News


నెలరోజులకు మూడు సిఫార్సులు..

Friday 23rd November 2018
Markets_main1542966136.png-22349

ముంబై: నిఫ్టీకి 10500-10440 పాయింట్ల స్థాయిలో కీలక మద్దతు ఉందని వే2వెల్త్‌ బ్రోకింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఆదిత్య అగర్వాల్ విశ్లేషించారు. ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకోగలిగితే.. షార్ట్‌ కవరింగ్‌ చోటుచేసుకుని ఈ సిరీస్‌ ముగింపు నాటికి 10600-10650 స్థాయిలకు చేరుకుంటుందని అంచనావేశారు. దిగువస్థాయిల వద్ద ఎఫ్‌ఎంసీజీ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, మిడ్ క్యాప్ టెక్నాలజీ, ఆటో రంగ షేర్లు మద్దతు ఇవ్వనున్నట్లు విశ్లేషించారు. వచ్చే నెలరోజుల్లో 6-14 శాతం వరకు రాబడినిచ్చే మూడు షేర్లను సిఫార్సు చేశారు. వీటిలో రెండు బై కాల్స్‌ ఉండగా, ఒక సెల్‌ కాల్‌ ఇచ్చారు.

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌​| కొనుగోలు ధరల శ్రేణి: రూ.455-452 | ప్రస్తుత ధర రూ.458 | టార్గెట్ ధరల శ్రేణి: రూ.475/484 | స్టాప్ లాస్‌: రూ.438 | రాబడి అంచనా: 6 శాతం
కొద్దివారాలుగా రూ.455-420 స్థాయిలో రేంజ్‌బౌండ్‌గా కదలాడి.. గురువారం రోజున రూ.455 వద్ద ఉన్నటువంటి బలమైన నిరోధానికి పైన ముగిసింది. డైలీ చార్టులో 50-రోజుల సగటు కదలికల బలమైన నిరోధం రూ.450 వద్ద ఉండగా.. ఈస్థాయిని అధిగమించింది. ఇక్కడ నుంచి అప్‌వార్డ్‌ మూవ్‌మెంట్‌ ఉండేందుకు అవకాశం ఉన్నందున షార్ట్‌టర్మ్‌ టేడర్లు రూ.438 స్టాప్‌లాస్‌తో లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చని సూచించారు.

సెయిల్ | అమ్మకపు ధరల శ్రేణి రూ.62-63 | ప్రస్తుత ధర రూ.60.40 | టార్గెట్ ధర: రూ.55/52 | స్టాప్ లాస్‌: రూ.67 | రాబడి అంచనా: 14 శాతం
ఈనెల ప్రారంభంలో రూ.72 వద్ద ఉన్నటువంటి బలమైన నిరోధాన్ని అధిగమించడానికి ప్రయత్నించి విఫలమైంది. అక్కడ నుంచి బేర్‌ ఒత్తిడిలో కొనసాగుతోంది. చివరకు రూ.62 వద్ద మద్దతును కూడా కోల్పోయింది. వీక్లీ చార్టుల్లో వరుసగా లోయర్‌ టాప్‌, లోయర్‌ బోటమ్‌లను నమోదుచేసింది. ఇది మరింత బలహీనతకు సూచనగా తీసుకోవచ్చని విశ్లేషించారు.

బాష్ ​| కొనుగోలు ధరల శ్రేణి: రూ.18,900-19000 | ప్రస్తుత ధర రూ.19,007 | టార్గెట్ ధర రూ.20,600 | స్టాప్ లాస్‌: రూ.18,400 | రాబడి అంచనా: 8 శాతం
అక్టోబర్‌ చివరివారంలో రూ.20500 వరకు ర్యాలీ చేసి అక్కడ నుంచి క్రమంగా తగ్గుతూ రూ.18,465 వద్దకు పడిపోయింది. అప్‌మూవ్‌ (రూ.17600-20500 స్థాయి)లోని 61.80 శాతం రీట్రేస్‌ను పూర్తిచేసింది. రూ.18800-18900 స్థాయిలో బలమైన సపోర్ట్‌ ఉన్నందున రూ.20,600 స్టాప్‌లాస్‌తో లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చని సూచించారు.

ఇవి కేవలం ఆదిత్య అగర్వాల్ అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.



You may be interested

700 బిలియన్‌ డాలర్లు నష్టపోయిన క్రిప్రోకరెన్సీ

Friday 23rd November 2018

ఈఏడాదిలోనే అత్యధికంగా నష్టపోయిన వారంగా క్రిప్రోకరెన్సీ ట్రేడింగ్‌ రికార్డు సృష్టించింది. గోడకు కొట్టిన బంతిలా ఈ విభాగంలోని డిజిటల్‌ కరెన్సీలు వెనక్కు వచ్చేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 700 బిలియన్‌ డాలర్లు (మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.49,46,550 కోట్లు) సంపద ఆవిరైపోయింది. ఈ విభాగంలో మార్కెట్‌ లీడర్‌గా అవతరించిన బిట్‌కాయిన్‌ తాజాగా 4,000 డాలర్ల మార్కుకు సమీపించింది. సరిగ్గా ఏడాది కిందట 20,000 డాలర్లకు సమీపించి.. మరింత ముందుకు

స్పల్పంగా పెరిగిన పసిడి ధర

Friday 23rd November 2018

డాలర్‌ ఇండెక్స్‌ పతనంతో పాటు వచ్చే వారంలో జరగనున్న జీ-20 సదస్సు నేపథ్యంలో ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం స్వల్పంగా బలపడింది. అంతర్జాతీయ మార్కెట్లను వణికిస్తున్న ‘‘అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం’’పై ఆ దేశాధ్యక్షులు చర్చలు జరపనున్నారు. వచ్చే వారంలో నవంబర్‌ 30న అర్జెంటీనాలో జరగనున్న జీ-20 సదస్సు ఇందుకు వేదికకానుంది. ‘‘వచ్చే వారం చర్చల అనంతరం ప్రతికూల వార్తలు వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా పసిడి ఫ్యూచర్ల

Most from this category