STOCKS

News


నష్టాలను పరిమితం చేసుకోవడమే ప్రధానం

Friday 7th December 2018
Markets_main1544206430.png-22737

కొంచెం లాభం వచ్చిన వెంటనే స్టాక్స్‌ను అమ్మేయడం, కొంచెం నష్టం వస్తే మాత్రం అమ్మేయకుండా చూద్దాంలే అని కొనసాగించడం ఎక్కువ మంది ఇన్వెస్టర్లు చేసే పని ఇది. కానీ, కొన్ని లెక్కలు లేకుండా షేరు మార్కెట్లో డబ్బులు సంపాదించడం కష్టమంటున్నారు శామ్కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమీత్‌ మోది. నష్టాలు రాకుండా చూసుకోవం కంటే, వాటిని పరిమితం చేసుకోవడం అవసరమన్నారు. ఇందుకోసం ఏం చేయాలో కూడా ఆయన సూచించారు.


 
స్టాప్‌లాస్‌ను  పెట్టుకోవడం చాలా మంది చేస్తుంటారు. నష్టాలను పరిమితం చేసే విషయంలో ఇది మొదటి అంశం మాత్రమే. అయితే, ఇది అంత శాస్త్రీయమైనది కాదు. దీనికితోడు పాటించాల్సినవి కూడా ఉన్నాయి. ట్రేడర్లు కనీసం 5-6 ట్రేడ్‌లతో పోర్ట్‌ఫోలియో కలిగి ఉండాలి. 1, 2 స్టాప్‌లాస్‌లు హిట్‌ అయినా కానీ, ఇతర ఓపెన్‌ పొజిషన్లపై లాభాలు పొందగలరు. అలాగే, భిన్న రంగాల నుంచి, ఆయా రంగాల్లో లీడర్లు అయిన 10 స్టాక్స్‌ను ఎంచుకోవచ్చు. ఈ విధమైన పోర్ట్‌ఫోలియో వైవిధ్యం నష్టాలను పరిమితం చేస్తుంది. కొన్ని బెడిసికొట్టినా, మిగిలిన వాటిపై మంచి లాభాలకు అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్‌ చేసే ముందు చారిత్రక ఫండమెంటల్స్‌ను అధ్యయనం చేయాలి. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ను ఉదాహరణగా తీసుకుంటే, అది ఎప్పుడూ లాభాలను నమోదు చేయలేదు. ఎప్పటికప్పుడు పుస్తకాల్లో రుణభారం పెరుగుతూనే పోయింది. చివరికి పూర్తిగా మునిగిపోయింది. ఈ తరహా కంపెనీలకు దూరంగా ఉండాలి. టర్న్‌ అరౌండ్‌ కావడం లేదా యాజమాన్యంలో మార్పులు, పునరుద్ధరణ వంటివి జరిగితే తప్ప వీటిల్లో నష్టాలకే చాన్స్‌ ఉంటుంది.

 

ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఒక జట్టుగా కలసి పనిచేయడం వల్ల కూడా పలితాలు ఉంటాయి. దీనివల్ల విశ్వసనీయ బెట్స్‌ను భావోద్వేగాలను అధిగమించి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇన్వెస్టర్లు అడ్వైజర్ల సూచనలు కూడా తీసుకోవచ్చు. ఇన్వెసర్లు, ట్రేడర్లు ప్యానిక్‌ అవకూడదు. సానుకూల, ప్రతికూల వార్తలకు తీవ్రంగా స్పందించకూడదు. స్వల్పకాల సమస్యలను పట్టించుకోవక్కర్లేదు. నాణ్యత అంశాల ఆధారంగానే ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. మ్యాగి విషయంలో వచ్చిన ప్రతికూలతల వల్ల  నెస్లే ఇండియా షేరు ధర 2015లో రూ.7,000 స్థాయి నుంచి రూ.5,500 స్థాయికి పడిపోయింది. కానీ, గొప్ప కంపెనీలు తిరిగి అదే స్థాయిలో ఆయా అంశాలను పరిష్కరించుకుని బయటపడతాయన్న విశ్వాసంతో పెట్టుబడులు కొనసాగించి ఉంటే..., నాటి రూ.5,500 స్థాయి నుంచి నెస్లే రెట్టింపునకుపైగా రాబడులను ఇచ్చింది. అప్పులు చేసి స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయడానికి కూడా దూరంగా ఉండాలి.You may be interested

మల్టీ‍బ్యాగర్‌ రిటర్నుల కోసం ఏం చేయాలి?

Friday 7th December 2018

మార్కెట్లలో తాము పెట్టిన పెట్టుబడి ఎన్నో రెట్లు వృద్ధి చెందాలని, మల్టీబ్యాగర్‌ రిటర్నులు రాబట్టాలని దాదాపు అందరు ఈక్విటీ ఇన్వెస్టర్ల ఆలోచనల్లో ఉంటుంది. రాకేశ్‌ జున్‌జున్‌వాలా వంటి ఏ కొద్ది మందికో తెలిసిన విద్యగా దీన్ని భావించక్కర్లేదు. కొన్ని సూత్రాలను ఆచరణలో పెడితే మల్టీబ్యాగర్‌ రిటర్నులు మీ సొంతం అవుతాయి. ఇందుకు ఏం చేయాలన్నది, అలాగే, ఓ స్టాక్‌ను ఎప్పుడు విక్రయించాలన్నది వ్యాల్యూ ఇన్వెస్టర్‌ సుమీత్‌ నాగర్‌ తెలియజేశారు.    రాబడుల కోసం  అధిక

నష్టాలకు బ్రేక్‌

Friday 7th December 2018

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, అటో రంగ షేర్ల ర్యాలీతో మార్కెట్‌ మూడురోజుల నష్టాలకు శుక్రవారం బ్రేక్‌ పడింది. బెంచ్‌మార్క్‌ సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 361 పాయింట్ల లాభంతో 35673 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 92.50 పాయింట్ల లాభంతో 10693 వద్ద ముగిశాయి. గత కొద్ది రోజులుగా భారీ అమ్మకాలతో తల్లడిల్లిన ప్రపంచమార్కెట్లు తిరిగి లాభాల్లో మళ‍్లడం, రూపాయి రీకవరీ తదితర అంశాలు నేటి సూచీల లాభాల ర్యాలీకి

Most from this category