STOCKS

News


నెల రోజులకు సాంక్టమ్‌ సిఫార్సులు

Thursday 17th January 2019
Markets_main1547709013.png-23636

వచ్చే నెల రోజుల్లో 5- 15 శాతం రాబడినిచ్చే ఐదు షేర్లను కొనొచ్చని సాంక్టమ్‌ వెల్త్‌ రికమండ్‌ చేస్తోంది.
1. దివీస్‌: టార్గెట్‌ రూ. 1700. స్టాప్‌లాస్‌ రూ. 1455. చార్టుల్లో హయ్యర్‌ టాప్స్‌, హయ్యర్‌ బాటమ్స్‌ ఏర్పరుస్తూ అప్‌ట్రెండ్‌ కొనసాగిస్తోంది. గత నవంబర్‌లో ఆల్‌టైమ్‌ హైని తాకి అనంతరం కన్సాలిడేషన్‌లోకి వెళ్లింది. చార్టుల్లో త్రిభుజాకార పాటర్న్‌ ఏర్పరిచి తాజాగా దాన్నుంచి బ్రేకవుట్‌ సాధించింది. వాల్యూంలు కూడా అప్‌ట్రెండ్‌కు అనుకూలంగా ఉన్నాయి.
2. ఇన్ఫోఎడ్జ్‌(ఇండియా): టార్గెట్‌ రూ. 1800. స్టాప్‌లాస్‌ రూ. 1570. గత సెప్టెంబర్‌లో ఆల్‌టైమ్‌ హైని తాకి అనంతరం కరెక‌్షన్‌ బాట పట్టింది. రూ. 1300 వద్ద బాటమ్‌అవుటయి కన్సాలిడేషన్‌కు గురైంది. 200 రోజుల డీఎంఏ స్థాయి వద్ద మద్దతు కూడగట్టుకొని మరో అప్‌మూవ్‌కు సిద్ధంగా ఉంది. ఎంఏసీడీ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది.
3. డాబర్‌ ఇండియా: టార్గెట్‌ రూ. 490. స్టాప్‌లాస్‌ రూ. 410. ఆగస్టులో రూ. 490 స్థాయిని తాకి అనంతరం రూ. 360 వరకు పతనమైంది. ఈ స్థాయిల్లో బలమైన మద్దతు పొందుతోంది. ఇక్కడ గత ర్యాలీలో 50 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయిని పూర్తి చేసుకుంది. తాజాగా చార్టుల్లో బుల్లిష్‌ రివర్సల్‌కు సంకేతంగా పెద్ద బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. 
4. టొరెంట్‌ ఫార్మా: టార్గెట్‌ రూ. 2050. స్టాప్‌లాస్‌ రూ. 1780. రెండేళ్ల పాటు రూ. 1200- 1700 మధ్య కన్సాలిడేషన్‌లో ఉంది. సెప్టెంబర్‌లో ఈ రేంజ్‌ను ఛేదించుకొని రూ. 1873 వరకు దూసుకుపోయింది. అనంతరం కరెక‌్షన్‌కు గురై  100 రోజుల డీఎంఏ స్థాయి వద్ద మద్దతు తీసుకుంది. తాజాగా మిడ్‌టర్మ్‌ బ్రేకవుట్‌ సాధించి మరో ఆల్‌టైమ్‌ హైని తాకేందుకు రెడీగా ఉంది.
5. యాక్సిస్‌ బ్యాంక్‌: టార్గెట్‌ రూ. 750. స్టాప్‌లాస్‌ రూ. 620. చార్టుల్లో సౌష్ఠవాకార త్రిభుజాకృతిని ఏర్పరిచి మూడేళ్లు కన్సాలిడేట్‌ అయింది. ఇటీవలే ఈ పాటర్న్‌ నుంచి పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. ఏడీఎక్స్‌, ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లన్నీ పాజిటివ్‌ సంకేతాలు ఇస్తున్నాయి. వాల్యూంలు సైతం అప్‌మూవ్‌ను బలపరుస్తున్నాయి. 

 



You may be interested

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ డౌన్‌

Thursday 17th January 2019

క్రితం రోజు ర్యాలీ చేసిన పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ గురువారం నష్టాల బాట పట్టింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు ధరతో పోలిస్తే 1.50శాతం నష్టంతో 3,120.40ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లోని మొత్తం 12 షేర్లకు గానూ 10 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, ఇండియన్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం స్వల్ప లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని ప్రధాన సూచీలోకెల్లా అధికంగా నష్టపోయిన

తగ్గిన పసిడి

Thursday 17th January 2019

గరిష్టస్థాయి వద్ద లాభాల స్వీకరణతో గురువారం పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఆసియా ఈక్విటీ మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ సైతం పసిడికి ప్రతికూలాంశంగా మారింది. ఫలితంగా ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 5డాలర్ల వరకు నష్టపోయింది. ఉదయం గం.10:45ని.లకు పసిడి ధర 2డాలర్ల నష్టంతో 1,291.65 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. బ్రెగ్జిట్‌ సమస్యతో ఐరోపాలో, ప్రభుత్వం షట్‌డౌన్‌ అంశంతో అమెరికాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, ఫెడ్‌ రిజర్వ్‌

Most from this category