News


2 నెలలు.. 17 శాతం రాబడి..

Tuesday 24th July 2018
Markets_main1532426265.png-18618

వచ్చే 1-2 నెలల్లో 6-17 శాతం రాబడులను అందించే ఐదు స్టాక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు సాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ డేరివేటిక్స్‌ అండ్‌ టెక్నికల్స్‌ హెడ్‌ అశిష్‌ చతుర్‌మెహ్‌తా.  ఆ సిఫార్సులివే...

మారుతీ సుజుకీ ఇండియా
ప్రస్తుత ధర: రూ.9,701
స్టాప్‌ లాస్‌: రూ.9,400
టార్గెట్‌ ప్రైస్‌: రూ.10,700
రాబడి అంచనా: 10.3 శాతం

ఈ స్టాక్‌ లాంగ్‌ టర్మ్‌ అప్‌ట్రెండ్‌లో ఉంది. హైయర్‌ టాప్స్‌, హైయర్‌ బాటమ్స్‌ను ఏర్పాటు చేస్తుంది. 2017 డిసెంబర్‌లో రూ.9,996 గరిష్ట స్థాయిని తాకింది. అయితే తర్వాత రూ.8,255 స్థాయికి పడిపోయింది. వీక్లి చార్ట్‌ను గమనిస్తే డబుల్‌ బాటమ్‌ ప్యాట్రన్‌ను ఏర్పాటు చేసింది. 
అబౌవ్‌ యావరేజ్‌ వాల్యూమ్స్‌ తో  దిగువ స్థాయి నుంచి ర్యాలీ చేయడం, లాంగ్‌ బుల్లిష్‌ క్యాండిల్స్‌ వంటివి స్టాక్‌లో బయ్యర్‌ పార్టిసిపేషన్‌ను సూచిస్తోంది. గత రెండు వారాల నుంచి స్టాక్‌ నారో రేంజ్‌లో ట్రేడవుతోంది. డబుల్‌ బాటమ్‌ బ్రేక్‌ ఔట్‌ లెవెల్‌లో బుల్లిష్‌ పోల్‌, ఫ్లాగ్‌ ప్యాట్రన్‌ను ఏర్పాటు చేసింది.
సోమవారం స్టాక్‌లో బలమైన వ్యాల్యూమ్స్‌ వల్ల ఫ్లాగ్‌ ప్యాట్రన్‌ను బ్రేక్‌ ఔట్‌ చేసింది. డైలీ ఎంఏసీడీ లైన్‌ పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌ను ఏర్పరచింది. కొత్త అప్‌ట్రెండ్‌ ప్రారంభం కావొచ్చు.
ప్రస్తుత స్థాయిల్లోనే స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ స్టాక్‌  రూ.9,600కు తగ్గితే రూ.9,400 స్టాప్‌ లాస్‌తో రూ.10,500 టార్గెట్‌ ప్రైస్‌తో హోల్డ్‌ చేయవచ్చు.

ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌
ప్రస్తుత ధర: రూ.1,305
స్టాప్‌ లాస్‌: రూ.1,250
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,450
రాబడి అంచనా: 11 శాతం
2016 నవంబర్‌లో రూ.518 నుంచి 2018 జనవరిలో రూ.1,400 వరకు ఈ స్టాక్‌.. హైయర్‌ టాప్స్‌, హైయర్‌ బాటమ్స్‌ను ఏర్పాటు చేస్తూ లాంగ్‌టర్మ్‌ అప్‌ట్రెండ్‌లో ఉంది. తదుపరి దిద్దుబాటుకు లోనై ఇది సిమెట్రియల్‌ ట్రైయాంగిల్‌ ప్యాట్రన్‌ను ఏర్పాటు చేసింది. అంటే తన మునపటి ట్రెండ్‌ను మళ్లీ అనుసరించనుంది. గత రెండు సీజన్లను గమనిస్తే 200 డే మూవింగ్‌ యావరేజ్‌ నుంచి బౌన్స్‌ బ్యాక్‌ అయ్యింది. 
బొలింగర్‌ బాండ్‌ నుంచి స్టాక్‌ ధర అప్‌సైడ్‌లో బ్రేక్‌ ఔట్‌ అయ్యింది.  డైలీ చార్ట్‌లో ఏంఏసీడీ లైన్‌ పాజిటివ్‌ క్రాసోవర్‌ను ఏర్పాటు చేసింది. వీక్లి చార్ట్‌ ఈక్విలిబ్రియమ్‌ లెవెల్స్‌ నుంచి టర్న్‌ తీసుకుంది. 
అందువల్ల ఈ స్టాక్‌ను ప్రస్తుత ధర స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. రూ.1,250 స్టాప్‌ లాస్‌తో  రూ.1,450 టార్గెట్‌ ధర కోసం చూడొచ్చు.

పేజ్‌ ఇండస్ట్రీస్‌
ప్రస్తుత ధర: రూ.28,514
స్టాప్‌ లాస్‌: రూ.27,500
టార్గెట్‌ ప్రైస్‌: రూ.30,300
రాబడి అంచనా: 6.2 శాతం
గత ఆరు నెలలుగా ఈ స్టాక్‌ డైలీ చార్ట్‌లో హైయర్‌ టాప్స్‌, హైయర్‌ బాటమ్స్‌ను ఏర్పాటు చేస్తూ అప్‌ట్రెండ్‌లో ఉంది. అధిక  వ్యాల్యూమ్స్‌ వల్ల ర్యాలీస్‌ జరిగాయి. బిలో యావరేజ్‌ వ్యాల్యూమ్స్‌ వల్ల తగ్గుదల జరిగింది. ఇది స్టాక్‌పట్ల ఇన్వెస్టర్ల కొనుగోలు ఆసక్తిని సూచిస్తోంది. మార్కెట్‌ పార్టిసిపెంట్స్‌ స్టాక్‌ను హోల్డ్‌ చేస్తున్నట్లు భావించవచ్చు. డైలీ చార్ట్‌లో 20 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ అనేది స్టాక్‌కు మద్దతు, నిరోధంగా పనిచేస్తోంది. ఇటీవల గరిష్ట స్థాయి రూ.29,676 వద్ద 20 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ వద్ద మద్దతు తీసుకుంది. అందువల్ల ప్రస్తుత ధరలో లేదా  రూ.28,300కి తగ్గితే కొని,  రూ.27,500 స్టాప్‌లాస్‌తో రూ.30,300 టార్గెట్‌ ప్రైస్‌ కోసం హోల్డ్‌ చేయవచ్చు.

వోల్టాస్‌
ప్రస్తుత ధర: రూ.574
స్టాప్‌ లాస్‌: రూ.550
టార్గెట్‌ ప్రైస్‌: రూ.640
రాబడి అంచనా: 11.5 శాతం
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ స్టాక్‌ రూ.665 గరిష్ట స్థాయి నుంచి రూ.493 స్థాయికి  పతనమైంది. హై వ్యాల్యూమ్స్‌తో ఇది జరిగింది. అయితే షార్ట్‌టర్మ్‌ డైలీ చార్ట్‌లో ఈ స్టాక్‌ రూ.560, రూ.493 స్థాయిల్లో రౌండెడ్‌ బాటమ్‌ ప్యాట్రన్‌ను ఏర్పాటు చేసింది. బొలింగర్‌ బాండ్‌ నుంచి స్టాక్‌ ధర అప్‌సైడ్‌లో బ్రేక్‌ ఔట్‌ అయ్యింది.డైలీ ఎంఏసీడీ జీరో న్యూట్రల్‌ లెవెల్‌ కన్నా పైకి వెళ్లింది. బాటమింగ్‌ ప్రాసెస్‌ పూర్తయినట్లు సూచిస్తోంది. ఈ స్టాక్‌ కొత్త అప్‌ట్రెండ్‌ను చూసే అవకాశముంది. అందువల్ల ఈ స్టాక్‌ను ప్రస్తుత ధరలో కొనుగోలు చేయవచ్చు. లేదా రూ.570కి తగ్గితే కొనుగోలుచేసి, రూ.550 స్టాప్‌లాస్‌తో  రూ.640 టార్గెట్‌ ధర కోసం అట్టిపెట్టవచ్చు.

పెడిలైట్‌ ఇండస్ట్రీస్‌
ప్రస్తుత ధర: రూ.1,050
స్టాప్‌ లాస్‌: రూ.1,010
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,190
రాబడి అంచనా: 17 శాతం
ఈ స్టాక్‌ వీక్లి చార్ట్‌లో హైయర్‌ టాప్స్‌, హైయర్‌ బాటమ్స్‌ను ఏర్పాటు చేస్తూ లాంగ్‌టర్మ్‌ అప్‌ట్రెండ్‌లో ఉంది. మే నెలలో రూ.1,195 గరిష్ట స్థాయిని తాకిన తర్వాత రూ.1,019 స్థాయికి పతనమైంది.  
స్టాక్‌ ధర 89 రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ వద్ద మద్దతు స్వీకరించింది. దీనికి పై స్థాయిలో స్థిరపడింది.  రెలిటివ్‌ స్ట్రెంత్‌ ఇండెక్స్‌ డైలీ చార్ట్‌లో పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌ను ఏర్పరచింది. అందువల్ల ప్రస్తుత స్థాయిలో స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. లేదా రూ.1,040కు తగ్గితే కొని, రూ.1,010 స్టాప్‌లాస్‌తో  రూ.1,190  టార్గెట్‌ ప్రైస్‌ కోసం హోల్డ్‌ చేయవచ్చు.



You may be interested

నిఫ్టీ రికార్డు ముగింపు

Tuesday 24th July 2018

ముంబై:- మెటల్‌, ఫార్మా, ఐటీ షేర్ల మద్దతుతో మార్కెట్‌ మంగళవారం లాభాలతో ముగిసింది. ఎల్‌ అండ్‌ టీ, గ్రాసీం, ఆదిత్యా బిర్లా గ్రూప్‌ షేర్ల అండతో సెన్సెక్స్‌ మరో నూతన గరిష్టస్థాయిని నమోదు చేసింది. మరో సూచి నిఫ్టీ ముగింపులో కొత్త రికార్డును సృష్టించింది. మిడ్‌ సెషన్‌ అనంతరం బ్యాంకు షేర్లలో అమ్మకాలు నెలకొన్నా, చివరి గంటలో కొనుగోళ్లకు మద్దతు లభించడంతో సూచీలు వరుసగా మూడోరోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 106 పాయింట్ల లాభంతో

ఇది బిర్లాల రోజు..!

Tuesday 24th July 2018

జోరుగా పెరిగిన ఆదిత్యా బిర్లా గ్రూప్‌ షేర్లు సాధారణంగా టాటా, అంబానీల కంపెనీల షేర్లు కలిసికట్టుగా చేసిన ఎన్నో ర్యాలీలు మనం చూసివుంటాం. అదే బిర్లాల కంపెనీలు ఒక్క ఉదుటన ఒకేరోజున పెరగడం అరుదు. బిర్లాలకు చెందిన వివిధ గ్రూప్‌లున్నప్పటికీ, ఆదిత్యాబిర్లా గ్రూప్‌ ప్రధానమైనది. కుటుంబ గ్రూప్‌ల పరంగా అధిక మార్కెట్‌ కలిగిన మూడో గ్రూప్‌ ఇది. టాటాల తర్వాత ఎక్కువగా లిస్టెడ్‌ కంపెనీలు కలిగిన కుటుంబ గ్రూప్‌ కూడా ఇదే. ఈ గ్రూప్‌నకు

Most from this category