STOCKS

News


బొనాంజా పోర్టుఫోలియో సిఫార్సులు

Thursday 17th January 2019
Markets_main1547699260.png-23627

గురువారం మార్కెట్లు స్వల్పలాభాల్లో ఆరంభమయ్యాయి. నిఫ్టీ 10900 పాయింట్లకు అటుఇటుగా కదలాడుతోంది. గురువారం ఆర్‌ఐఎల్‌, హెచ్‌యూఎల్‌ సహా 19 కంపెనీలు క్యు3 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఇకపై ఎర్నింగ్సే మార్కెట్‌ గమనాన్ని నిర్ధేశిస్తాయని బొనాంజా పోర్టుఫోలియో అభిప్రాయపడింది. పైస్థాయిలో 11000 పాయింట్లు, దిగువన 10700 పాయింట్లు కీలక నిరోధం, మద్దతుగా నిలుస్తాయి. 11000 పాయింట్లకు పైన 11200 పాయింట్ల వరకు ర్యాలీ కొనసాగవచ్చు. 10700 పాయింట్లను కోల్పోతే 10500 పాయింట్ల వరకు నిఫ్టీ పతనమయ్యే అవకాశం ఉంది. బొనాంజా పోర్టుఫోలియో స్వల్పకాలానికి మూడు స్టాకులను రికమండ్‌ చేస్తోంది.
1. లుపిన్‌: టార్గెట్‌ రూ. 928. స్టాప్‌లాస్‌ రూ. 837.
2. హిండాల్కో: టార్గెట్‌ రూ. 228. స్టాప్‌లాస్‌ రూ. 199.
3. డా.లాల్‌పాథ్‌ ల్యాబ్స్‌: టార్గెట్‌ రూ. 1100. స్టాప్‌లాస్‌ రూ. 978. 



You may be interested

పరిశ్రమలపై ఆర్‌బీఐ గవర్నర్‌ దృష్టి

Thursday 17th January 2019

- నేడు కార్పొరేట్‌ అధిపతులతో శక్తికాంత్‌ భేటీ - ఇప్పటికే బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీలపై  చర్చలు - చిన్న పరిశ్రమల ప్రతినిధులనూ కలిసిన దాస్‌ ముంబై: దేశ స్థూల ఆర్థిక పరిస్థితులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మరింత దృష్టి సారిస్తున్నారు. ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన గురువారం పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. మైక్రోబ్లాగింగ్‌ వెబ్‌సైట్‌ ట్వీట్‌లో దాస్‌ ఈ వివరాలను

ఈ సారి ఆర్‌బీఐ ‘‘సరళతరం’’

Thursday 17th January 2019

ఫిబ్రవరి 7వ తేదీన జరగనున్న ఆరవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సందర్భంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుసరించబోయే విధానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- రెపో (ప్రస్తుతం 6.50 శాతం)పై ప్రస్తుతం ఆర్‌బీఐ కొంత కఠిన వైఖరి అవలంభిస్తోంది. అయితే ఇకపై తన వైఖరిని ‘‘తటస్థం’’ స్థాయికి మార్చుకునే అవకాశం ఉందనేది నిపుణుల అంచనా.  డిసెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం

Most from this category