భారత్‌పై పాజిటివ్: మోబియస్
By Sakshi

మోబియస్ క్యాపిటల్ పార్ట్నర్స్ ద్వారా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇన్వెస్ట్మెంట్ గురు ‘మార్క్ మోబియస్’.. భారత్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో కారణాలు తెలియజేశారు. ఇండియా ఎందుకంత ప్రత్యేకమో వివరించారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌పై ఎలాంటి అంచనాలను కలిగి ఉన్నారో తెలిపారు. తమ వద్ద కొత్త ఫండ్ ఉందని, దీని ద్వారా ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామని, దీనికి కొంత సమయం పట్టొచ్చని పేర్కొన్నారు. ‘భారత్ మార్కెట్లో లిక్విడిటీ సమస్య ఉందని తెలుసు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వల్ల ఇది ఏర్పడింది. దీని ప్రభావం కనిపిస్తోంది. మార్కెట్ మరి కొంత కరెక్షన్కు గురికావొచ్చు’ అని తెలిపారు. రూపాయి కూడా పతనమైందన్నారు. వీటి ఆధారంగా చూస్తే మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశాలున్నాయని తెలిపారు.
వర్ధమాన మార్కెట్లలోని ప్రస్తుత అమ్మకాలు.. కొనుగోలుకు మంచి అవకాశమని మోబియస్ పేర్కొన్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని తెలిపారు. వర్ధమాన మార్కెట్లలోని కరెన్సీలు కూడా పతనమౌతున్నాయని పేర్కొన్నారు. మార్కెట్లు బాటమ్‌కు దగ్గరిలో ఉన్నాయని చెప్పడం కష్టతరమన్నారు. ఏడాది ప్రారంభంలో మార్కెట్లు 20 శాతం, 30 శాతం కరెక్షన్కు గురౌతాయని ఎవ్వరూ అంచనా వేసి ఉండరని తెలిపారు. కొన్ని స్టాక్స్‌లో కొనుగోలు అవకాశముందని, మరి కొన్నింటిలో లేదని పేర్కొన్నారు. బలహీనమైన బ్యాలెన్స్ షీటు కలిగిన, డివిడెంట్లు చెల్లించని, మేనేజ్మెంట్ సరిగాలేని కంపెనీలకు దూరంగా ఉండటం ఉత్తమమని తెలిపారు. వీటికి పూర్తి భిన్నమైన కంపెనీలు విజేతలుగా ఉంటాయని పేర్కొన్నారు.
భారత్.. పెద్ద దేశీ మార్కెట్‌ను కలిగి ఉందని, ఇది అంతర్గాతంగా వృద్ధి చెందితే, పెట్టుబడులకు మంచి అవకాశాలు అందుబాటులో ఉంటాయని మోబియస్ తెలిపారు. కానీ ఇన్వెస్టర్లు అమెరికా, అమెరికా డాలర్ వైపు చూస్తున్నారని, వారు అమెరికా డాలర్‌ను విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. అమెరికాలో వడ్డీ రేట్ల పెరిగితే.. అప్పుడు డబ్బు ప్రవాహం అమెరికా డాలర్ వైపు ఉంటుందని, వర్ధమాన మార్కెట్లలో వడ్డీ రేట్లు కూడా అమెరికా వడ్డీ రేట్లను సమంగా పెరిగినప్పుడే ఈ ప్రవాహం ఆగుతుందని వివరించారు. ప్రస్తుతం ఎన్బీఎఫ్సీలతో జాగ్రత్తగా ఉండాలని చాలా మంది అనుకుంటూ ఉంటారని, అయితే వీటిల్లోనూ అవకాశాలున్నాయని తెలిపారు. కమోడిటీ స్టాక్స్‌కు ఎప్పటికీ ప్రాధాన్యమివ్వాలని సూచించారు. వీటి విలువ మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చూస్తే ద్రవ్యోల్బణ పరిస్థితులు లేవని, ప్రతిద్రవ్యోణ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. దీనికి టెక్నాలజీ కారణమని పేర్కొన్నారు.
భారత్‌లో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలంటే వడ్డీ రేట్లు పెంపు ఒక్కటే మార్గం కాదని మోబియస్ తెలిపారు. ఉత్పాదకతను పెంచితే సరిపోతుందని పేర్కొన్నారు. జీఎస్టీ వల్ల ద్రవ్యోల్బణ నియంత్రణకు దోహదపడుతుందని, వ్యయాలు తగ్గుతాయని తెలిపారు. కంపెనీల విషయానికి వస్తే.. బలమైన బ్యాలెన్స్ షీటు, డివిడెండ్ చెల్లింపులు, సమర్థమంతమైన మేనేజ్మెంట్ అంశాలకు తొలి ప్రాధాన్యమిస్తానని పేర్కొన్నారు. తర్వాత వ్యాల్యుయేషన్స్ చూస్తానని తెలిపారు. ఈ రోజు పీఈ ఎంత ఉంది? ఐదేళ్లలో ఏ స్థాయిలోకి వెళ్తుంది? బుక్ వ్యాల్యు ఎంత? వంటి అంశాలకు అంతగా ప్రాధాన్యమివ్వనని పేర్కొన్నారు. ఇవి ముఖ్యమేనని, అయితే వృద్ధికి ఎక్కువ విలువివ్వాలని తెలిపారు. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియాకు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
You may be interested
కోటక్ మహీంద్రా లాభం 21% అప్
Wednesday 24th October 2018ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక (క్యూ2, జూలై-సెప్టెంబర్) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. వార్షికంగా చూస్తే కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 21 శాతం వృద్ధితో రూ.1,747 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.1,441 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గ్రూప్ మొత్తం అసెట్స్ క్యూ2 చివరి నాటికి 18 శాతం వృద్ధితో రూ.1,99,382
ఫార్మా షేర్లకు జ్వరం..!
Wednesday 24th October 2018ఒడిదుడుకుల మార్కెట్ ట్రేడింగ్‌లో భాగంగా బుధవారం ఫార్మా షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్ఎస్ఈలో ఫార్మా రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఇంట్రాడేలో 1శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్ గత ముగింపు (9,368.25)తో పోలిస్తే 0.85శాతం నష్టంతో 9,289.45ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన 10 షేర్లలో 5 షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా, మరో 5 షేర్లు