STOCKS

News


బ్రోకరేజ్‌ పాంచ్‌ పటాకా

Friday 14th December 2018
Markets_main1544772536.png-22933

లాంగ్‌టర్మ్‌ పెట్టుబడి కోసం ప్రముఖ బ్రోకరేజ్‌లు ఐదు స్టాకులను రికమండ్‌ చేస్తున్నాయి.
1. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌: మోర్గాన్‌ స్టాన్లీ సిఫార్సు. టార్గెట్‌ రూ. 1311. ఏవియేషన్‌ రంగంలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. వాల్యూషన్లు ఆకర్షణీయంగా మారాయి. రిస్కురివార్డు నిష్పత్తి పెట్టుబడికి అనుకూలంగా ఉంది.
2. ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్స్‌: మాక్క్వైరీ సిఫార్సు. టార్గెట్‌ రూ. 290. రాబోయే రోజుల్లో ఈ రంగంలో రికవరీ వస్తుందని అంచనా. వచ్చే మూడేళ్లలో షేరు ధర రెట్టింపు కావచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడుతోంది.
3. డాబర్‌: జెఫర్రీస్‌ సిఫార్సు. టార్గెట్‌ రూ. 460. కన్జూమర్‌ స్టాకులకు డిమాండ్‌ స్థిరంగా కొనసాగుతోంది. కంపెనీ మార్కెట్‌ వాటా పెంచుకుంటూపోతోంది. కొత్త పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సరం మార్జిన్లపై భారం పెంచినా వచ్చే ఏడాది పాజిటివ్‌గా మారతాయి.
4. ఎస్‌బీఐ: మోర్గాన్‌స్టాన్లీ సిఫార్సు. టార్గెట్‌ రూ. 375. గతేడాది మొండిపద్దుల కారణంగా భారీ నష్టాలు చవిచూసింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ బాధలు ఉండకపోవచ్చని అంచనా. వచ్చే రెండేళ్లలో లాభాలు 30వేల కోట్ల రూపాయలు దాటతాయి.
5. ఎన్‌టీపీసీ: సీఎల్‌ఎస్‌ఏ సిఫార్సు. టార్గెట్‌ రూ. 180. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ఊహాగానాలు, సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ సంబంధిత సరఫరా సమస్యలతో ఇటీవల కాలంలో షేరు ధర పడిందని బ్రోకరేజ్‌సంస్థ అభిప్రాయం. ఎస్‌జేవీఎన్‌ను సొంతం చేసుకుంటుందన్న పుకార్లు నిజమైతే వేగంగా పురోగమిస్తుంది.



You may be interested

శాంతించిన టోకు ధరలు

Friday 14th December 2018

నవంబర్‌లో 4.64 శాతానికి తగ్గుదల టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్‌లో మూడు నెలల కనిష్ట స్థాయికి తగ్గింది. 4.64 శాతంగా నమోదయ్యింది. ఈ ఏడాది ఆగస్ట్‌ నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. ఆగస్ట్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 4.62 శాతంగా ఉంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే..  చక్కెర, పొగాకు, రసాయన ఉత్పత్తులు, సిమెంట్‌, టెక్స్‌టైల్స్‌ వంటి మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రొడక్టులు ద్రవ్యోల్బణం నవంబర్‌లో 4.21

ఐఓసీ షేర్లకు బైబ్యాక్‌ బూస్టింగ్‌

Friday 14th December 2018

ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌(ఐఓసీ) షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 4శాతం లాభపడ్డాయి. నిన్న జరిగిన బోర్డు సమావేశంలో రూ.4,435 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌తో పాటు, రూ.6,665 కోట్ల మధ్యంతర డివిడెంట్‌ చెల్లింపునకు అనుమతులు లభించడం షేర్ల ర్యాలీకి కారణమైంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఐఓసీ షేర్లు రూ.141.15ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో 4శాతం లాభపడి రూ.142.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని

Most from this category