STOCKS

News


200డీఎంఏకు దిగువన 344 స్టాక్స్‌

Thursday 13th September 2018
Markets_main1536778215.png-20208

మార్కెట్‌ కరెక్షన్లలో చాలా స్టాక్స్‌ ధరలు కనిష్ట స్థాయిలకు దిగి వస్తుంటాయి. ఈ క్రమంలో అవి 200 రోజుల చలన సగటు (డీఎంఏ)ను కోల్పోవడం సాంకేతికంగా కీలకమైనదిగా అనలిస్టులు పరిగణిస్తుంటారు. మరి ఇలా చూసినప్పుడు నిఫ్టీ-50 బాస్కెట్‌లోనే 20 స్టాక్స్‌ 200డీఏంఏకు కిందకు వెళ్లిపోయాయి. వాటిలో అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఆటో, బీపీసీఎల్‌, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, మారుతి సుజుకి, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, వేదాంత, భారతీ ఎయిర్‌టెల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఐచర్‌ మోటార్స్‌, గ్రాసిమ్‌, హీరో మోటోకార్ప్‌ ఉన్నాయి. ఇక నిఫ్టీ-500 సూచీ పరిధిలో టాప్‌ 500 స్టాక్స్‌లో 344 స్టాక్స్‌ (69 శాతం) కూడా 200డీఎంఏ మార్క్‌ను కోల్పోయినవే. వీటిలో ఏసీసీ, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌, ఏజిస్‌ లాజిస్టిక్స్‌, అశోకా బిల్డ్‌కాన్‌, అవంతి ఫీడ్స్‌, బ్యాంకు ఆఫ్‌ బరోడా, బ్యాంకు ఆఫ్‌ ఇండియా, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌, బిర్లా కార్పొరేషన్‌, ఇమామి, ఇంజనీర్స్‌ ఇండియా, ఫినోలెక్స్‌ కేబుల్స్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, ఎంఎంటీసీ తదితర కంపెనీలు ఉన్నాయి. 

 

ట్రెండ్‌ను డిసైడ్‌ చేస్తుంది...
ఓ స్టాక్‌ చలన సగటు ప్యారామీటర్‌ను ఓ స్టాక్‌ లేదా సూచీ భవిష్యత్తు ట్రెండ్‌ను విశ్లేషించేందుకు పరిగణనలోకి తీసుకుంటుంటారు. దీన్ని కీలక మద్దతు, నిరోధ స్థాయిలుగా చూడడం జరుగుతుంది. ట్రేడర్‌ అయినా, ఇన్వెస్టర్‌ అయినా రోజువారీ సగటు చలనం, 50 రోజులు, 100 రోజులు, 200 రోజుల డీఎంఏలు ట్రెండ్‌ను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయి. ఏదైనా ఓ స్టాక్‌ ఈ డీఎంఏలన్నింటిపై ట్రేడ్‌ అవుతుంటే అది బుల్లిష్‌ అప్‌ట్రెండ్‌లో ఉన్నట్టుగా పరిగణిస్తారు. చిన్న కరెక్షన్లు అయితే 50డీఎంఏ, 100 డీఎంఏల వరకు దిద్దుబాటుకు గురవుతుంటాయి. కానీ, కరెక్షన్‌ తీవ్రతరం అయితే 200డీఎంఏ మద్దతును కూడా కోల్పోవడం జరుగుతుంది. ‘‘స్టాక్‌ 200డీఎంఏ కింద కోట్‌ అవుతుంటే నిస్సందేహంగా అది దీర్ఘకాలిక డౌన్‌ట్రెండ్‌ను సూచిస్తున్నట్టే. అయితే, బుల్‌ మార్కెట్‌ చెక్కు చెదరకుండా ఉంటే, ఏదైనా స్క్రిప్‌ లార్జ్‌క్యాప్‌ లేదా మిడ్‌క్యాప్‌ విభాగానికి చెందినది, మంచి ఫండమెంటల్స్‌తో ఉండి, 200డీఎంఏకు దిగువన ట్రేడ్‌ అవుతుంటే దాన్ని పెట్టుబడికి అవకాశంగా చూడొచ్చు’’ అని చార్ట్‌వ్యూ ఇండియా సంస్థ చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ మజర్‌ మొహమ్మద్‌ తెలిపారు. 200డీఎంఏను దీర్ఘకాలిక ట్రెండ్‌కు ఓ ఉపకరణంగానే చూడాలని, ట్రేడింగ్‌ ఉపకరణంగా మాత్రం కాదని సూచించారు. 

 

కొనుగోళ్లకు అవకాశం
‘‘మార్కెట్లు 11,760కు వెళ్లిన తర్వాత కరెక్షన్‌ చూస్తున్నాం. చాలా స్టాక్స్‌ 200డీఎంఏకు దిగువన ఉన్నాయి. విలువ ఆధారిత కొనుగోళ్లకు ఈ స్టాక్స్‌ ప్రస్తుతం ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అయితే, వీటిని కొనుగోలు చేసే ముందు తగిన పరిశోధన చేయాల్సి ఉంటుంది’’ అని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తెలిపారు. అయితే, 200డీఎంఏకు దిగువన ఉన్న స్టాక్స్‌ అన్నీ విలువ పరంగా ఆకర్షణీయంగా ఉన్నాయని భావించడం సరికాదన్నారు. రంగాల వారీగా, మెరుగైన పనితీరు ఉన్న వాటిని ఎంచుకోవచ్చని సూచించారు. You may be interested

స్టాక్‌ మార్కెట్‌కు సెలవు

Thursday 13th September 2018

గణేష్‌ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్‌ 13న అంటే గురువారం రోజున ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లకు సెలవు. ఈక్విటీ మార్కెట్‌లో ఎలాంటి ట్రేడింగ్‌ జరగదు. అలాగే ఫారెక్స్‌, బులియన్‌, మెటల్‌, కమోడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్లు కూడా ఉండవు.  

భారీ విస్తరణ దిశగా ఐవోసీ అడుగులు

Thursday 13th September 2018

ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ ఐవోసీ తన ఫ్యూయల్‌ రిటైల్‌ అవుట్‌లెట్ల సంఖ్యను రానున్న మూడేళ్లలో రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. ప్రస్తుతం 27,000 ఉండగా, మూడేళ్లలో 52,000 పెంచాలనుకుంటోంది. దేశంలో అత్యధిక రిటైల్‌ ఫ్యూయల్‌ స్టేషన్లు ఐవోసీకే ఉన్నాయి. ప్రైవేటు సంస్థలు ఈ విభాగంలోకి ప్రవేశించినప్పటికీ 44 శాతం వాటా ఈ సంస్థ చేతుల్లోనే ఉంది. ‘‘ఐవోసీ రిటైల్‌ విభాగంలోనూ ఇన్వెస్ట్‌ చేయనుంది. రానున్న కొన్ని సంవత్సరాల్లో కొత్తగా

Most from this category