1553450643.png-24776

స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లో నేరుగా ఇన్వెస్ట్‌ చేసే వారు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంచుకునే కంపెనీలు దీర్ఘకాలంలో ఆశించిన రాబడులను ఇచ్చేవే కాకుండా, సంక్షోభాల్లో నిలబడే సామర్థ్యంతో ఉన్న వాటిని వెతికి పట్టుకోవాలి. హ్యాట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్స్‌, పీఐ ఇండస్ట్రీస్‌, సెరా శానిటరీవేర్‌, సింఫనీ, టీటీకే ప్రెస్టీజ్‌ ఈ తరహా కంపెనీలే. నిలకడమైన పనితీరు ఈ స్టాక్స్‌లో చూడొచ్చు. ప్రస్తుత సంక్షోభ సమయాల్లోనూ ఇవి తమ పనితీరుతో ఆకట్టుకున్నవే.

 

హ్యాట్సన్‌ ఆగ్రో
ఇటీవలే మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో 2,500వ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ అన్ని రకాల పాలు, పాల పదార్థాలను అందుబాటులో ఉంచింది. 2003, 2017లో ఈ షేరు ఏడాది లోపే నూరు శాతం పెరిగింది. కాకపోతే 2017లో 128 శాతం, 2016లో 23 శాతం, 2015లో 34 శాతం చొప్పున పెరిగిన తర్వాత గతేడాది 23 శాతం నష్టపోయింది. 110పీఈ రేషియోలో ట్రేడ్‌ అవుతోంది. గత పదేళ్ల సగటు పీఈ 64గా ఉంది. మ్యూచువల్‌ ఫండ్స్‌కు 3 శాతం వాటాలు ఉంటే, ఎఫ్‌పీఐలకు 5.96 శాతం వాటా ఉంది. 

 

సెరా శానిటరీవేర్‌
2018లో ఈ స్టాక్‌ 36 శాతం నష్టపోయింది. ఈ ఏడాది ఇంత వరకు 10 శాతం వరకు ర్యాలీ చేసింది. 2012లో 137 శాతం, 2014లో 153 శాతం చొప్పున ఈ షేరు పెరిగింది. 2010 నుంచి చూస్తే 2018 మినహా మిగిలిన అన్ని సంవత్సరాల్లో 83 శాతం చొప్పున రాబడులను ఇచ్చింది.  శానిటరీవేర్‌లో బలమైన మార్కెట్‌ వాటా కలిగి ఉండగా, ఫాసెట్స్‌, టైల్స్‌, వెల్‌నెస్‌ ఉత్పత్తుల విభాగాల్లోనూ తన వాటాను పెంచుకుంటోంది. అందుబాటు ధరల ఇళ్లు, ఈవే బిల్లు, బలమైన బ్రాండ్‌, రుణాల విషయంలో మంచి నియంత్రణ, విక్రయానంతర సేవలు కంపెనీ పనితీరు పెరిగేందుకు దోహదపడతాయని విశ్లేషణ.

 

పీఐ ఇండస్ట్రీస్‌
2018 డిసెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం, లాభంలో 30 శాతం చొప్పున వృద్ధి నమోదు చేసింది. కంపెనీ ఉత్పత్తులకు విదేశీ మార్కెట్లలో ఉన్న వృద్ధి అవకాశాలకు ఈ ఫలితాలు నిదర్శనమని ఎలారా క్యాపిటల్‌ తెలిపింది. దేశీయ, విదేశీ మార్కెట్లకు సంబంధించి చక్కని ఉత్పత్తుల శ్రేణి కంపెనీకి సానుకూలమని పేర్కొంది. ఈ స్టాక్‌ను రూ.1,098 టార్గెట్‌తో బై రేటింగ్‌ ఇచ్చింది. 

 

సింఫనీ
ఎవాపరేటివ్‌ కూలింగ్‌ టెక్నాలజీలో మార్కెట్‌ లీడర్‌గా ఉంది. ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద కూలర్ల తయారీ సంస్థ. 2019లో ఇప్పటి వరకు ఈ షేరు 10 శాతం పెరిగింది. గతేడాది 33 శాతం నష్టపోవడం గమనార్హం. 2011 నుంచి 2017 వరకు సానుకూల రాబడులను ఇచ్చింది. 2014లో ఏకంగా 359 శాతం పెరిగింది. ఈ షేరును రూ.1,680 టార్గెట్‌ ధరకు కొనుగోలుకు యాక్సిస్‌ డైరెక్ట్‌ రేటింగ్‌ ఇచ్చింది. ఇక వేసవి సీజన్‌ కావడంతో ఈ కంపెనీ ఉత్పత్తులకు అధిక విక్రయ అవకాశాలు కలసిరానున్నాయి.

 

టీటీకే ప్రెస్టీజ్‌
వంటింటి ఉపకరణాల్లో సాటిలేని కంపెనీ. డిసెంబర్‌ త్రైమాసికంలో ఆదాయం 20 శాతం, నికర లాభం 30 శాతం చొప్పున పెరిగాయి. 2011 నుంచి 2017 వరకు ఏడాది విడిచి ఏడాది 55 శాతం చొప్పున రాబడులను ఇచ్చిన చరిత్ర ఉంది. 2019లో ఇప్పటికే 9 శాతం పెరిగింది. సీఎల్‌ఎస్‌ఏ సంస్థ ఈ స్టాక్‌ను రూ.9,000 టార్గెట్‌తో కొనుగోలుకు రికమండ్‌ చేసింది. కుకర్లు, కుక్‌వేర్‌ విభాగంలో సామర్థ్యం పెంపునకు వచ్చే మూడేళ్ల పాటు రూ.250 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుందని చోళమండలం సెక్యూరిటీస్‌ తెలిపింది.You may be interested

11400 దిగువన ప్రారంభమైన నిఫ్టీ

Monday 25th March 2019

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం నష్టంతో మొదలైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టంతో 38,016 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల క్షీణించి 11400 దిగువున 11,395.65 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీరేట్లపై పూర్తి మెతక వైఖని ప్రకటించడం, యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ అంశం మరింత తీవ్రతరం కావడం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళన తదితర అంశాలు ప్రపంచ ఈక్విటీ

30 రోజుల్లో కదం తొక్కిన షేర్లివే

Sunday 24th March 2019

గత నెల రోజుల్లో మార్కెట్లు మంచి ర్యాలీ జరిపాయి. సూచీలు కీలక అవరోధాలను అధిగమించి గత గరిష్ట స్థాయిలకు చేరువయ్యాయి. విదేశీ పెట్టుబడిదారులు నిధుల వరద పారించడంతో సూచీలు కూడా పరుగులు పెట్టాయి. బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌ ఒక్క నెలలోనే 9 శాతం లాభపడింది. ఇందులో 30 స్టాక్స్‌ అయితే ఏకంగా 30 శాతం నుంచి 99 శాతం వరకు పెరగడం విశేషం. కార్పొరేట్‌ గవర్నెన్స్‌, లిక్విడిటీ సంక్షోభాల సమయంలో

Most from this category