STOCKS

News


దీర్ఘకాల పెట్టుబడికి 3 సిఫార్సులు..!

Saturday 1st December 2018
Markets_main1543648666.png-22563

ముంబై: నిఫ్టీ ఏడాది ఫార్వార్డ్‌ బేస్‌ టార్గెట్‌ ప్రస్తుతానికి 10,250 పాయింట్లుగా నిర్ణయించినట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ వెల్లడించారు. ఇంతకుముందు ఉన్నటువంటి 10,400 పాయింట్ల టార్గెట్‌ను ఈమేరకు కుందించినట్లు ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2019 ఆర్థిక సంవత్సర ఎర్నింగ్స్‌ వృద్ధిరేటు 12.5 శాతం, 2020 వృద్ధిరేటు 15 శాతం ఆధారంగా ఈ అంచనాను వెల్లడించారు. ఇంతకుముందు వరుసగా 15, 20 శాతాలుగా లెక్కించినట్లు తెలిపారు. ముడిచమురు ధరలు తగ్గడం వల్ల స్వల్పకాలానికి మార్కెట్‌ పాజిటీవ్‌గానే ఉండనుందని వివరించిన ఆయన.. దీర్ఘకాలానికి మాత్రం వాణిజ్య యుద్ధం, వడ్డీ రేట్లు, ఆర్థిక వ్యవస్థ పనితీరు వంటి కీలక అంశాల ఆధారంగా మార్కెట్‌ ట్రెండ్‌ నిర్ణయమవుతుందన్నారు. వచ్చే 1-2 ఏళ్ల కాలానికి మూడు సిఫార్సులను ఇచ్చారు.

ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌: సాధారణ ఎన్నికల వంటి అంశాల కారణంగా స్వల్పకాలానికి ఇబ్బందులు ఉన్నప్పటికీ.. దీర్ఘకాలానికి ట్రాక్టర్లకు డిమాండ్‌ అధికంగా ఉండనుందని భావిస్తున్నాం. 2018-20 కాలానికి కంపెనీ ఎర్నింగ్స్‌ 25 శాతం చొప్పున చక్రగతి వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందన్నారు.

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్: సమాచార నిర్వహణ వ్యవస్థ (ఐఎంఎస్‌) ఆరోగ్యకర వృద్ధిరేటును సాధించనుందని భావిస్తున్నాం. దీర్ఘకాలంలో మోడ్‌ 2,3 వృద్ధి ఉండనుండగా.. బలమైన ఒప్పందాలు జరగనున్నట్లు అంచనావేస్తున్నట్లు చెప్పారు. అమెరికాలోని ఉద్యోగుల్లో 65 శాతం అక్కడి వారే కావడం వల్ల ఆన్‌సైట్‌ రిస్క్‌ తక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ షేరు 12.5 రెట్లు వద్ద ఉండగా.. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ కంటే కూడా ఈ షేరు 28 శాతం డిస్కౌంట్‌లో ఉందన్నారు.

యూపీఎల్‌ లిమిటెడ్: బయోలాజిక్స్‌ వైపునకు ప్రాడెక్ట్‌ మిక్స్‌ బదిలీకావడం వంటి కీలక అంశాల ఆధారంగా 2018-20 కాలానికి ఎబిటిడా 24 శాతం, నికర లాభం 31 శాతం చొప్పున చక్రగతి వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందన్నారు. 


 



You may be interested

ఎంవోఐఎల్‌ టార్గెట్‌ ఎంత?

Saturday 1st December 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా ఎంవోఐఎల్‌పై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.260గా నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత క్యూ2 ఆదాయం అంచనాలు మించిందని పేర్కొంది. అధిక విక్రయాలు ఇందుకు కారణమని తెలిపింది. ధరల పెంపు కూడా సానుకూల ప్రభావం చూపిందని పేర్కొంది. మాంగనీస్‌ ఓర్‌ విక్రయాలు వార్షికంగా 17 శాతం, త్రైమాసికంగా 28 శాతం పెరిగాయని తెలిపింది. పీఏటీ అంచనాల

ఇన్ఫోసిస్‌, విప్రో ఏడీఆర్‌లు 2% జంప్‌

Saturday 1st December 2018

వేదాంత, టాటా మోటార్స్‌ ఏడీఆర్‌లు 2 శాతం డౌన్‌ అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు తగ్గాయి. విప్రో ఏడీఆర్‌ గరిష్టంగా 2 శాతానికి పైగా పెరిగితే.. టాటా మోటార్స్‌, వేదాంత ఏడీఆర్‌లు 2 శాతానికి పైగా

Most from this category