STOCKS

News


నాలుగు షేర్లపై సంస్థాగత ఇన్వెస్టర్లకు తగ్గిన మోజు

Friday 8th February 2019
Markets_main1549621167.png-24094

డిసెంబర్‌ త్రైమాసికంలో ఎఫ్‌ఐఐ, డీఐఐలు నాలుగు షేర్లలో వాటాలను తగ్గించుకున్నాయని ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ నివేదిక తెలిపింది. యస్‌ బ్యాంక్‌, కేపీఐటీ టెక్‌, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, ఇన్ఫీబీమ్‌ ఎవెన్యూ షేర్లలో ఎఫ్‌ఐఐ, డీఐఐలు క్యు2తో పోలిస్తే వాటాలు తగ్గించుకున్నాయి. మరోవైపు ఐసీఐసీఐ లంబార్డ్‌, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎస్‌హెచ్‌ కేల్కర్‌లో సంస్థాగత ఇన్వెస్టర్లు వాటాలను పెంచుకున్నాయని నివేదిక వెల్లడించింది. లార్జ్‌ క్యాప్స్‌లో యస్‌బ్యాంక్‌, యాక్సిస్‌బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లను ఎఫ్‌ఐఐలు క్యు3లో అమ్మడానికి మొగ్గు చూపాయి. ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, భారత్‌ ఫైనాన్షియల్స్‌, ఎల్‌టీ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌, ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో వాటాలను పెంచుకున్నాయి. డీఐఐలు చమురు మార్కెట్‌ కంపెనీలు, మెటల్‌ కంపెనీల్లో కొనుగోళ్లు జరిపాయి. ఆటో, ఫార్మా రంగాల కంపెనీల షేర్లను విక్రయించాయి. మిడ్‌క్యాప్‌ఐటీ షేర్లపై డీఐఐలు మక్కువ చూపాయని నివేదిక తెలిపింది. క్యు3లో ఎఫ్‌ఐఐలు నికర విక్రయదారులుగా ఉన్నారు. బ్యాంకులు, ఐటీ, టెలికం, సిమెంట్‌ రంగాల్లో హోల్డింగ్స్‌ను తగ్గించుకున్నారు. ఇదే సమయంలో ఎన్‌బీఎఫ్‌సీ, కన్జూమర్‌, గ్యాస్‌ సరఫరా కంపెనీ షేర్లను కొనుగోలు చేశాయి. 
 


FII

You may be interested

సెన్సెక్స్‌ 424 పాయింట్లు క్రాష్‌

Friday 8th February 2019

మార్కెట్‌ను మెప్పించని ఆర్‌బీఐ వడ్డీరేట్ల కోత 425 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్‌ మెటల్‌, అటో షేర్లలో అమ్మకాలు యూరప్‌ వృద్ధి మందగిస్తుందంటూ యూరోపియన్‌ యూనియన్‌ చేసిన హెచ్చరిక ప్రపంచ మార్కెట్లలో చిన్న కల్లోలాన్ని సృష్టించింది. ప్రపంచ మార్కెట్లు క్షీణించిన నేపథ్యంలో భారత్‌ సూచీలు సైతం శుక్రవారం పడిపోయాయి. రెండు రోజుల క్రితం సాధించుకున్న 11,000 పాయింట్ల స్థాయిని నిఫ్టీ తిరిగి వదులుకుంది.  అటో, మెటల్‌, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్ల అమ్మకాలతో చివరి అరగంటలో

ఏప్రిల్‌లో మరోమారు రేట్‌కట్‌!

Friday 8th February 2019

గ్లోబల్‌ బ్రోకరేజ్‌ల అంచనా అనూహ్యంగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఈ దఫా సమావేశంలో రేట్‌కట్‌ నిర్ణయం ప్రకటించింది. అందరూ కేవలం ఆర్బీఐ ధృక్పథంలో మాత్రమే మార్పు ఉంటుందని భావిస్తున్న సమయాన అనుకోని విధంగా 25 బీపీఎస్‌ రేట్‌ కట్‌ను ప్రకటించింది. ఈ నిర్ణయం మానిటరీ పాలసీ సైకిల్‌లో రివర్సల్‌కు ఆరంభమని ప్రస్తుతం గ్లోబల్‌ బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. వచ్చే ఏప్రిల్‌ సమావేశంలో ఆర్‌బీఐ మరోమారు రేట్లను తగ్గించవచ్చని అంచనా వేశాయి.

Most from this category