STOCKS

News


జీడీపీ కంటే వృద్ధి చెందుతున్న స్టాక్స్‌ 

Tuesday 25th December 2018
Markets_main1545761997.png-23227

దేశ జీడీపికి, స్టాక్‌ మార్కెట్‌కు మధ్య పరస్పర సంబంధం ఉందని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. అందుకే జీడీపీలో భాగమైన రంగాలు, రాబడులకు భరోసానిచ్చే వాటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం వివేకం. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో జీడీపీని మించి మెరుగైన పనితీరు చూపించిన స్టాక్స్‌పై ఓ సంస్థ అధ్యయనం చేసింది. రూ.500 కోట్ల మార్కెట్‌ క్యాప్‌పైన గల 875 కంపెనీలను పరిశీలించింది. నిర్వహణ లాభం, ఈపీఎస్‌ వృద్ధి జీడీపీ కంటే ఎక్కువగా ఉన్న 18 కంపెనీలను గుర్తించింది. వీటిల్లో బ్రోకరేజీలు, అనలిస్టుల సిఫారసులు దండిగా ఉన్న ఐదు కంపెనీల వివరాలను చూస్తే...

 

మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌
కంటెయినర్లు, ల్యూబ్స్‌, పెయింట్స్‌, ఆహార ఉత్పత్తుల ప్యాకేజింగ్‌ సామగ్రి తయారీలో ఉంది. ఆహార, ఎఫ్‌ఎంసీజీ విభాగాల్లో కంపెనీ ఆదాయాలు మెరుగుపడుతున్నాయని, మైసూరు, వైజాగ్‌ ప్లాంట్ల విస్తరణతో పెయింట్స్‌ విభాగంలోనూ కంపెనీ అవకాశాలు విస్తృతం కానున్నాయని ఎస్‌ఎంసీ సెక్యూరిటీస్‌ తెలిపింది. రూ.376 టార్గెట్‌ ధరతో కొనుగోలుక సిఫారసు చేసింది. 

 

నాట్కో ఫార్మా
పరిశోధన, అభివృద్ధి ఆధారిత ఫార్మా కంపెనీ. ఫినిష్డ్‌ డోస్‌ ఫార్ములేషన్స్‌, యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రేడియంట్స్‌ తయారీ, అభివృద్ధిలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బలమైన ఉత్పత్తులు, అమెరికాలో వృద్ధి అవకాశాలు అవకాశాలు, కాంప్లెక్స్‌ ఫిల్లింగ్స్‌పై కంపెనీ దృష్టి సారించడంతో నాట్కో ఫార్మా పట్ల ఆనంద్‌రాఠి బుల్లిష్‌గా ఉంది. ఆదాయం కాంపాండెడ్‌గా 16 శాతం చొప్పున వచ్చే మూడళ్ల పాటు వృద్ధి చెందుతుందని, కంపెనీ ఏటా 8-10 ఉత్పత్తుల విడుదల లక్ష్యంతో ఉందని వివరించింది. రూ.926 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది.

 

టాటా ఎలెక్సీ
బ్రాడ్‌కాస్ట్‌, కమ్యూనికేషన్స్‌, ఆటోమోటివ్‌ రంగాలకు ప్రొడక్ట్‌ ఇంజనీరింగ్‌, డిజైన్‌, టెక్నాలజీ సేవలను అందిస్తోంది. భద్రత, నియంత్రపరమైన నిబంధలకు ప్రాధాన్యత పెరగడం, కంటెంట్‌ డెలివరీ, ఎంపిక పరంగా గణనీయమైన విస్తరణ, టీవీ, మొబైల్‌, వోవర్‌ ద టాప్‌ వంటి పలు విభాగాల్లో వినియోగం పెరగడం కంపెనీ వృద్ధి అవకాశాలను పెంచుతుందని కార్వీ సంస్థ అంచనా. రూ.1,277 లక్ష్యిత ధరకు కొనుగోలుకు సిఫారసు చేసింది.

 

ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఎక్స్‌పోజర్‌ తాలుకూ ప్రభావం ఇప్పటికే ఇండస్‌ఇండ్‌ బ్యాంకు షేరుపై ప్రతిఫలించిందని, కంపెనీ ఇతర ఆస్తుల నాణ్యత విషయంలో సందేహించక్కర్లేదన్నది యాంబిట్‌ క్యాపిటల్‌ అభిప్రాయం. మెరుగైన నిర్వహణ వాతావరణంతో రుణాల్లో వృద్ధి ద్వారా ప్రైవేటు రంగ బ్యాంకులు ఎక్కువగా లబ్ధి పొందుతాయని పేర్కొంది. బ్యాంకు రుణ పుస్తకం ఏటా 26 శాతం చొప్పున వచ్చే మూడేళ్ల పాటు పెరుగుతుందని, స్థిరమైన వడ్డీ మార్జిన్లు ఉంటాయని అంచనా వేస్తోంది. ఈ స్టాక్‌ను రూ.1,957 టార్గెట్‌తో కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. 

 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు
ప్రైవేటు రంగంలో అగ్రగామిగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లాభం ఇకముందూ స్థిరంగానే ఉంటుందని... రుణాల్లో 20 శాతంపైగా వృద్ధి, అధిక మార్జిన్లను ఇందుకు సానుకూలతలుగా బ్లూంబర్గ్‌ ఇంటెలిజెన్స్‌ తన నివేదికలో పేర్కొంది. వడ్డీ రేట్ల పెంపు ద్వారా నిధుల సమీకరణ పెరుగుదల భారానికి కళ్లెం వేయగలదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎన్‌బీఎఫ్‌సీలకు ఉన్న లిక్విడిటీ సమస్య బ్యాంకుకు ప్రయోజనం కలిగిస్తుందని తెలిపింది. ఈ స్టాక్‌కు రూ.2,404 లక్ష్యాన్ని ఇచ్చింది. 
 You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 61 పాయింట్లు డౌన్‌..

Wednesday 26th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:39 సమయంలో 5 పాయింట్ల లాభంతో 10,620 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,681 పాయింట్లతో పోలిస్తే 61 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ బుధవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

రుచి సోయా అంటే ‘పతంజలి’కి ఎందుకంత ఆసక్తి?

Tuesday 25th December 2018

బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్‌ లిమిటెడ్‌... వంట నూనెల్లో అతిపెద్ద కంపెనీ అయిన రుచిసోయాను సొంతం చేసుకునేందుకు ఇప్పటికీ ఆసక్తిగానే ఉంది. అదానీ విల్‌మర్‌ బిడ్‌ గెలిచినప్పటికీ... దివాలా పరిష్కార ప్రక్రియను ముగించే విషయంలో తీవ్ర జాప్యాన్ని పేర్కొంటూ ఆ సంస్థ తన ఆఫర్‌ను ఉపసంహరించుకోవాలని భావిస్తోంది. బిడ్డింగ్‌లో అదానీ తర్వాత పతంజలి సంస్థే రెండో స్థానంలో ఉంది కనుక, రుచి సోయా పతంజలి పరం అయ్యే అవకాశాలు

Most from this category