STOCKS

News


30 రోజుల్లో కదం తొక్కిన షేర్లివే

Sunday 24th March 2019
Markets_main1553450272.png-24775

గత నెల రోజుల్లో మార్కెట్లు మంచి ర్యాలీ జరిపాయి. సూచీలు కీలక అవరోధాలను అధిగమించి గత గరిష్ట స్థాయిలకు చేరువయ్యాయి. విదేశీ పెట్టుబడిదారులు నిధుల వరద పారించడంతో సూచీలు కూడా పరుగులు పెట్టాయి. బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌ ఒక్క నెలలోనే 9 శాతం లాభపడింది. ఇందులో 30 స్టాక్స్‌ అయితే ఏకంగా 30 శాతం నుంచి 99 శాతం వరకు పెరగడం విశేషం. కార్పొరేట్‌ గవర్నెన్స్‌, లిక్విడిటీ సంక్షోభాల సమయంలో పతనమైనవీ ఇందులో ఉన్నాయి. ఈ స్టాక్స్‌లో సుజ్లాన్‌ ఎనర్జీ, మన్‌పసంద్‌ బెవరేజెస్‌, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌, సీజీ పవర్‌, బోంబే డైయింగ్‌, అదానీ పవర్‌, అలహాబాద్‌ బ్యాంకు, మహింద్రా హాలిడేస్‌, ఎన్‌బీసీసీ, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, జస్ట్‌ డయల్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌, కెన్‌ఫిన్‌ హోమ్‌ తదితర కంపెనీలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల్లో స్పష్టత వచ్చి, ఎర్నింగ్స్‌ పుంజుకుంటే ఎఫ్‌ఐఐలు ఈ ఏడాది చారిత్రక స్థాయిలో పెట్టుబడులు పెడతారని అంచనా వేస్తున్నట్టు ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ ఈక్విటీ అనలిస్ట్‌ ఫోరమ్‌ పారేఖ్‌ తెలిపారు.

కంపెనీ                          పెరుగుదల శాతం
సుజ్లాన్‌                         99
సీజీ పవర్‌                      62
మన్‌పసంద్‌                   57
దిలీప్‌ బిల్డ్‌కాన్‌                54
సద్బావ్‌ ఇంజనీరింగ్‌         45
రెప్కో హోమ్‌                   44.5
ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌      40
బోంబే డైయింగ్‌                40
ఫినోలెక్స్‌ కేబుల్స్‌             37.5
సన్‌టెక్‌ రియాలిటీ             37
తేజాస్‌ నెట్‌వర్క్స్‌             36
ఇండియాబుల్స్‌ ఇంటెగ్రేటెడ్‌ 36
అదానీ పవర్‌                   35
హెచ్‌పీసీఎల్‌                    35
గ్రాన్యూల్స్‌                       35
అలహాబాద్‌ బ్యాంకు           35
ఐటీడీ సిమెంటేషన్‌             35
 You may be interested

చిన్న కంపెనీలే... రాబడుల్లో రికార్డు

Sunday 24th March 2019

స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లో నేరుగా ఇన్వెస్ట్‌ చేసే వారు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంచుకునే కంపెనీలు దీర్ఘకాలంలో ఆశించిన రాబడులను ఇచ్చేవే కాకుండా, సంక్షోభాల్లో నిలబడే సామర్థ్యంతో ఉన్న వాటిని వెతికి పట్టుకోవాలి. హ్యాట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్స్‌, పీఐ ఇండస్ట్రీస్‌, సెరా శానిటరీవేర్‌, సింఫనీ, టీటీకే ప్రెస్టీజ్‌ ఈ తరహా కంపెనీలే. నిలకడమైన పనితీరు ఈ స్టాక్స్‌లో చూడొచ్చు. ప్రస్తుత సంక్షోభ సమయాల్లోనూ ఇవి తమ పనితీరుతో ఆకట్టుకున్నవే.   హ్యాట్సన్‌

ఆర్‌ఈఐటీ ఇప్పటికైతే ఆకర్షణీయం కాదు?!

Sunday 24th March 2019

బెంగళూరుకు చెందిన ఎంబసీ గ్రూపు రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్‌ఈఐటీ)ను తీసుకొచ్చింది. ఇది మ్యూచువల్‌ ఫండ్‌ మాదిరిగా పనిచేసే సాధనమే. రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులపై ఇన్వెస్ట్‌ చేస్తుంది. విడిగా ఒక్కొకరు ఒక ‍ప్రాపర్టీపై ఇన్వెస్ట్‌ చేయడం కాకుండా, కొంత మంది ఇన్వెస్టర్లు సమూహంగా రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టేందుకు ఆర్‌ఈఐటీ వీలు కల్పిస్తుంది. అదే సమయలో ఒక ప్రాపర్టీ కొనుగోలుకు విడిగా ఒకరు అయితే పెద్ద ఎత్తునే

Most from this category