STOCKS

News


ఈ స్టాకుల్లో ఎంఏసీడీ పాజిటివ్‌ సిగ్నల్స్‌

Wednesday 12th December 2018
Markets_main1544605767.png-22865

మార్కెట్లో బుల్స్‌ పట్టు పెరగడంతో పలు షేర్లలో ర్యాలీ సంకేతాలు కన్పిస్తున్నాయంటున్నారు నిపుణులు. మంగళవారం ముగింపు ప్రకారం 38 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా మారిన కంపెనీల్లో యస్‌బ్యాంక్‌, బయోకాన్‌, ఇండియన్‌ బ్యాంక్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, ఎన్‌ఐఐటీ టెక్‌, ఫోర్టిస్‌ హెల్త్‌, నెల్కో, సుందరం ఫైనాన్స్‌, బోష్‌, టీటీకే ప్రెస్టేజ్‌, ప్రాక్సిస్‌ హోమ్‌ రిటైల్‌, టీవీఎస్‌ మోటర్స్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను సూచిస్తోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడ్డ షేర్లివే...
మరోవైపు 40 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. వీటిలో క్వాలిటీ, బీపీసీఎల్‌, ఎంసీఎక్స్‌, వీమార్ట్‌ రిటైల్‌, ఫినోలెక్స్‌ కేబుల్‌, సనోఫి, అబాట్‌ ఇండియా, మహింద్ర లాజిస్టిక్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కేపీఆర్‌ మిల్స్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 
ఎంఏసీడీ అంటే...
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు. 
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి. You may be interested

10,700పైన నిఫ్టీ ముగింపు

Wednesday 12th December 2018

629 పాయింట్ల లాభపడి సెనెక్స్‌ ఆర్‌బీఐ నూతన ఛైర్మన్‌గా శక్తికాంత్‌ నియామకానికి మార్కెట్‌ వర్గాలు సానుకూలంగా స్పందించడంతో పాటు అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా వుండటంతో  సూచీలు బుధవారం భారీగా లాభపడ్డాయి. అటో, మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్ల లాభాల ట్రేడింగ్‌ సూచీల ర్యాలీకి నేతృత్వం వహించాయి. నిఫ్టీ సూచీ 10700 మార్కును అందుకోగా, సెన్సెక్స్‌ 629 పాయింట్లను ఆర్జించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు గంటకు

రెండోరోజూ పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ

Wednesday 12th December 2018

7.50శాతం పెరిగిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త ఛైర్మన్‌గా శక్తికాంత్‌ నియామకం బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ఉత్సాహానిచ్చింది. ముఖ్యంగా మొండిబాకీల ప్రక్షాళనకు సంబంధించి సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) అమలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు బుధవారం లాభాల బాట పట్టాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ప్రభుత్వరంగ ఇండెక్స్‌ వరుసగా రెండో రోజూ ర్యాలీ చేస్తూ బుధవారం 2.50శాతం లాభపడింది.

Most from this category