News


లోక్‌సభ ఎన్నికల ముందు...కొనుగోళ్లకు అవకాశం

Thursday 13th December 2018
Markets_main1544687798.png-22896

సార్వత్రిక ఎన్నికలకు ఐదారు నెలల ముందు మార్కెట్‌లో కొనుగోలుకు మంచి అవకాశాలు అందుబాటులో ఉంటాయని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఈక్విటీ అడ్వైజర్‌ హెడ్‌ దేవాంగ్‌ మెహతా తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఒక్క విషయమైతే స్పష్టంగా తెలుస్తోంది. మార్కెట్లు అస్థిరతను కోరుకోవడం లేదు. గత రెండు రోజులను గమనిస్తే ఈ విషయం అర్ధమౌతుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మార్కెట్‌లో చాలా ఆందోళనలు నెలకొన్నాయి. అధికార బీజేపీ ఓడిపోతే మార్కెట్లలో కరెక‌్షన్‌ ఎక్కువగా ఉంటుందని చాలా మంది అంచనా వేశారు. అయితే మార్కెట్‌ అస్థిరతను వ్యతిరేకించింది. అధికార పార్టీ ఓడిపోయినా కూడా మార్కెట్‌ పాజిటివ్‌ దారిలోనే నడిచింది’ అని వివరించారు. అలాగే ఆర్‌బీఐ గవర్నర్‌ రాజీనామా, 48 గంటల్లోనే కొత్త గవర్నర్‌ నియామకం వల్ల కూడా ఇన్వెస్టర్లలో అందోళనలు తగ్గాయని పేర్కొన్నారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం దిగిరావడం, పారిశ్రామికోత్పత్తి పరుగులు పెట్టడం మరింత సానుకూల వాతావరణాన్ని ఏర్పరచాయని తెలిపారు. అలాగే కీలక ఆర్థిక సూచీ అయిన కెపాసిటీ యుటిలైజేషన్‌ ఇండెక్స్‌ కూడా పాజిటివ్‌గానే ఉందన్నారు. ఈ అంశాలన్నీ ఎర్నింగ్స్‌లో రికవరీని సూచిస్తున్నాయని తెలిపారు. క్రూడ్‌ ధరలు గరిష్ట స్థాయి నుంచి దాదాపు 28 శాతం మేర పతనమయ్యాయని గుర్తు చేశారు. ఇవ్వన్నీ సానుకూలతలేనని తెలిపారు. అలాగే భారత్‌లో వచ్చే 4 నెలల కాలంలో చెప్పుకోదగ్గ ఈవెంట్లు లేవని పేర్కొన్నారు. 
2019 ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేస్తుందని, అందువల్ల గ్రామీణ ప్రాంతంలో కార్యకలాపాలు కలిగిన కన్సూమర్‌ కంపెనీలకు ఇది పాజిటివ్‌ అంశమని దేవాంగ్‌ మెహతా తెలిపారు. ఇకపోతే ఎల్‌అండ్‌టీ, కమ్మిన్స్‌ ఇండియా, హానీవెల్‌ ఆటోమేషన్‌ వంటి స్టాక్స్‌కు ప్రాధాన్యమివ్వొచ్చని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఐదారు నెలల ముందు మార్కెట్‌లో కొనుగోలు అవకాశాలు బాగుంటాయని తెలిపారు. ఈ ఆరు నెలల కాలంలో లార్జ్‌క్యాప్స్‌లో సగటున 18-20 శాతం రాబడిని పొందొచ్చని పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్‌ సైకిల్‌ ప్రారంభ దశలో ఉందని అందువల్ల క్యాపిటల్‌ గూడ్స్‌, యాన్సిలరీ విభాగాలకు ప్రాధాన్యమివ్వొచ్చని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ, ట్రాక్టర్స్‌, ఆటోమొబైల్‌ విభాగాలపై దృష్టి కేంద్రీకరించొచ్చని పేర్కొన్నారు.   You may be interested

లాంగ్‌రన్‌ కోసం లార్జ్‌ క్యాప్స్‌

Thursday 13th December 2018

మోతీలాల్‌ ఓస్వాల్‌ రికమండేషన్లు ఎన్నికల ఫలితాల అనంతరం ఎవరూ ఊహించని విధంగా మార్కెట్లు టాప్‌గేర్‌లోకి మారాయి. రెండు మూడు సెషన్లలోనే నిఫ్టీ దాదాపు 500 పాయింట్లమేర లాభపడింది. ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లో ఏకపార్టీ ప్రభుత్వాలు ఏర్పడడమే మార్కెట్లలో జోష్‌కు కారణమై ఉండొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అభిప్రాయపడుతోంది. ఏకపార్టీ ప్రభుత్వాలతో విధాన నిర్ణయాల్లో జాప్యం ఉండదని పేర్కొంది. అదేవిధంగా ఆర్‌బీఐకి కొత్త గవర్నర్‌ను ప్రభుత్వం వేగంగా నియమించడం కూడా మార్కెట్లను మురిపించిందని

టాప్‌ ఎంఎఫ్‌లు ఏం కొన్నాయి?

Thursday 13th December 2018

దేశీయ ఈక్విటీలు నవంబర్‌లో కాస్త కోలుకున్నాయి. నిఫ్టీ ఈ నెల్లో దాదాపు 5 శాతం లాభపడింది. గత నెలతో పోలిస్తే ఈ నెల్లో దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి నిధుల ప్రవాహం మెరుగైంది. నవంబర్‌లో రూ.1.4 లక్షల కోట్లు ఎంఎఫ్‌ల్లోకి వచ్చాయి. అయితే  గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఈక్విటీ, ఈక్విటీలింక్డ్‌ ఎంఎఫ్‌ల్లోకి నిధుల ప్రవాహం మందగించింది. నవంబర్‌లో ఎంఎఫ్‌ల మొత్తం అసెట్స్‌ విలువ 8 శాతం పెరిగి 24 లక్షల కోట్ల

Most from this category