STOCKS

News


మధ్య కాలానికి మూడు స్టాక్స్‌

Monday 8th October 2018
Markets_main1539022611.png-20935

మార్కెట్లలో భారీ కరెక్షన్‌ నేపథ్యంలో పెట్టుబడి అవకాశాల కోసం ఇన్వెస్టర్లు పరిశీలన చేయడం సర్వసాధారణం. సెన్సెక్స్‌ ఇప్పటికే రూ.4,600 పాయింట్లను నష్టపోయింది. రూ.22.74 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. జనవరి గరిష్టాల నుంచి చూస్తే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 23.56 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు 31.42 శాతం పడిపోయాయి. స్టాక్స్‌ విలువలు చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ మార్కెట్‌ సెంటిమెంట్‌ ఇంకా ప్రతికూలంగానే ఉంది. ఇందుకు చమురు ధరలు, బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదల, లిక్విడిటీ తదితర అంశాలు కారణంగా చెప్పుకోవచ్చు. ఈ నెల నుంచి కంపెనీలు సెప్టెంబర్‌ త్రైమాసికం ఫలితాలను ప్రకటించనున్నాయి. త్రైమాసిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉంటే వాటిని పరిశీలన జాబితాలో చేర్చుకోవచ్చని ఈక్విటీ99 వ్యవస్థాపకుడు సుమిత్‌ బిల్‌గయాన్‌ పేర్కొన్నారు. మధ్య కాలానికి మూడు స్టాక్స్‌ను ఆయన సిఫారసు చేశారు. 

 

జుబిలెంట్‌ ఫుడ్‌ వర్క్స్‌
ఈ కంపెనీ జూన్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలను ప్రకటించింది. ఉన్న స్టోర్ల నుంచే అధిక వృద్ధి నమోదైంది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో పోల్చి చూస్తే కంపెనీ విక్రయాలు 26 శాతం, ఎబిట్డా 78 శాతం మేర పెరిగాయి. నికర లాభం 213 శాతం పెరిగింది. ఎబిట్డా మార్జిన్‌ 16.6 శాతంగా ఉంది. స్టోర్‌వారీ విక్రయాల్లో వృద్ధి 25.9 శాతంగా ఉంది. ప్రస్తుతం స్టాక్‌ 61పీఈ వద్ద ఉంది. రికార్డు గరిష్ట స్థాయి నుంచి ఈ స్టాక్‌ ఇప్పటికి 27 శాతం దిద్దుబాటుకు గురైంది. దీంతో మధ్య కాలం నుంచి దీర్ఘకాలం కోసం కొనుగోలు చేసుకోవచ్చు.

 

సన్‌ఫార్మా
ఈ తరహా మార్కెట్లలో ఫార్మా స్టాక్స్‌ కొంత సురక్షితం. సన్‌ ఫార్మా జూన్‌ క్వార్టర్‌కు సంబంధించి అంచనాల కంటే మెరుగైన ఫలితాలను ప్రకటించింది. అమెరికాలో మంచి విక్రయాలు, దేశీయంగా బలమైన వ్యాపారం కలిసొచ్చాయి. విక్రయాలు 16 శాతం, ఎబిట్డా 47 శాతం చొప్పున వృద్ధి చెందాయి. లాభం 87 శాతం పెరిగింది. అమెరికాలో టారో ఫార్మా విక్రయాలు జూన్‌ క్వార్టర్లో 4.2 శాతం క్షీణించాయి. టారో కాకుండా మిగిలిన విక్రయాలు 17.5 శాతం పెరిగాయి. టారోపై సన్‌ ఫార్మా ఆధారపడడం తగ్గుతోంది. దేశీయంగా 22 శాతం విక్రయాలు పెరిగాయి. వర్ధమాన మార్కెట్ల అమ్మకాల్లోనూ 21 శాతం వృద్ధి నెలకొంది. రెండో క్వార్టర్లో మంచి పనితీరు ఉంటుందని అంచనా. మధ్య, దీర్ఘకాలానికి క్రమంగా కొనుగోలు చేసుకోవచ్చు. 

 

ఆల్కెమ్‌ ల్యాబ్‌
ఆల్కెమ్‌ ల్యాబ్‌ సైతం జూన్‌ త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. కంపెనీ విక్రయాలు 27.19 శాతం, ఎబిట్డా 86 శాతం చొప్పున పెరిగాయి. నికర లాభం 90 శాతం పెరిగింది. ఎబిట్డా మార్జిన్‌ మార్చి త్రైమాసికంలో 9 శాతంగా ఉంటే, జూన్‌ త్రైమాసికంలో 14 శాతానికి పెరిగింది. 2018 ఆర్థిక సంవత్సరంలో 650 శాతం డివిడెండ్‌ చెల్లించింది. 23.91 కోట్ల చిన్న ఈక్విటీ. మిగులు నిల్వలు మాత్రం రూ.4,839 కోట్లు. ఆగస్ట్‌లో కంపెనీకి చెందిన బడ్డి ప్లాంట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి నిరభ్యంతర పత్రం జారీ అయింది. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం ఈ స్టాక్‌ 34.6 పీఈ వద్ద ట్రేడవుతోంది. మధ్య, దీర్ఘకాలానికి క్రమంగా కొనుగోలు చేసుకోవచ్చు.



You may be interested

షాపింగ్‌కు ఫండ్‌ మేనేజర్లు రెడీ!

Monday 8th October 2018

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఇప్పటికే 12 శాతం వరకు పతనమయ్యాయి. స్టాక్‌ ధరలు తక్కువకు పడిపోతే కొనేందుకు మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు నగదు నిల్వలతో సిద్ధంగా ఉన్నారు. మార్కెట్‌ మరింత దిద్దుబాటుకు గురైతే, బాగా ఆకర్షణీయ విలువలకు చేరిన స్టాక్స్‌ను వారు బుట్టలో వేసుకోవడం ఖాయం. ఇప్పటికే చాలా స్టాక్స్‌ ఆకర్షణీయ ధరలకు చేరాయి. స్థూల ఆర్థిక అంశాలు, రూపాయి, చమురు ధరల కదలికల ఆధారంగా మార్కెట్‌ ట్రెండ్‌ను వారు

ఇటలీ ఇక్కట్లు.. మార్కెట్లకు తలపోట్లు..

Monday 8th October 2018

ప్రపంచ మార్కెట్లకు మరోమారు ఇటలీ తలనొప్పులు తెస్తోంది. బడ్జెట్‌ విషయమై ఈయూ అధికారుల ప్రతిపాదనలకు ఇటలీ నో చెప్పడం ఈక్విటీ మార్కెట్లలో ఆందోళనకు కారణమవుతోంది. అసలే చైనా- యూఎస్‌ ట్రేడ్‌ వార్‌, ఇరాన్‌పై ఆంక్షలు తదితర కారణాలతో సతమతమవుతున్న ప్రపంచ మార్కెట్లను ఇటలీ ధిక్కార ధోరణి భయపెడుతోంది. తమ బడ్జెట్‌లో ఈయూ జోక్యాన్ని ఇటలీ ప్రభుత్వం తిరస్కరిస్తోంది. ఇటలీ ప్రతిపాదించిన బడ్జెట్‌ లక్ష్యాలు విత్తలక్ష్యానికి దూరంగా ఉఉన్నాయని యూరోపియన్‌ కమీషన్‌

Most from this category