STOCKS

News


నర్నోలియా మిడ్‌టర్మ్‌ సిఫార్సులు

Monday 16th July 2018
Markets_main1531719891.png-18338

వచ్చే 3- 6 నెలల కాలంలో 20 శాతం వరకు రాబడినిచ్చే 5 స్టాకులను నర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ రికమండ్‌ చేస్తోంది.
1. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 245. స్టాప్‌లాస్‌ రూ. 179. ఆల్‌టైమ్‌ హైని తాకిన అనంతరం ఒక్కపెట్టున వేగంగా ఏడాది కనిష్ఠస్థాయిలకు పడిపోయింది. ఈ స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు పొంది గత ఐదేళ్లుగా రూ. 200- 286 రేంజ్‌లోనే తిరుగుతోంది. ప్రస్తుతం ఈ రేంజ్‌ దిగువ అవధి వద్దకు చేరినందున కొనుగోళ్లకు అవకాశంగా కనిపిస్తోంది. ఆర్‌ఎస్‌ఐ ఓవర్‌ సోల్డ్‌ రీజియన్‌లో ఉంది. రూ. 179కిపైన కొనసాగినంత కాలం మరోమారు రేంజ్‌ ఎగువ అవధిని తాకే ఛాన్సులున్నాయి.
2. అరవింద్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 490. స్టాప్‌లాస్‌ రూ. 389. హయ్యర్‌ టాప్‌, హయ్యర్‌ బాటమ్‌ పాటర్న్‌ చూపుతూ అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం సౌష్ఠవాకార త్రిభుజాకృతి పాటర్న్‌లోని ‘ఈ’రేఖ వద్ద ధర కదలాడుతోంది. ఎంఏసీడీ ఇండికేటర్‌ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఆర్‌ఎస్‌ఐ సైతం పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. రూ. 410 వద్ద 200 రోజుల డీఎంఏ స్థాయి ఉంది. ఈ స్థాయి వద్ద బలమైన మద్దతు లభిస్తోంది. 
3. రేమండ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1000. స్టాప్‌లాస్‌ రూ. 849. రెండున్నర నెలల క్రితం రూ. 1150 వద్ద డబుల్‌టాప్‌ ఏర్పరిచి వేగంగా 24 శాతం పతనమైంది. తాజా స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఆర్‌ఎస్‌ఐ, స్టోకాస్టిక్‌ ఇండికేటర్లు ట్రెండ్‌ రివర్సల్‌ సంకేతాలు ఇస్తున్నాయి. పుల్‌బ్యాక్‌ ర్యాలీకి ఛాన్సులు కనిపిస్తున్నాయి. 
4. గ్లెన్‌మార్క్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 645. స్టాప్‌లాస్‌ రూ. 513. కొన్ని రోజులుగా అధోముఖ వాలు రేఖ వద్ద కన్సాలిడేట్‌ అవుతోంది. 200 రోజుల డీఎంఏ స్థాయి బలమైన మద్దతుగా నిలుస్తోంది. చార్టుల్లో కప్‌ అండ్‌ హ్యాండిల్‌ పాటర్న్‌ ఏర్పడడం, 20, 50 రోజుల డీఎంఏ రేఖల క్రాసోవర్‌.. ర్యాలీకి సంకేతాలు. ఆర్‌ఎస్‌ఐ సైతం అప్‌మూవ్‌కు అనుకూలంగా ఉంది. 
5. లుపిన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 975. స్టాప్‌లాస్‌ రూ. 803. ఫాలింగ్‌ వెడ్జ్‌ పాటర్న్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది. దీనికితోడు డబుల్‌ బాటమ్‌ బ్రేకవుట్‌ను కూడా చార్టుల్లో చూపుతోంది. ప్రస్తుత స్థాయిల వద్ద కొనుగోళ్లకు అనుకూలంగా ఉంది. ఆర్‌ఎస్‌ఐ స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుత కన్సాలిడేషన్‌నుంచి బయటపడి త్వరలో అప్‌మూవ్‌ చూపేందుకు రెడీగా ఉన్నట్లు టెక్నికల్‌ సంకేతాలు వస్తున్నాయి. 



You may be interested

పతనబాటలో పీఎస్‌యూ బ్యాంకు షేర్లు

Monday 16th July 2018

ముంబై:- ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు సోమవారం నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో దాదాపు 2శాతం వరకు నష్టపోయింది. ఉదయం గం.11:00ని.లకు నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.53 నష్టపోయి 2,722.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచీలోని మొత్తం 12 షేర్లలో 11 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, ఒక్క పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు షేరు

పెరిగిన పసిడి .!

Monday 16th July 2018

ముంబై: గతవారం ముగింపులో ఏడు నెలల కనిష్టానికి పతనమైన పసిడి ధర ఈ వారం ప్రారంభంలోనే రికవరీ బాట పట్టింది. భారత కాలమానం గం.10:21ని.లకు ఆసియా ట్రేడింగ్‌లో సోమవారం ఔన్స్‌ పసిడి 2.40డాలర్లు పెరిగి 1,243.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేడు చైనా జీడీపీ గణాంకాల విడుదల నేపథ్యంలో పలు ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్‌తో పాటు డాలర్‌ బలహీనత పసిడి పెరుగుదలకు కలిసొచ్చాయి. నేడు ఆసియా ట్రేడింగ్‌లో 1,240.9

Most from this category