STOCKS

News


ఈ ఐదూ పెట్టుబడులకు మంచి ఆప్షన్లు

Tuesday 11th June 2019
Markets_main1560191911.png-26211

ఎన్నో సవాళ్లతో కూడిన ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో నేరుగా షేర్లలో ఇన్వెస్ట్‌ చేసే వారు మూలాలు బలంగా ఉన్న కంపెనీలను ఎంచుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. ఆర్థిక వ్యవస్థ ఉద్దీపన దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలతో ఈ కంపెనీలు పుంజుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి మంచి కంపెనీలను ఎంచుకోవాలంటే అందుకోసం వివిధ అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఆదాయం, వ్యయాలు, ఎర్నింగ్స్‌, మార్జిన్లు, రిటర్న్‌ రేషియోలు, ఎబిట్డా ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటి వరకు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3,500 కంపెనీలు ఫలితాలను ప్రకటించాయి. బ్లూంబర్గ్‌ అనలిస్టులు 224 కంపెనీల ఫలితాలను విశ్లేషించగా... ఇందులో గత మూడు త్రైమాసికాల్లో వార్షికంగా ఈపీఎస్‌ వృద్ధితోపాటు, ఆదాయం 23.3 శాతం, ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ 39 శాతం చొప్పున 2017-18, 2018-19లో పెరిగినవి కేవలం ఐదు కంపెనీలే ఉన్నాయి. సగటు ఎబిట్డా మార్జిన్లు 36.3 శాతం నుంచి 38.3 శాతానికి మెరుగుపడడం కూడా జరిగింది. ఆ కంపెనీలే ఇవి...

 

పరాగ్‌ మిల్క్‌ఫుడ్స్‌
డెయిరీ కంపెనీ అయిన పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌ పాల ప్రాసెసింగ్‌, పాల ఉత్పత్తుల తయారీలో ఒకానొక ప్రముఖ కంపెనీ. 15కు పైగా ఉత్పత్తులతో కూడిన భిన్నమైన పోర్ట్‌ఫోలియో కలిగి ఉంది. ఈ కంపెనీ పట్ల ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సానుకూలంగా ఉంది. కంపెనీ పంపిణీ నెట్‌వర్క్‌ను పెంచుకోవడం, నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ పెరగడం, హెల్త్‌, న్యూట్రిషన్‌ విభాగాల్లో వాటా పెంచుకోవడమే ఇందుకు కారణాలుగా ఉన్నాయి. మూలధన నిధుల అవసరాలు తగ్గడం, అధిక సామర్థ్య వినియోగం వల్ల కంపెనీ వార్షికంగా 17 శాతం ఆదాయ వృద్ధిని, ఆర్‌వోసీఈ 20 శాతం పెరుగుదలను ‍2019-20లో చూపించనుందని ఎడెల్‌వీజ్‌ అంచనా. 

 

ఎంసీఎక్స్‌
కమోడిటీ డెరివేటివ్స్‌లో లీడింగ్‌ ఎక్సేంజ్‌. కంపెనీ మార్కెట్‌ వాటా 2018-19 నాలుగో త్రైమాసికంలో పెరిగింది.  మార్కెట్‌ లీడర్‌ కావడం, పోటీ వాతావరణంలోనూ రోజువారీ సగటు ట్రేడింగ్‌ వ్యాల్యూమ్స్‌లో వృద్ధి వంటి అంశాల కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఈ స్టాక్‌ విషయంలో బుల్లిష్‌గా ఉంది. ఇనిస్టిట్యూషన్స్‌ కూడా కమోడిటీ డెరివేటివ్స్‌లో పాల్గొనడం వల్ల ఎంసీఎక్స్‌ వ్యాల్యూమ్స్‌ ఇక ముందూ పెరుగుతాయని అంచనా వేస్తోంది. కంపెనీ ఆదాయం, లాభం 2020-21 వరకు ఏటా 18 శాతం, 14 శాతం చొప్పున పెరుగుతాయన్నది అంచనా.

 

పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌
సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, టెక్నాలజీ సేవలు అందించే ఈ కంపెనీ... ఇన్‌ఫ్రా, సిస్టమ్స్‌, టెలికం, వైర్‌లెస్‌, లైఫ్‌సైన్స్‌, హెల్త్‌కేర్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫ్రీ క్యాష్‌ ఫ్లో చక్కగా ఉండడం, మెరుగైన నిర్వహణ పనితీరు, కంపెనీ నాయకత్వంలో ఇటీవలి మార్పులు వంటి అంశాల ఆధారంగా పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ పట్ల విశ్లేషకులు బుల్లిష్‌గా ఉన్నారు. అంతర్జాతీయంగా ఐటీపై వ్యయాలు పుంజుకోవడం, రూపాయి తరుగుదల, ఉద్యోగుల పరంగా ఉ‍త్పాదకత కంపెనీకి కలిసొచ్చే అదనపు అంశాలు. ఈ స్టాక్‌ ప్రస్తుతం ఆకర్షణీయమైన వ్యాల్యూషన్స్‌లో ట్రేడ్‌ అవుతోంది. 

 

ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌
గ్రామీణ ప్రాంతాల్లో, హౌసింగ్‌ వ్యాపారం, హోల్‌సేల్‌ బిజినెస్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో బలంగా ఉంది. నిధులు సులభంగా పొందే సామర్థ్యం ఉండడం, అధిక క్రెడిట్‌ రేటింగ్‌, భిన్నమైన రుణాలతో కూడిన వ్యాపారం, రిటైల్‌ రుణాల వాటా ఎక్కువగా ఉండడం, వివేకంతో కూడిన క్యాపిటల్‌ అలోకేషన్‌ ఇవన్నీ సానుకూలతలని జేఎం ఫైనాన్షియల్‌ పేర్కొంది. 

 

శోభ
నివాసిత ప్రాజెక్టుల విభాగంలో ప్రధానంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అధిక విలువ కలిగిన ప్రాజెక్టుల పూర్తి, వసూళ్లు పెరగడం కంపెనీ నిర్వహణ పనితీరు మెరుగనకు తోడ్పడనుందని జేపీ మోర్గాన్‌ అంచనా. 2021 వరకు ఏటా అమ్మకాల్లో 10-15 శాతం వృద్ధి ఉంటుందని, వచ్చే రెండేళ్లలో రూ.25,000కోట్ల ప్రీసేల్స్‌ మార్క్‌ చేరుకుంటుందని అంచనా వేసింది.You may be interested

పాజిటివ్‌ ప్రారంభం

Tuesday 11th June 2019

అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో మంగళవారం స్టాక్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 116 పాయింట్ల లాభంతో 39,900 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 37 పాయింట్లు జంప్‌చేసి 11,960 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, కోల్‌ ఇండియా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌లు 1 శాతం వరకూ ట్రేడింగ్‌ ప్రారంభంలో జంప్‌చేయగా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌, మహింద్రా షేర్లు 1-2 శాతం మధ్య

చిన్న మొత్తమే... అయినా భారీ వ్యత్యాసం

Tuesday 11th June 2019

వేతన జీవులకు నిర్ణీత కాలానికి ఎంతో కొంత వేతన పెంపు ఉంటుంది. వ్యాపార ఆదాయంలోనూ చాలా మంది వృద్ధిని చూస్తున్న వారుంటారు. పెరిగే ఆదాయం మీ జీవన ప్రమాణాలను కూడా పెంచుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. అందుకు తగ్గ ఆర్థిక ప్రణాళిక కూడా ఎంతో అవసరం. వేతన పెంపు లేకపోతే కచ్చితంగా పునరాలోచించుకోవాల్సి ఉంటుంది. ఏటా వేతన పెంపు అన్నది ఎంతో అవసరం. ఎందుకంటే ఏటేటా ద్రవ్యోల్బణం కారణంగా డబ్బు విలువ

Most from this category