News


మార్కెట్‌ పతనానికి 5 కారణాలు

Thursday 6th December 2018
Markets_main1544080717.png-22697

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్లు గురువారం ఉదయం గ్యాప్‌డౌన్‌లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌, నిఫ్టీలు ఒక శాతానికి మించి నష్టాలను నమోదుచేశాయి. నిఫ్టీ 10,700 పాయింట్ల మార్కును కోల్పోయి 10,641 పాయింట్ల ఇంట్రాడే కనిష్టస్థాయిని నమోదుచేసింది. సెన్సెక్స్‌ 350 పాయింట్ల మేర నష్టపోయి 35,534 వద్దకు చేరుకుంది. ఇంతటి పతనానికి ఐదు ప్రధాన కారణాలను దలాల్‌ స్ట్రీట్‌ పండితులు వెల్లడించారు. అవేంటంటే..

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు
చైనాకు చెందిన మొబైల్ దిగ్గజ సంస్థ హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) మెంగ్ వాంగ్‌జోను కెనడా అధికారులు వాంకోవర్‌లో అరెస్టు చేశారు. ఇరాన్‌పై అమెరికా విధించిన వాణిజ్యపరమైన నిబంధలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ఈమెను వాంకోవర్‌లో అరెస్ట్‌ చేసినట్లు కెనడియన్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి ఇయాన్ మెక్లాయిడ్ వెల్లడించారు. ఈ అంశం అమెరికా, చైనా మధ్య మళ్లీ వాణిజ్య ఉద్రిక్తతలకు కారణంగా నిలవనుందని మార్కెట్‌ వర్గాలు భావించాయి. ఈ నేపథ్యంలో బుధవారం అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లకు సెలవు కాగా, గురువారం ఉదయం ఆసియా మార్కెట్‌లో ఎస్‌ అండ్‌ పీ 500 ఈ-మినీ ఫ్యూచర్స్‌ దాదాపు 2 శాతం నష్టపోయాయి. సోమవారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరిగిన జీ–20 సదస్సు సందర్భంగా అమెరికా, చైనాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం వెనక రాజకీయ కుట్రలు ఏమైనా ఉండి ఉంటాయా అనే అనుమానాలకు తావిస్తూ అరెస్టులు కొనసాగుతుండడంతో ఇటు జపాన్‌ నికాయ్‌ సైతం 0.8 శాతం పతనమైంది. సౌత్‌ కొరియా సూచీ 0.6 శాతం, ఆస్ట్రేలియా 0.2 శాతం తగ్గాయి. 

ఫైనాన్షియల్‌, మెటల్‌, ఆయిల్‌ రంగాల్లో పతనం
రిటైల్‌ రుణాల మంజూరీకి సంబంధించి ఇప్పటివరకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ (ఎంసీఎల్ఆర్) వంటి అంతర్గత బెంచ్‌ మార్క్‌ రేట్ల విధానాలు ప్రమాణికంగా ఉండగా.. ఈ స్థానంలో ఇక నుంచి బాహ్య ప్రమాణాలకు ముడిపెట్టనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లు ఒత్తిడికి గురికాగా, పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్‌) సమావేశం కారణంగా మెటల్‌, ఆయిల్‌ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. 10 గంటల 30 నిమిషాల సమయానికి ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 2 శాతం వరకు నష్టాలను నమోదుచేశాయి.

మళ్లీ పతనమైన రూపాయి
డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం ఉదయం బలహీనంగా ప్రారంభమైంది. డాలరు విలువ బలపడిన నేపథ్యంలో 54 పైసలు కోల్పోయి 71 వద్దకు సమీపించింది. 2021 ఆర్థిక సంవత్సర జీడీపీ వృద్ధి రేటు అంచనాలో కోత విధించినట్లు ఫిచ్‌ రేటింగ్‌ ప్రకటించడం కూడా సెంట్‌మెంట్‌ను బలహీనపరిచింది. 7.3 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించినట్లు తెలిపింది. రుణ లభ్యత క్లిష్టతరంగా మారుతుండడం ఇందుకు కారణంగా తెలిపింది. ఇక 2019 చివరినాటికి రూపాయి మారకం విలువ 75 స్థాయికి చేరుకుంటుందని పేర్కొనడం కూడా బలహీనతనకు కారణమైంది. 

విదేశీ నిధుల ప్రభావం
విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ), దేశీయ సంస్థాగ‌త పెట్టుబ‌డుదారులు (డీఐఐ) తగ్గిపోయి మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బీఎస్‌ఈ ప్రొవిజినల్‌ డేటా ప్రకారం బుధవారం ఎఫ్‌పీఐలు రూ.357.82 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా.. డీఐఐలు రూ.791.59 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

టెక్నికల్‌ అంశాలు
నిఫ్టీకి 200-రోజుల సగటైన 10,749 పాయింట్లు అత్యంత కీలకంగా ఉందని బుధవారం జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అడ్వైజరీ అనలిస్ట్‌ మిలన్ వైష్ణవ్ తెలిపారు. అయితే ఈ స్థాయి కంటే దిగువన ఉండడం వల్ల మార్కెట్‌లో బలహీనత కొనసాగుతోందని టెక్నికల్‌ అనలిస్టులు విశ్లేషించారు. ఈస్థాయిని అధిగమించినప్పుడే తరువాత అప్‌మూవ్‌ ఉంటుందని సూచించారు.You may be interested

నష్టాల బాటలో అటో షేర్లు

Thursday 6th December 2018

4.50శాతం నష్టపోయిన మారుతి సుజుకీ నవంబర్‌ అమ్మకాలు అతంత మాత్రంగానే నమోదు కావడంతో గురువారం అటో షేర్ల నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది. మధ్నాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(8,992.90)తో పోలిస్తే 1శాతం నష్టంతో 8,877.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలోకి మొత్తం 16 షేర్లలో 12 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 2 షేర్లు మాత్రం

జీడీపీ అంచనాల్ని తగ్గించిన ఫిచ్‌

Thursday 6th December 2018

7.8 శాతం నుంచి 7.2 శాతానికి ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ రేటింగ్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2018-19) సంబంధించి ఇండియా జీడీపీ వృద్ధి రేటు అంచనాల్లో కోత విధించింది. 7.8 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గించింది. అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరపు జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.3 శాతం నుంచి 7 శాతానికి, 2020-21 ఆర్థిక సంవత్సరపు జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.3 శాతం

Most from this category