News


మార్కెట్‌ పతనానికి ఐదు కారణాలు..

Friday 21st December 2018
Markets_main1545385136.png-23141

ఇండియన ఈక్విటీ మార్కెట్లు శుక్రవార భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా పడిపోతే, నిఫ్టీ 180 పాయింట్లకు పైగా క్షీణించింది. మధ్యాహ్నం 2:41  సమయంలో సెన్సెక్స్‌ 594 పాయింట్ల నష్టంతో 35,835 వద్ద, నిఫ్టీ 181 పాయింట్ల 10,770 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ పతనానికి గల కారణాలను గమనిస్తే..  

అంతర్జాతీయ మార్కెట్ల పతనం..
వడ్డీ రేట్ల పెంపు, అమెరికా ప్రభుత్వం పాక్షిక మూసివేత ఆందోళనలు వంటివి అక్కడి మార్కెట్‌పై తీవ్రప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో గురువారం అమెరికా మార్కెట్లు పతనమయ్యాయి. అమెరికా మార్కెట్లు పడిపోవడంతో ఆసియా మార్కెట్లు కూడా శుక్రవారం నష్టపోయాయి. గ్లోబల్‌ ఈక్విటీల పతనం మన మార్కెట్లపై నెగటివ్‌ ప్రభావం చూపింది. మొత్తం విదేశీ వాణిజ్య రుణాలు జీడీపీలో 6.5 శాతానికి మించకూడదనే ఆర్‌బీఐ నిబంధన కూడా ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. 

ప్రపంచ వృద్ధిపై ఆందోళనలు 
ప్రపంచ వృద్ధిపై ఇన్వెస్టర్లు ఆందోళనగా ఉన్నారు. వృద్ధి మందగమన సంకేతాల నేపథ్యంలో ఫెడ్‌ వడ్డీ రేట్లు పెంచడం వల్ల రిస్క్‌ మరింత పెరిగింది. అలాగే వచ్చే ఏడాది కూడా రేట్ల పెంపు ఉంటుందని ఫెడ్‌ సంకేతాలిచ్చింది. ఓఈసీడీ ఇప్పటికే గ్లోబల్‌ వృద్ధి అంచనాలను 3.9 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గించింది. చైనాలో జీడీపీ వృద్ధి నిలకడగా 6.5 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ఐఎంఎఫ్‌ అయితే చైనా వృద్ధిని 6.2 శాతానికి తగ్గించింది. గతవారంలో జపాన్‌ ప్రభుత్వం కూడా తన వృద్ధి అంచనాల్లో కోత విధించుకుంది. 

ఐటీ స్టాక్‌పై ఒత్తిడి
రూపాయి పెరుగుదల వల్ల ఐటీ స్టాక్స్‌పై ఒత్తిగి నెలకొంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1 శాతానికి పైగా క్షీణించింది. హెవీవెయిట్‌ షేరు అయిన ఇన్ఫోసిస్‌ 2 శాతానికి పైగా నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. విప్రో, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఎన్‌ఐఐటీ టెక్‌ షేర్లు 1 శాతానికి పైగా క్షీణించాయి. రూపాయి బలపడటం ఐటీకి ప్రతికూల అంశం.

హెవీవెయిట్‌ షేర్ల క్షీణత
ఇండెక్స్‌లలో హెవీవెయిట్‌ షేర్లు బాగా నష్టపోయాయి. ప్రాఫిట్‌ బుకింగ్‌ ఇందుకు కారణం. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ షేర్లు 1-2 శాతం శ్రేణిలో నష్టపోయాయి. 

టెక్నికల్‌ ఔట్‌లుక్‌
మార్కెట్లు ఓవర్‌బాట్‌ జోన్‌లో ఉన్నాయని, అందువల్ల కరెక‌్షన్‌ సంభవించిందని టెక్నికల్‌ అనలిస్ట్‌లు పేర్కొన్నారు. అక్టోబర్‌ కనిష్ట స్థాయిల నుంచి చూస్తే సెన్సెక్స్‌ దాదాపు 3000 పాయింట్లు పెరిగిందని, గత వారం నుంచి చూస్తే 1,500 పాయింట్లకు పైగా లాభపడిందని తెలిపారు. నిఫ్టీ 50 కూడా డిసెంబర్‌ 11 (ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వెల్లడి రోజు) నాటి కనిష్ట స్థాయి 10,333 నుంచి 10,950 స్థాయికి ర్యాలీ చేసిందని పేర్కొన్నారు. అందువల్ల ప్రస్తుత కరెక‌్షన్‌ అంచనాల ప్రకారమే ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో కన్సాలిడేషన్‌ ఉంటుందని, అటుపైన అప్‌సైడ్‌ ఉండొచ్చని పేర్కొన్నారు. ‘నిఫ్టీ ఒకవేళ క్లోజింగ్‌లో 10,800 స్థాయి దిగువకు వస్తే.. అప్పుడు షార్ట్‌టర్మ్‌లో సెల్లాఫ్‌ ఉంటుంది. అప్పుడు నిఫ్టీ 10,750 స్థాయికి పడిపోవచ్చు’ అని చార్ట్‌వ్యూఇండియా చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ మజ్హర్‌ మహమ్మద్‌ తెలిపారు.  You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ పతనం

Friday 21st December 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం భారీగా పతనమైంది. సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ పడిపోయాయి. బ్యాంక్‌ నిఫ్టీ కూడా బాగానే క్షీణించింది. 1.42 శాతం లేదా 388 పాయింట్ల క్షీణతతో 26,886 పాయింట్లకు పడిపోయింది. ఇండెక్స్‌లోని దాదాపు షేర్లు నష్టపోయాయి. అయితే పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. యాక్సిస్‌ బ్యాంక్‌,

6 నెలల్లో ఆకర్షణీయంగా బ్లూచిప్స్‌!!

Friday 21st December 2018

వచ్చే 3-6 నెలల కాలంలో బ్లూచిప్‌ కంపెనీల షేర్లు ఆకర్షణీయ వ్యాల్యుయేషన్స్‌తో ఉంటాయని అవెండస్‌ క్యాపిటల్‌ ఆల్టర్నేట్‌ సీఈవో ఆండ్రూ హోలండ్‌ తెలిపారు. వచ్చే ఆరు నెలల కాలంలో గ్రామీణ డిమాండ్‌ పుంజుకోవడం వల్ల కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మిడ్‌ క్యాప్స్‌, స్మాల్‌ క్యాప్స్‌తో పోలిస్తే లార్జ్‌ క్యాప్స్‌ మంచి రాబడులు అందిస్తాయని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు

Most from this category