STOCKS

News


‘ఈక్విటీ99’ నుంచి మూడు స్టాక్‌ సిఫారసులు

Sunday 12th August 2018
Markets_main1534096582.png-19187

నిఫ్టీ, సెన్సెక్స్‌ ఎప్పటికప్పుడు నూతన గరిష్ట స్థాయిలను నమోదు చేస్తూ వెళుతున్నాయి. ప్రతీ చిన్న కరెక్షన్‌లోనూ కొనుగోళ్లు చేసుకుంటున్నాయి. దీంతో మార్కెట్లు గతంతో పోలిస్తే బలంగా కనిపిస్తున్నాయి. తమ అంచనాల ప్రకారం ఈ స్థాయిల్లో మార్కెట్లు స్థిరీకరణ చెందుతాయని ‘ఈక్విటీ99’ వ్యవస్థాపకుడు సుమిత్‌ బిల్‌గయాన్‌ పేర్కొన్నారు. నాణ్యమైన మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సైతం ర్యాలీ చేస్తాయని అంచనా వ్యక్తం చేశారు. స్వల్ప కాలంలో వృద్ధికి అవకాశం ఉన్న మూడు స్టాక్స్‌ను ఆయన సూచించారు.

 

ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌
ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ అంతర్జాతీయంగా ఇంజనీరింగ్‌, పరిశోధన, అభివృద్ధి సేవల(ఈఆర్‌అండ్‌డీ)ను అందించే కంపెనీ. అంతగా విస్తరించని మార్కెట్‌ విభాగాల్లో విస్తృతమైన సేవలతో, ఎక్కువ మంది క్లయింట్లను కలిగి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈఆర్‌అండ్‌డీపై ఎక్కువగా ఖర్చు చేసే వారిలో 43 ఈ సంస్థ క్లయింట్లుగా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ విభాగంలో అధిక అవకాశాలను దక్కించుకునే సామర్థ్యం ఉన్న సంస్థ. జూన్‌ త్రైమాసికంలో కంపెనీ లాభం రెట్టింపునకుపైగా పెరగ్గా, ఆదాయం 40 శాతం పెరిగింది. అంతకుముందు త్రైమాసికం (మార్చి)తో చూస్తే ఆదాయం 9 శాతం, నికర లాభం 24 శాతం వృద్ధి చెందినట్టు. ఎబిట్డా మార్జిన్‌ 1.7 శాతం పెరిగి 17 శాతానికి చేరుకుంది. ప్రాసెస్‌ ఇండస్ట్రీ, టెలికం, హైటెక్‌, ఇండస్ట్రియల్‌ ప్రొడక్ట్స్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ విభాగంలో ఐదు కాంట్రాక్టులను దక్కించుకుంది. 

 

సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌
ఫార్మాస్యూటికల్‌ రీసెర్చ్‌ కంపెనీ. తన ఆవిష్కరణల సామర్థ్యంతో ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్నది. మార్చి త్రైమాసికంలో ఈ సంస్థ లాభం 56 శాతం పెరిగి రూ.62.51 కోట్లకు చేరింది. ఆదాయం 19 శాతం వృద్ధితో రూ.208 కోట్లుగా ఉంది. డివిడెండ్‌ను క్రమం తప్పకుండా చెలిస్తున్న సంస్త. 2016-17లో 100 శాతం, 2017-18లో 150 శాతం డివిడెండ్‌ చెల్లించింది. క్రామ్స్‌ వ్యాపారం ద్వారా ఆదాయాన్ని బలోపేతం చేసుకునే దశలో ఉంది. ఎస్‌యూవీఎన్‌ 502 ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేస్తే, కంపెనీ ఆదాయ, లాభాలు పెరిగేందుకు అవకాశం ఉంది. ఎస్‌యూవీఎన్‌502 అన్నది మోస్తరు ఆల్జీమర్స్‌ వ్యాధితో ఉన్న రోగుల కోసం ఉద్దేశించినది. రెండో దశ ప్రయోగాల్లో ఉన్న ఈ మాలిక్యూల్‌ కోసం పేషెంట్ల నమోదు పూర్తయిందని, ఫలితాలు 2019-20 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో రావచ్చని యాజమాన్యం భావిస్తోంది. ఈ స్టాక్‌ కొనుగోలుకు సిఫారసు చేస్తున్నాం.

 

బీపీసీఎల్‌
వేగంగా వృద్ధి చెందుతున్న ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ. పేమెంట్‌ బ్యాంకు ‘ఫినో పేటెక్‌ లిమిటెడ్‌’లో ఇటీవలే 21.1 శాతం వాటా కొనుగోలు చేసింది. ఆసియాలో ఇది అతిపెద్ద బిజినెస్‌ కరస్పాండెంట్‌. ఈ బ్యాంకు తన కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టిన నేపథ్యంలో తన పెట్టుబడుల ద్వారా బీపీసీఎల్‌ బారీ ప్రయోజనాలను పొందనుంది. జూన్‌ క్వార్టర్లో మంచి ఫలితాలను ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో పోలిస్తే లాభం రూ.744 కోట్ల నుంచి మూడు రెట్లు పెరిగి రూ.2,293 కోట్లకు పెరిగింది. ఆదాయం 23 శాతం వృద్ధితో రూ.82,978 కోట్లకు చేరింది. బ్యారెల్‌ రిఫైనరీపై మార్జిన్‌ 4.88 డాలర్ల నుంచి 7.49 డాలర్లకు పెరిగింది. ఆశాజనక ఫలితాలకు తోడు, చమురు ధరల తగ్గుదల నేపథ్యంలో ఈ స్టాక్‌ను సిఫారసు చేస్తున్నాం.You may be interested

మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇకపై మరింత ఆకర్షణీయం!

Sunday 12th August 2018

మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఇన్వెస్టర్లకు మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సెబీ నడుం బిగించింది. కొన్ని రకాల చర్యల ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో వ్యయాలను తగ్గించడంపై దృష్టి పెట్టింది. ఆన్‌లైన్‌ లావాదేవీలను ప్రోత్సహించడంతోపాటు పలు రకాల పథకాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్స్‌పెన్స్‌ రేషియో (వ్యయాల నిష్పత్తి)లను సమీక్షించనుం‍ది. సెబీ ఇటీవలే మ్యూచువల్‌ ఫండ్స్‌ కేటగిరీల్లో భారీ మార్పులకు చర్యలు తీసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది.   గవర్నెన్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఉత్పత్తుల పంపిణీదారుల చానల్స్‌,

నానో కథ ముగిసినట్టే... పెలికాన్‌ రానట్టే!?

Sunday 12th August 2018

సామాన్యుడి ‘సొంత కారు’ కలను సాకారం చేయాలంటూ రతన్‌ టాటా స్వప్నించి తీసుకొచ్చిన నానో కారు కథ ముగిసినట్టేనా..? టాటా మోటార్స్‌ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, పరిశీలకులు మాత్రం ఇదే భావిస్తున్నారు. సామాన్యుడికి సొంత కారు, తమకు లాభాల కారుగా మారుతుందన్న నానో, అటు సామాన్యుడినీ ఆకట్టుకోలేకపోయింది... ఇటు టాటా మోటార్స్‌కు సైతం లాభాలు లేకపోగా నష్టాల ప్రాజెక్టుగా మారి కూర్చుంది. జూన్‌ నెలలో టాటా

Most from this category