STOCKS

News


ఈ రంగాలలో ఎర్నింగ్స్‌ జోరు..!

Wednesday 11th July 2018
Markets_main1531304829.png-18207

ముంబై: వచ్చే త్రైమాసికాలలో ఐటీ రంగానికి చెందిన పలు కంపెనీలు, ఫార్మా రంగంలో ఎర్నింగ్స్‌ వృద్ధి ఆకర్షణీయంగా ఉండనుందని విశ్లేషించిన ఏంజెల్ బ్రోకింగ్ ఫండ్ మేనేజర్ మౌరేష్ జోషి.. వినియోగం ఎక్కువగా ఉండే రంగాల కంపెనీలలో ఎఫ్‌ఎమ్‌సీజీ, స్టెపుల్స్‌, పలు రంగుల తయారీ కంపెనీల ఫలితాలు ఆకట్టుకునే విధంగా ఉండేందుకు అవకాశం మెండుగా ఉందని అంచనావేశారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆటో విడిభాగాల కంపెనీలు సరిపోతాయని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో దేశీయ, అంతర్జాతీయ అంశాలను పరిగణలోనికి తీసుకుని వాల్యుయేషన్స్‌, ఎర్నింగ్స్‌ వృద్ధి స్పష్టంగా ఉన్నటువంటి పలు ఎంపికచేసిన షేర్లలోనే పెట్టుబడులను కొనసాగించడం ఉత్తమం అన్న ఆయన వాణిజ్య యుద్ధ భయాలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు, ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ పతనం లాంటి అంశాలను బేరీజువేసుకుని చూస్తే గతేడాది కంటే ఈసారి రాబడి తక్కువగానే ఉంటుందని అంచనావేశారు. అంచనాలను మించిన లాభాలతో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్‌ను ప్రారంభించిందన్న ఆయన స్థిర కరెన్సీ ఆదాయ వృద్ధి తమ అంచనాలకంటే చాలా ఎక్కువగా ఉందన్నారు. మార్జిన్లు సైతం మార్కెట్‌ వర్గాల అంచనాల కంటే అధికంగా ఉన్నట్లు తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా (బీఎఫ్‌ఎస్‌) విభాగంలో నమోదైన 3.7 శాతం వృద్ధిరేటు నిలబడగలిగితే.. రంగాల పరంగా ఇది 30-35 శాతం వరకు వాటాను కలిగిఉంటుందన్నారు. ఫలితాల అనంతరం టీసీఎస్‌ను అట్టిపెట్టుకోవచ్చని భావిస్తున్నట్లు చెప్పిన మౌరేష్ జోషి.. హెచ్‌సీఎల్‌ టెక్‌ తాము ఇష్టపడే పిక్‌ అని వెల్లడించారు. మిడ్‌క్యాప్‌ ఐటీ రంగ షేర్లలో మైండ్‌ట్రీ, న్యూక్లియస్ సాఫ్‌వేర్‌లు ప్రిఫర్డ్‌ పిక్స్‌గా వెల్లడించారు. You may be interested

ఏడాది చివరకు నిఫ్టీ@11400!

Wednesday 11th July 2018

డాయిష్‌ బ్యాంక్‌ అంచనా దేశీయ మార్కెట్లు ఈ ఏడాది సైతం బుల్‌ రన్‌ కొనసాగిస్తాయని ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం డాయిష్‌ బ్యాంక్‌ అభిప్రాయపడింది. ఈ ఏడాది చివరకు నిఫ్టీ 11400 పాయింట్లకు, సెన్సెక్స్‌ 37వేల పాయింట్లకు చేరతాయని బ్యాంకు ప్రతినిధి ప్రతీక్‌ గుప్తా అంచనా వేశారు. అయితే మార్కెట్లో ఒడిదుడుకులు మాత్రం మరికొంత కాలం కొనసాగుతాయన్నారు. వచ్చే 3- 5ఏళ్ల పాటు కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌లో వృద్ధి కారణంగా భారత ఎకానమీలో నిర్మాణాత్మక

ట్రేడ్‌వార్‌.. ఆర్ధిక సంక్షోభానికి సంకేతం!

Wednesday 11th July 2018

మార్క్‌మొబియస్‌  ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి యూఎస్‌ఏ- చైనా మధ్య వాణిజ్యయుద్ధం తొలిసూచనగా ప్రముఖ ఇన్వెస్టర్‌ మార్క్‌ మొబియస్‌ అభివర్ణించారు. ఈ ఏడాది ఆరంభం నుంచి ట్రేడ్‌వార్‌ భయాలతో వర్ధమాన దేశాల మార్కెట్లు దాదాపు 10 శాతం క్షీణించడం తెలిసిందే. అయితే ఇంతటితో ఈ ఏడాది బ్యాడ్‌ న్యూస్‌ ముగిసిపోలేదంటున్నారు మార్క్‌. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం అలముకుంటుందనేందుకు ఇవి సంకేతాలని హెచ్చరించారు. అతి త్వరలో మరో మందగమనం తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.

Most from this category