STOCKS

News


దేవెన్‌ చోక్సే స్టాక్‌ సిఫారసులు

Wednesday 31st October 2018
Markets_main1540925039.png-21593

చమురు ధరల పతనం చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు మేలు చేస్తుందని కేఆర్‌ చోక్సే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఎండీ దేవేన్‌ చోక్సే పేర్కొన్నారు. అయితే, ధరల విషయంలో ప్రభుత్వ జోక్యం రిటైల్‌ ఇన్వెస్టర్లకు మేలు చేసేది కాదన్నారు. పెట్టుబడి పరంగా ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు బదులు... ఈ రంగంలోనే లబ్ధి పొందే సామర్థ్యం కలిగిన రిలయన్స్‌ మంచి ఎంపిక అవుతుందని పేర్కొన్నారు. సిప్లా, బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ పట్ల తాము ఆసక్తితో ఉన్నట్టు చోక్సే చెప్పారు. 

 

ఐసీఐసీఐ బ్యాంకుకే ఓటు
ఐసీఐసీఐ బ్యాంకు విషయంలో ఎన్నో సానుకూలతలు ఉన్నట్టు దేవేన్‌ చోక్సే తెలిపారు. మంచి లిక్విడిటీ (నిధులు)తో ఉన్నట్టు చెప్పారు. ఎన్‌బీఎఫ్‌సీల నుంచి ఆస్తుల కొనుగోలుకు ఈ నిధులు ఉపయోగపడతాయని, తద్వారా దీర్ఘకాలిక రుణ పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఎన్‌సీఎల్‌టీ ఆధ్వర్యంలో దివాలా పరిష్కార చర్యలు బ్యాంకులు ఎంతో మేలు చేసేవిగా అభివర్ణించారు. ఎన్‌సీఎల్‌టీ వేలం ద్వారా బ్యాంకులకు తక్కువ హేర్‌కట్‌ (నష్టం) ఉండడం వాటికి సానుకూల అంశంగా పేర్కొన్నారు. ఇవన్నీ చూసిన మీదట, ఐసీఐసీఐ బ్యాంకు ప్రస్తుత ధర నుంచి పడిపోకపోవచ్చన్నారు. ఇది కొనుగోలుకు అవకాశంగా చెప్పారు. అయితే, మార్కెట్లు నిలకడగా లేవని, ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. కనుక పోర్ట్‌ఫోలియోకు స్టాక్స్‌ యాడ్‌ చేసుకునే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. 

ప్రస్తుత స్థాయిలో ఏవి కొనొచ్చు?
‘‘బీమా రంగం పట్ల విశ్వాసంతో ఉన్నాం. జీవిత బీమా వ్యాపారం చాలా వేగంగా ముందుకు దూసుకెళుతోంది. కొత్త వ్యాపార ప్రీమియం వసూళ్ల రూపంలో అధిక వృద్ధి కనిపిస్తోంది. దీంతో ఈ కంపెనీలు వార్షికంగా 20 శాతానికి పైనే వృద్ధిని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ సమయంలో వీటి ఎంపిక సానుకూలం. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, రెండు బీమా సంస్థలను కలిగి ఉన్న బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. బీమా విభాగంలో నాణ్యమైన ఈ స్టాక్స్‌కు తోడు మార్కెట్‌ సెంటిమెంట్‌ కారణంగా నష్టపోయిన ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలపైనా దృష్టి పెట్టొచ్చు. ఇందులో బజాజ్‌ ఫైనాన్స్‌ పట్ల ఆసక్తితో ఉన్నాం’’ అని చోక్సే పేర్కొన్నారు. మారుతి, బజాజ్‌ ఆటో పట్ల ఎంతో ఆసక్తితో ఉన్నట్టు దేవేన్‌ చోక్సే తెలిపారు. చైనా మార్కెట్‌ ఆదుకుంటే, బ్రెగ్జిట్‌ సులభంగా మారితే టాటా మోటార్స్‌కు కలిసొస్తుందని చెప్పారు. సిప్లా పట్ల కూడా ఆసక్తితో ఉన్నట్టు చెప్పారు. వచ్చే ఆరు నెలల కాలంలో కొత్త ఉత్పత్తులను విడుదల చేయనుందని, వీటి ద్వారా మంచి ఆదాయాలు సమకూరగలవన్నారు.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 26 పాయింట్లు డౌన్‌

Wednesday 31st October 2018

గత రాత్రి అమెరికా సూచీలు 1.5 శాతం వరకూ ర్యాలీ జరిపినప్పటికీ, బుధవారం ఆసియా సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నా, సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ మాత్రం ఉదయం 8.45 గంటలకు 26 పాయింట్ల తగ్గుదలతో 10,202 పాయింట్ల వద్ద కదులుతోంది. మంగళవారంనాడిక్కడ స్పాట్‌ నిఫ్టీ 10,198 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ ఫ్యూచర్‌ 10,228 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుగుణంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ తగ్గుదల కారణంగా ఈ

మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులపై పన్ను ఇలా...

Wednesday 31st October 2018

మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడి వృద్ధి, డివిడెండ్‌ ఆదాయం రూపంలో లాభాలు గడిస్తుంటారు. ఈక్విటీ ఫండ్స్‌ అయితే లాభాలు వచ్చినప్పుడు సహజంగా ఏఎంసీలు డివిడెండ్‌ ప్రకటిస్తుంటాయి. అలాగే, డెట్‌ ఫండ్స్‌ అయితే వడ్డీ రూపంలోనూ ఇన్వెస్టర్లకు స్థిరమైన రాబడి ఉంటుంది. దీంతో పెట్టుబడి వృద్ధి జరుగుతుంది. మొత్తానికి భిన్న స్థాయిల్లో మూల ధన లాభం అనేది ఉంటుంది. దీనిపై ఫండ్‌ కేటగిరీని బట్టి పన్ను మారిపోతుంది. ఏ తరహా

Most from this category