నెలరోజుల కోసం 5 సిఫార్సులు
By Sakshi

ముంబై: 10,600 స్థాయిలో బలమైన నిరోధాన్ని ఎదుర్కొటున్న నిఫ్టీ ఈ స్థాయి ఎగువన నిలవలేకపోతుందని, ఈ సూచీ తక్షణ మద్దతు 10,440 వద్ద ఉందని సాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ హెడ్ ఆశిష్ చతుర్మెహతా అన్నారు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 10,260 పాయింట్ల వద్ద.. ఆ తరువాత మద్దతు 10,030 దగ్గర ఉన్నట్లు విశ్లేషించారు. 10,600 స్థాయిని అధిగమించిన పక్షంలో 10750-10850 స్థాయిలో నిరోధం ఎదురవుతుందన్నారు. వచ్చే నెలరోజుల్లో 8-16 శాతం వరకు రాబడిని ఇవ్వగలిగిన 5 షేర్లను సూచించారు. వీటిలో 3 బై కాల్స్ ఉండగా, 2 సెల్ కాల్స్ ఉన్నాయి. ప్రజ్ ఇండస్ట్రీస్ | సిఫార్సు: కొనొచ్చు | ప్రస్తుత ధర రూ.114.5 | స్టాప్ లాస్: రూ.108 | టార్గెట్ ధర: రూ.130 | రాబడి అంచనా 14 శాతం జుబిలంట్ ఫుడ్‌వర్క్స్ | సిఫార్సు: కొనొచ్చు | ప్రస్తుత ధర రూ.1,101 | స్టాప్ లాస్: రూ.1,040 | టార్గెట్ ధర: రూ.1,270 | రాబడి అంచనా 15 శాతం ఐసీఐసీఐ బ్యాంక్ | సిఫార్సు: కొనొచ్చు | ప్రస్తుత ధర రూ.352 | స్టాప్ లాస్: రూ.338 | టార్గెట్ ధర: రూ.400 | రాబడి అంచనా 13 శాతం వేదాంత | సిఫార్సు: సెల్ | ప్రస్తుత ధర రూ. 203 | స్టాప్ లాస్: రూ.212 | టార్గెట్ ధర: రూ.175 | రాబడి అంచనా 16 శాతం హీరో మోటోకార్ప్ | సిఫార్సు: సెల్ | ప్రస్తుత ధర రూ.2,839 | స్టాప్ లాస్: రూ.2,960 | టార్గెట్ ధర: రూ.2,600 | రాబడి అంచనా 8 శాతం ఇవి కేవలం టెక్నికల్ అనలిస్టుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్ సూచన.
You may be interested
క్యూ2 లాభం 100%పైగా పెరిగిన కంపెనీలివే...
Tuesday 13th November 2018ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు జూలై-సెప్టెంబర్ త్రైమాసికపు ఎర్నింగ్స్ సీజన్ చివరి దశకు చేరుకుంది. నిఫ్టీ-50లో 46 కంపెనీలు, సెన్సెక్స్ 30 కంపెనీల్లో 27 ఇప్పటికే ఫలితాలను ప్రకటించాయి. ఎన్ఎస్ఈలో ఇప్పటి దాకా 1,100 కంపెనీలు క్యూ2 ఫలితాలను వెల్లడించాయి. ఇందులో 92 కంపెనీల నికర లాభం వార్షిక ప్రాతిపదికన 100 శాతానికిపైగా ఎగసింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ లాభం ఏకంగా 97 రెట్లు (9,000 శాతానికి పైగా) పెరిగింది. డీఎల్ఎఫ్, ఓరియెంటల్ హోటల్స్,
అలహాబాద్ బ్యాంక్ నష్టం @ 1,822 కోట్లు
Tuesday 13th November 2018అలహాబాద్ బ్యాంక్ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (క్యూ2, జూలై-సెప్టెంబర్) ఆర్ధిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్ రూ.1,822 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. కాగా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.70 కోట్ల నికర లాభాన్ని సాధించింది. వార్షికంగా చూస్తే ఈ క్యూ2లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 8 శాతం క్షీణతతో రూ.1,254 కోట్ల నుంచి రూ.1,150 కోట్లకు తగ్గింది. రుణ