STOCKS

News


ఆకర్షణీయమైన 5 బ్యాంక్‌ స్టాక్స్‌..

Wednesday 14th November 2018
Markets_main1542190943.png-22004

అసెట్‌ క్వాలిటీ బాగలేకపోవడం, అధిక కార్పొరేట్‌ రుణాలు, ఆర్థిక వృద్ధి నెమ్మదించడం, డిఫాల్ట్‌ సమస్యలు, ఆర్‌బీఐ సత్వర దిద్దుబాటు చర్యలు వంటివాటి వల్ల ప్రభుత్వ రంగ బ్యాంక్‌ (పీఎస్‌యూ బ్యాంకులు) షేర్లు ఇన్వెస్టర్ల ఆదరణ పొందలేకపోతున్నాయి. రుణాల్లో వృద్ధి మోస్తారుగా ఉన్నా కూడా పీఎస్‌యూ బ్యాంకులు డిపాజిట్లు పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఈడీ, సీఐవో ప్రశాంత్‌ జైన్‌ తెలిపారు. క్రెడిట్‌ సైకిల్‌ టర్న్‌అరౌండ్‌ అయితే పలు బ్యాంకులు మంచి పనితీరు కనబరుస్తాయని పేర్కొన్నారు. సెంటిమెంట్‌ బలహీనంగా ఉందని, అలాగే స్వల్ప కాలంలో ఒడిదుడుకులు కొనసాగుతాయని ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ డైరెక్టర్‌, సీఐవో ఏ.కే.శ్రీధర్‌ తెలిపారు. మార్కెట్లు ఇప్పటికే చాలా ప్రతికూలతలను ఎదుర్కొన్నాయని, అయితే డిసెంబర్‌-జనవరిలో మరొకమారు కరెక‌్షన్‌కు అవకాశముందని, అప్పుడు కొనుగోలుకు మంచి అవకాశాలుంటాయని పేర్కొన్నారు. స్టాక్‌ ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.  ఆమోదయోగ్యమైన వ్యాల్యుయేషన్స్‌, అధిక బ్రాంచ్‌లు, డిపాజిట్ల వృద్ధి, రుణాల్లో రిటైల్‌ వాటా వంటి అంశాల ప్రాతిపదికన బ్యాంక్‌ స్టాక్స్‌ను ఎంచుకోవాలని సూచించారు. 

ఇన్వెస్ట్‌మెంట్‌కు అనువైన ఐదు ఆకర్షణీయమైన బ్యాంక్‌ స్టాక్స్‌ను గమనిస్తే.. 

ఎస్‌బీఐ
ఎక్కువ బ్రాంచ్‌లను కలిగి ఉండటం వల్ల రిటైల్‌ విభాగంలో ఎస్‌బీఐని కొట్టే బ్యాంక్‌ భారత్‌లో మరొకటి లేదు. అలాగే ఎస్‌బీఐ కాసా రేషియో 45 శాతంగా ఉంది. అన్నింటికన్నా ముఖ్యమైనది.. మూడు క్వార్టర్ల తర్వాత ఎస్‌బీఐ ఈ క్యూ2లో నికర లాభాన్ని ప్రకటించింది. అసెట్‌ క్వాలిటీ మెరుగుపడింది. త్రైమాసికం పరంగా చూస్తే.. స్థూల మొండి బకాయిలు 9.95 శాతానికి (రూ.2.09 లక్షల కోట్లు) తగ్గాయి. క్యూ1లో (ఏప్రిల్‌-జూన్‌) ఇవి 10.69 శాతంగా (రూ.2.12 లక్షల కోట్లు) ఉన్నాయి. ఇక నికర ఎన్‌పీఏలు 5.29 శాతం (రూ.99,263 కోట్లు) నుంచి 4.84 శాతానికి (రూ.94,810 కోట్లు) తగ్గాయి. ఎస్‌బీఐ లైఫ్‌లో వాటా విక్రయం కూడా లాభాల ప్రకటనకు దోహదపడింది. రిటైల్‌ డిపాజిట్‌, లోన్‌ పోర్ట్‌ఫోలియో విభాగాలు మంచి పనితీరు కనబరుస్తున్నాయి. కార్పొరేట్‌ రుణ ఒత్తిడి బ్యాంక్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. కార్పొరేట్‌ రికవరీ, వ్యాల్యుయేషన్స్‌ ఆకర్షణీయంగా ఉండటం, అనుబంధ సంస్థల విలువ పెరగడం వంటి వాటివల్ల ఎస్‌బీఐ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని జేఎం ఫైనాన్షియల్‌ పేర్కొంది. 

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
అసెట్‌ క్వాలిటీ క్రమంగా మెరుగుపడుతూ వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 62 శాతానికి మెరుగుపడింది. నిర్వహణ పనితీరు మరొక సానుకూల అంశం. కాసా రేషియో కూడా 40 శాతానికిపైగా ఉంది. బ్యాలెన్స్‌ షీటులో వృద్ధి కనిపిస్తోంది. రిటైల్‌ రుణాలకు అధిక ప్రాధాన్యమిస్తోంది. 2019-2020 కల్లా బ్యాంక్‌ ఆర్‌వోఈ 10-11 శాతంగా ఉండొచ్చని ఎడిల్‌వీస్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. అయితే విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌లతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా విలీనం వల్ల పలు సమస్యలు తలెత్తవచ్చు. ఎర్నింగ్స్‌ తగ్గే అవకాశముంది. అందువల్ల విలీనం పూర్తి వివరాలు తెలిసేంత వరకు వేచి చూడటం మంచింది.   

కరూర్‌ వైశ్యా బ్యాంక్‌
ప్రస్తుత క్యూ2లో ఎర్నింగ్స్‌ ఆకర్షణీయంగా లేకపోయినప్పటికీ విశ్లేషకులు మాత్రం ఈ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉన్నారు. ఫండమెంటల్స్‌ మెరుగుపడటం, ఆమోదయోగ్యమైన వ్యాల్యుయేషన్స్‌ ఇందుకు కారణం. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ పునరుద్ధరణ, రిస్క్‌ ఆధారిత ప్రైసింగ్‌ వంటి పలు చర్యలు తీసుకుంది. అలాగే భారమైన బ్రాంచ్‌లను మూసివేసింది. ఇవ్వన్నీ దీర్ఘకాలంలో ఫలితాలను అందిస్తాయి. పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. స్థూల ఎన్‌పీఏలు 7.7 శాతం, నికర ఎన్‌పీఏలు 4.4 శాతంగా ఉన్నాయి. ప్రస్తుతం వృద్ధి లేకపోయినప్పటికీ, రికవరీకి సమయం పడుతుంది. దీర్ఘకాలం కోసం ఈ స్టాక్‌కు ప్రాధాన్యమివ్వొచ్చు.

జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌
ఈ చిన్న బ్యాంక్‌ జమ్మూ అండ్‌ కశ్మీర్‌లో ఆధిపత్యాన్ని కలిగి ఉంది. బ్యాంక్‌ డిపాజిట్లలో 85 శాతం ఈ ప్రాంతానివే. అలాగే బ్యాంక్‌ 51 శాతం లోన్‌ బుక్‌ ఇక్కడిదే. 53 శాతం అధిక కాసా రేషియోని కలిగి ఉంది. బ్యాంక్‌ నికర వడ్డీ మార్జిన్లు 4 శాతంగా ఉన్నాయి. మొండి బకాయిలు తగ్గడం, వ్యాపార పరిస్థితులు మెరుగుపడటం సానుకూల అంశాలు. ఈ క్యూ2లో నికర లాభం వార్షికంగా 31 శాతం, క్వార్టర్‌ పరంగా 78 శాతం పెరిగింది. స్థూల ఎన్‌పీఏలు 9 శాతానికి, నికర ఎన్‌పీఏలు 3.91 శాతానికి తగ్గాయి. ఇదే ట్రెండ్‌ భవిష్యత్‌లోనూ కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఫెడరల్‌ బ్యాంక్‌
పాత తరం ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ఫెడరల్‌ బ్యాంక్‌ ఒకటి. రుణ నాణ్యత విషయంలో పాత తరం ప్రైవేట్‌ బ్యాంకులు దీనికి పోటీ రాలేవు. ప్రస్తుత క్యూ2లో ఎన్‌పీఏలు స్వల్పంగా పెరిగినప్పటికీ, స్థూల/నికర ఎన్‌పీఏలు ఆమోదయోగ్యమైన స్థాయిల్లోనే ఉన్నాయి. స్థూల ఎన్‌పీఏలు 3.11 శాతంగా, నికర ఎన్‌పీఏలు 1.78 శాతంగా నమోదయ్యాయి. కేటాయింపులు పెరగడం వల్ల నికర లాభంలో వృద్ధి ఫ్లాట్‌గా ఉంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 23 శాతం రుణ వృద్ధి, 22 శాతం డిపాజిట్‌ వృద్ధి అంశాలను గమనిస్తే బ్యాంక్‌ నిర్వహణ పనితీరు బలంగా ఉందనే అంశం అర్థమౌతుంది. కాసా రేషియో ఎక్కువగా లేనప్పటికీ (33 శాతం) రిటైల్‌ బేస్‌ మాత్రం బలంగా ఉంది. రిటైల్‌ భాగస్వామ్యం పెరుగుదల వల్ల ఈ క్యూ2లో ఎన్‌ఐఎం 3.15 శాతానికి మోరుగుపడింది. ఈ ఏడాది ఇది 3.2 శాతానికి కూడా పెరగొచ్చు. 

   You may be interested

ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

Wednesday 14th November 2018

ఐటీ, పార్మా రంగ షేర్ల పతనంతో మార్కెట్‌ బుధవారం దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్‌ 2.50 పాయింట్ల నష్టంతో 35,142 వద్ద, నిఫ్టీ 6.20 పాయింట్లను కోల్పోయి 10,576 వద్ద ముగిసింది. ముడిచమురు పతనంతో ట్రేడింగ్‌ ప్రారంభంలో భారీ లాభాలను ఆర్జించిన సూచీలు చివరి వరకు లాభాలను నిలుపుకోవడంతో విఫలమయ్యాయి. రూపాయి బలపడంతో ఐటీ, ఫార్మా షేర్ల పతనం సూచీల లాభాలను హరించివేశాయి. బ్యాంకింగ్‌,  ఫైనాన్స్‌ రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో

టాటామోటర్స్‌....మూడీస్‌ నెగిటివ్‌ రేటింగ్‌

Wednesday 14th November 2018

ప్రముఖ రేటింగ్‌ మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ సంస్థ టాటామోటర్స్‌ షేరుపై రేటింగ్‌ అవుట్‌లుక్‌ను ‘‘స్థిరత్వం’’ నుంచి ‘‘ప్రతికూలం’’కు మార్చింది. టాటా మోటర్స్‌ బ్రిటన్‌ అనుబంధ సంస్థ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) నిర్వహణ ప్రదర్శన అంచనాలకు మించి తక్కువగా నమోదు చేసింది రేటింగ్‌ తగ్గిస్తున్నట్టు మూడీస్‌ తెలిపింది. పెరుగుతున్న ఇన్‌పుట్‌ వ్యయాలు, ఇంధన ధరలు జేఎల్‌ఆర్‌ కంపెనీ పరపతి సామర్థ్యం బలహీనంగా ఉండటం, ఇటీవల మరోసారి తెరపైకి వచ్చిన యూరోపియన్‌ కూటమి

Most from this category