STOCKS

News


ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ భారీగా పెరిగిన షేర్లివే!

Tuesday 9th April 2019
Markets_main1554803877.png-25036

ఎన్నికల తొలిదశ దగ్గరపడుతున్న సమయాన మార్కెట్లో అస్థిరత రూపుదాలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రెండ్‌ ఆధారిత ట్రేడింగ్‌ మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఏప్రిల్‌ సీరిస్‌లో ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ బాగా పెరిగిన ఐదు షేర్లను రికమండ్‌ చేస్తున్నారు.
1. అంబుజా సిమెంట్‌: ఒపెన్‌ ఇంట్రెస్ట్‌లో మార్పు: 122.52 శాతం. టెక్నికల్‌ చార్టుల్లో బలహీనంగా కనిపిస్తోంది. రూ. 210 వరకు దిగిరావచ్చని అంచనా. నెగిటివ్‌ పాటర్న్‌ కొనసాగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది.
2. జెట్‌ ఎయిర్‌వేస్‌: ఒపెన్‌ ఇంట్రెస్ట్‌లో మార్పు: 25 శాతం. రుణదాతల కంట్రోల్లోకి వచ్చిన తర్వాత షేరులో కదలికలు ఆరంభమయ్యాయి. ఇకపై కొంత కన్సాలిడేషన్‌ అనంతరం రూ. 290 వరకు చేరవచ్చని అంచనా
3. టాటా మోటర్స్‌: ఒపెన్‌ ఇంట్రెస్ట్‌లో మార్పు: 19 శాతం. తాజా ర్యాలీలో బాగా పరుగులు తీసింది. క్యు4లో మంచి ఫలితాలు ఇస్తామని కంపెనీ అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌ చెబుతోంది. అందువల్ల భవిష్యత్‌లో రూ. 235 వరకు చేరవచ్చని అంచనా.
4. డీఎల్‌ఎఫ్‌: ఒపెన్‌ ఇంట్రెస్ట్‌లో మార్పు: 75 శాతం. ఇటీవలే కంపెనీలో వాటాలున్న సింగపూర్‌ ప్రభుత్వం తమ వాటాలను విక్రయించింది. పదిరోజులుగా రూ. 210 స్థాయిని దాటేందుకు యత్నిస్తోంది. ఈ స్థాయి దాటితే మరింత అప్‌మూవ్‌ ఉండొచ్చు.
5. అమర్‌రాజా బ్యాటరీస్‌: ఒపెన్‌ ఇంట్రెస్ట్‌లో మార్పు: 58 శాతం. జాన్సన్‌ కంట్రోల్స్‌తో ఒప్పందాలు తెంచుకున్నప్పటినుంచి బేర్స్‌ పట్టులోకి జారింది. ఇటీవలే ఏడాది కనిష్ఠాన్ని తాకింది. కంపెనీలో మరో ప్రధాన వాటాదారు బ్రూక్‌ఫీల్డ్స్'‌ వాటా విషయం తేలేవరకు అస్పష్టత కొనసాగుతుందని అంచనా. 

 



You may be interested

11650పైన నిఫ్టీ ముగింపు

Tuesday 9th April 2019

రాణించిన ప్రైవేట్‌రంగ షేర్లు బ్యాంకింగ్‌, అటో రంగ షేర్ల ర్యాలీ అండతో మంగళవారం మార్కెట్‌  భారీ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 238 పాయింట్లను ఆర్జించి 38939 వద్ద, నిఫ్టీ 67.50 పాయింట్లు లాభపడి 11,650పైన 11,672 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 268 పాయింట్లు లాభపడి 30,113 వద్ద ముగిసింది.  డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడటం, రూపాయి రీకవరీ కావడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ

హెచ్‌డీఎఫ్‌సీ మరో కొత్త రికార్డు

Tuesday 9th April 2019

నాన్‌ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌(హెచ్‌డీఎఫ్‌సీ) లిమిటెడ్‌ షేర్లు మంగళవారం కొత్త రికార్డు గరిష్టానికి చేరుకున్నాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ షేరు రూ.2054.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో దాదాపు 1శాతం పెరిగి రూ.2072.90ల వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదుచేసింది. మధ్యాహ్నం గం.2:45ని.లకు షేరు గత ముగింపు(రూ.2053.09)తో పోలిస్తే అరశాతం లాభంతో రూ.2065ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా

Most from this category