STOCKS

News


ఆకర్షిస్తున్న 5 బ్యాంకు స్టాక్స్‌!

Wednesday 14th November 2018
Markets_main1542133950.png-21961

దేశ ఆర్థిక వ్యవస్థతో ముడిపడిన బ్యాంకింగ్‌ రంగం చారిత్రకంగా చూస్తే ఇన్వెస్టర్లకు లాభాలను పంచుతూ వస్తోంది. అయితే, ఎన్‌పీఏల సమస్యలతో ఇటీవలి కాలంలో బ్యాంకింగ్‌ స్టాక్స్‌ కళ తప్పాయి. అయితే, ఇది స్వల్ప కాలం పాటు ఉండే సమస్యే. దీని కారణంగా బ్యాంకింగ్‌ స్టాక్స్‌ చాలా వరకు విలువల పరంగా ఆకర్షణీయ స్థా‍యికి దిగొచ్చాయి. ‘‘క్రెడిట్‌ వృద్ధి మోస్తరుగా ఉంది. పీఎస్‌యూ బ్యాంకులు తమ డిపాజిట్‌ బేస్‌ను పెంచుకున్నాయి. రుణ నాణ్యతపై ఒత్తిళ్లు తగ్గుముఖం పడితే వాటి వ్యాపార మూలాలు మెరుగుపడతాయి’’ అని హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ సీఐవో ప్రశాంత్‌జైన్‌ పేర్కొన్నారు. చాలా వరకు ప్రతికూలతలు ముగిశాయని, డిసెంబర్‌-జనవరి మధ్య మరోసారి కరెక్షన్‌ ఉండొచ్చని, ఇది కొనుగోలుకు మంచి అవకాశమని ఇండియాఫస్ట్‌ లైఫ్‌ సీఐవో ఏకే శ్రీధర్‌ పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు జాగ్రత్తగా బ్యాంకు స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నిపుణులు పలు అంశాల ఆధారంగా ఐదు బ్యాంకు స్టాక్స్‌ను పెట్టుబడికి ఆకర్షణీయంగా పేర్కొంటున్నారు.

 

ఎస్‌బీఐ
భారీ సంఖ్యలో శాఖల నెట్‌వర్క్‌ ఎస్‌బీఐకి బలం. మరే బ్యాంకు ఈ స్థాయికి చేరుకోవడం కష్టమే. అధిక కాసా రేషియో 45 శాతం ఉండడాన్ని గమనించొచ్చు. ఆస్తుల నాణ్యత మెరుగుపడడంతో సెప్టెంబర్‌ త్రైమాసికంలో లాభాన్ని ప్రకటించింది. స్థూల ఎన్‌పీఏలు 9.8 శాతానికి నికర ఎన్‌పీఏలు 4.8 శాతానికి తగ్గాయి. రిటైల్‌ డిపాజిట్లు, రుణ పోర్ట్‌ఫోలియో పనితీరు బాగుంది. కార్పొరేట్‌ రుణాలు సైతం తగిన నియంత్రణలోనే ఉన్నాయి. కార్పొరేట్ల రికవరీ, చౌక వ్యాల్యూషన్లు, సబ్సిడరీల ద్వారా అధిక విలువ సమకూరడం వంటి అంశాలతో ఎస్‌బీఐకి తాము ప్రాధాన్యం ఇస్తున్నట్టు జేఎం ఫైనాన్షియల్‌ నివేదిక తెలియజేసింది.


బ్యాంకు ఆఫ్‌ బరోడా
ఆస్తుల నాణ్యత విషయంలో స్థిరమైన మెరుగుదల వల్ల రెండో త్రైమాసికంలో మంచి ఫలితాలను నమోదు చేయగలిగింది. స్థూల ఎన్‌పీఏలు 11.8 శాతానికి, నికర ఎన్‌పీఏలు 4.9 శాతానికి తగ్గాయి. వసూలు పరంగా సమస్యల్లో ఉన్న రుణాల్లో అధిక శాతాన్ని ఇప్పటికే గుర్తించడం వల్ల భవిష్యత్తులో రుణ వ్యయాలు తగ్గనున్నాయి. ప్రొవిజన్‌ కవరేజీ రేషియో 62 శాతానికి మెరుగుపడింది. కాసా కూడా 40 శాతం పైనే ఉంది. బ్యాంకు నిర్వహణ పనితీరు క్రమంగా మెరుగుపడుతోందని, 2018-19లో ఆర్‌వోఈ 10-11 శాతంగా ఉంటుందని ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌ తన నివేదికలో తెలిపింది. అయితే, ప్రతిపాదిత విజయాబ్యాంకు, దేనా బ్యాంకుల విలీనం ద్వారా బ్యాంకు ఆఫ్‌ బరోడాకు సవాళ్లు ఎదురుకానుండడం గమనించాల్సిన అంశం.


కరూర్‌ వైశ్యాబ్యాంకు
రెండో క్వార్టర్లో రుణ వృద్ధి కేవలం 7 శాతమే ఉన్నప్పటికీ... బ్యాంకు ఫండమెంటల్స్‌ మెరుగుపడడం, సరైన వ్యాల్యూషన్‌ కారణంగా ఈ స్టాక్‌ పట్ల విశ్లేషకులు బుల్లిష్‌గానే ఉన్నారు. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ బలోపేతం వంటి పలు వ్యూహాత్మక చర్యలను బ్యాంకు మేనేజ్‌మెంట్‌ తీసుకుంది. ముంబైలో ఒకటి, ఢిల్లీలో ఒక శాఖను మూసివేసింది. ఎన్‌పీఏల పరిస్థితి నిదానంగా మెరుగుపడుతోంది. 


జమ్మూ కశ్మీర్‌ బ్యాంకు
జమ్మూ అండ్‌ కశ్మీర్‌లో ఈ బ్యాంకు చాలా బలమైన స్థానంలో ఉంది. 85 శాతం డిపాజిట్లు, 51 శాతం రుణాలు జమ్మూ కశ్మీర్‌ నుంచే ఉన్నాయి. కాసా రేషియో చాలా అధికంగా 53 శాతంగా ఉండడం, నికర వడ్డీ మార్జిన్‌ సైతం 4 శాతం స్థాయిలో ఉండడం బ్యాంకు బలాలు. వ్యాపార వాతావరణం మెరుగుపడడం, ఒత్తిడిలో ఉన్న ఆస్తులు తగ్గడం వంటివి సానుకూలతలు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో నికర లాభం వార్షికంగా చూస్తే 31 శాతం, త్రైమాసికం వారీగా 78 శాతం పెరిగింది. స్థూల, నికర ఎన్‌పీఏలు 9 శాతం, 3.91 శాతానికి తగ్గాయి. దీంతో ఐసీఐసీఐ డైరెక్ట్‌ వంటి బ్రోకరేజీ సంస్థలు ఈ స్టాక్‌ పట్ల బుల్లిష్‌గా ఉన్నాయి.


ఫెడరల్‌ బ్యాంకు
పాత రతం ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన ఫెడరల్‌ బ్యాంకు ఆస్తుల నాణ్యత బలంగా ఉండడం గమనార్హం. సెప్టెంబర్‌ క్వార్టర్లో ఎన్‌పీఏల్లో కొంచెం పెరుగుదల ఉన్నప్పటికీ అవి ఇప్పటికీ సౌకర్య స్థాయిల్లోనే ఉన్నాయి. స్థూల ఎన్‌పీఏలు 3.11 శాతం, నికర ఎన్‌పీఏలు 1.78 శాతంగా ఉ‍న్నాయి. ప్రొవిజన్ల కవరేజీ రేషియో పెరగడంతో నికర లాభంలో వృద్ధి లేదు. అయితే రుణాల పోర్ట్‌ఫోలియో 23 శాతం పెరగడం, డిపాజిట్లు 22 శాతం పెరగడం బ్యాంకు పనితీరుకు నిదర్శనం. 2017-18 నుంచి 2020-21 నాటికి ఏటా ఈపీఎస్‌ 33 శాతం మేర వృద్ధి చెందుతుందని తాము అంచనా వేస్తు‍న్నట్టు జెఫరీస్‌ తన నివేదికలో పేర్కొంది.
 You may be interested

కరెక్షన్‌ తర్వాత పరుగులు తీసే షేర్లు ఏవి?

Wednesday 14th November 2018

రెండు నెలల కరెక్షన్‌ తర్వాత మార్కెట్లు కుదురుకునే క్రమంలో ఉన్నాయి. ఈ స్థాయిలోనే స్థిరపడతాయా? లేక మరికాస్త దిద్దుబాటు ఉంటుందా? అన్నది రానున్న రాష్ట్రాల ఎన్నికల తర్వాత తేలిపోనుంది. అయితే, కరెక్షన్‌ తర్వాత రికవరీ, ర్యాలీలో పాల్గొనే షేర్లు ఏవై ఉంటాయి? అన్న ఆసక్తి ఇన్వెస్టర్లలో ఉండడం ఆశర్యమేమీ కాదు. దీనిపై ఎలారా క్యాపిటల్‌ ఓ అధ్యయనం చేసి ర్యాలీ చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్న షేర్ల వివరాలను వెల్లడించింది.    2006

నిఫ్టీ లాభం 100 పాయింట్లు

Tuesday 13th November 2018

35వేల ఎగువకు సెన్సెక్స్‌ 10550 స్థాయిని అందుకున్న నిఫ్టీ రాణించిన హెవీవెయిట్‌ షేర్లు మిడ్‌సెషన్‌ నుంచి సాగిన కొనుగోళ్లతో మార్కెట్‌ మంగళవారం భారీ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ తిరిగి 35వేల మార్కును, నిఫ్టీ 10500 మార్కును తిరిగి అందుకున్నాయి. ప్రపంచమార్కెట్లో నెలకొన్న అస్థిరత కారణంగా సూచీలు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మిడ్‌ సెషన్‌ వరకు నష్టాల్లో ట్రేడయ్యాయి. మిడ్‌ సెషన్‌ తరువాత ప్రైవేట్‌ బ్యాంక్‌ రంగ బ్యాంక్‌, ఆర్థిక రంగ, అటో రంగ షేర్లలో

Most from this category