STOCKS

News


సాంక్టమ్‌ వెల్త్‌ స్వల్పకాల సిఫార్సులు

Tuesday 22nd January 2019
Markets_main1548141047.png-23728

రాబోయే నెల రోజుల్లో దాదాపు 15 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను సాంక్టమ్‌ వెల్త్‌ రికమండ్‌ చేస్తోంది.
1. యునైటెడ్‌ బ్రూవరీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1700. స్టాప్‌లాస్‌ రూ. 1410. గత సెప్టెంబర్‌లో గరిష్ఠాలను తాకి తిరిగి అక్టోబర్‌ నాటికి రూ. 1100 స్థాయికి పతనమైంది. అప్పటినుంచి తిరిగి క్రమానుగత రికవరీ చూపుతోంది. సోమవారం తాజా బ్రేకవుట్‌ సాధించింది జీవితకాల గరిష్ఠాన్ని చేరింది. బోలింగర్‌ బ్యాండ్‌ సహా ఇండికేటర్లు మరింత అప్‌మూవ్‌ అవకాశాలను సూచిస్తున్నాయి.
2. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2300. స్టాప్‌లాస్‌ రూ. 2080. ఏడువారాలుగా వంద రూపాయల రేంజ్‌లో కన్సాలిడేట్‌ అవుతోంది. డైలీ చార్టుల్లో త్రిభుజాకార పాటర్న్‌ ఏర్పరిచింది. ప్రస్తుతం ఈ పాటర్న్‌ నుంచి బ్రేకవుట్‌కు రెడీగా ఉంది. ఎంఏసీడీ పాజిటివ్‌ సిగ్నల్స్‌ ఇస్తోంది. 
3. ముత్తూట్‌ ఫైనాన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 625. స్టాప్‌లాస్‌ రూ. 520. పదిహేను నెలలపాటు రూ. 360- 525 మధ్య కన్సాలిడేషన్‌ జరిగింది. చార్టుల్లో రౌండింగ్‌ బాటమ్‌ పాటర్న్‌ ఏర్పాటు చేసింది. గతవారం ఈ పాటర్న్‌ నుంచి పాజిటివ్‌ బ్రేకవుట్‌ చూపింది. వాల్యూంలు కూడా మరింత అప్‌మూవ్‌కు సానుకూలంగా ఉన్నాయి. 
4. ఎన్‌ఐఐటీ టెక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1420. స్టాప్‌లాస్‌ రూ. 1200. వీక్లీ చార్టుల్లో డబుల్‌ బాటమ్‌ ఏర్పరిచింది. ప్రస్తుతం బ్రేకవుట్‌ లెవల్స్‌ వద్ద కదలాడుతోంది. ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ తదితర సూచీలు పాజిటివ్‌గా ఉన్నాయి. త్వరలో అప్‌మూవ్‌కు రెడీగా ఉంది.
5. డాబర్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 475. స్టాప్‌లాస్‌ రూ. 410. గత ఆగస్టులో రూ. 490 గరిష్ఠం నుంచి నవంబర్‌ నాటికి రూ. 360కి పడిపోయింది. అక్కడ బలమైన మద్దతు పొందింది. తిరిగి రూ. 459 వరకు బలమైన ర్యాలీ చూపింది. డిసెంబర్‌లో కన్సాలిడేషన్‌ జరిపి ప్రస్తుతం బ్రేకవుట్‌కు రెడీగా ఉంది. ఆర్‌ఎస్‌ఐలో పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. 



You may be interested

నష్టాల్లో అటో షేర్లు

Tuesday 22nd January 2019

నష్టాల మార్కెట్లో అటో షేర్లు మంగళవారం భారీగా క్షీణించాయి. మిడ్‌సెషన్‌ సమయానికి ఎన్‌ఎస్‌ఈలోని అటో ఇండెక్స్‌ 1.50శాతం పతనమైంది. ఇండెక్స్‌లో హెవీ వెయిట్‌షేర్లైన మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతి షేర్ల క్షీణత ఇండెక్స్‌ పతనానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. మధ్యాహ్నం గం.1:00లకు అటో ఇండెక్స్‌ 1.30శాతం నష్టపోయి 8,628.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి అశోక్‌ లేలాండ్‌ అత్యధికంగా 3.50శాతం నష్టపోయింది. ఎం అండ్‌ ఎం 3శాతం, టాటామోటర్స్‌

‍కళ తప్పిన మెటల్‌ షేర్లు

Tuesday 22nd January 2019

మార్కెట్‌ పతనంతో భాగంగా మెటల్‌ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మెటల్‌ షేర్ల క్షీణత దేశీయ మెటల్‌ షేర్ల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌లో 2.50శాతానికిపైగా నష్టపోయింది. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(2,945.80) ధరతో పోలిస్తే 2.50శాతం క్షీణతో 2,868.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా జిందాల్‌ స్టీల్‌ 5.50శాతం క్షీణించింది. అలాగే

Most from this category