News


ఐటీ స్టాక్స్‌ ఇప్పటికీ అనుకూలమే!

Tuesday 27th November 2018
Markets_main1543257410.png-22396

ఈ ఏడాది ఐటీ స్టాక్స్‌ మంచి ర్యాలీ చేశాయి. కానీ, గత కొన్ని రోజులుగా మాత్రం ఇవి నష్టాలను ఎదుర్కొంటున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభం నుంచి రూపాయి విలువ డాలర్‌తో క్షీణిస్తూ వచ్చిన విషయం విదితమే. ఇది డాలర్ల మారకంలో ఆదాయాలను గడించే ఐటీ కంపెనీలకు కలిసొచ్చేది. పైగా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలాన్ని పుంజుకోవడం కూడా ఐటీ కంపెనీలకు వరంగా మారింది. అందుకే ఐటీ స్టాక్స్‌ ర్యాలీ చేశాయి. అయితే, 74 స్థాయి వరకు వెళ్లిన రూపాయి కొన్ని రోజుల్లోనే 5 శాతం వరకు రికవరీ అయింది. ఈ రికవరీ సమయంలోనే ఐటీ స్టాక్స్‌ నష్టపోతూ వచ్చాయి. అక్టోబర్‌ 11 నుంచి ఐటీ సూచీ 6-7 శాతం మధ్యలో నష్టపోయింది. అంతమాత్రాన ఐటీ స్టాక్స్‌ను అమ్మేసి బయట పడాలన్న ఆలోచన సరైనది కాదంటున్నారు విశ్లేషకులు. 

 

వాస్తవానికి ఐటీ కంపెనీల ఆదాయ, లాభాలను డాలర్‌తో రూపాయి 70-71 స్థాయిలోనే అంచనా వేయడం జరిగిందని, కనుక రూపాయి 70 స్థాయి పైనే ఉన్నందున ఇటీవలి రూపాయి పతనంతో ఐటీ కంపెనీలపై పడే ప్రభావం ఏమీ లేదని ఐడీబీఐ క్యాపిటల్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఏకే ప్రభాకర్‌ పేర్కొన్నారు. ‘‘అమెరికాలో ఫేస్‌బుక్‌, యాపిల్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, గూగుల్‌ స్టాక్స్‌ 20 శాతం మేర పడిపోయాయి. ఇది భారత ఐటీ కంపెనీలపైనా ప్రతికూల ప్రభావం పడేలా చేసింది’’ అని ప్రభాకర్‌ చెప్పారు. ఇప్పటికే 5-8 శాతం మధ్యలో స్టాక్స్‌ కరెక్షన్‌కు గురయ్యాయని, కొనుగోలు చేయాలనుకునే వారు ఇంకొంత కరెక్షన్‌ వరకు వేచి చూడొచ్చన్నారు. ఇన్ఫోసిస్‌, టెక్‌ మహింద్రా, టీసీఎస్‌లను సిఫారసు చేశారు. సాంకేతికంగా చూస్తే ఐటీ స్టాక్స్‌ బౌన్స్‌ బ్యాక్‌ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. ‘‘ఐటీ స్టాక్స్‌లో కొనసాగడం లేదా కొనుగోలు చేయాలన్నది మా సూచన. ఈ తరహా ఆటుపోట్ల పరిస్థితుల్లో అదనపు రాబడులకు అవకాశం ఉంటుంది’’ అని మెహతా కమోడిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ కలంత్రి తెలిపారు. టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ను ఈ సంస్థ సిఫారసు చేసింది. ఈ రెండూ 200 డీఎంఏ వద్ద ట్రేడ్‌ అవుతున్నాయని, ఇది మంచి మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. 

 

చమురు ధరల పెరుగుదలతో ఇటీవల రూపాయి భారీగా పతనమైంది. చమురు ధరలు దిగిరావడం రూపాయికి కూడా బలాన్నిచ్చింది. అయితే, రూపాయి క్షీణతకు బ్రేక్‌ పడొచ్చని, ఇది ఐటీ స్టాక్స్‌కు అనుకూలమేననంటున్నారు. ‘‘స్థూల ఆర్థిక అంశాలు తిరిగి సానుకూలంగా మారడంతో భారత మార్కెట్ల పట్ల విదేశీ ఇన్వెస్టర్లలో తిరిగి నమ్మకం ఏర్పడుతోంది. రూపాయి రానున్న రోజుల్లో మరింత బలపడుతుంది. ఆర్‌బీఐ ఓఎంఓ ద్వారా వ్యవస్థలో లిక్విడిటీ పెంచే చర్యలు రూపాయికి మద్దతుగా నిలుస్తాయి’’ అని 5నాన్స్‌ సీఈవో దినేష్‌ రోహిరా తెలిపారు. మధ్య కాలానికి రూపాయి 69 స్థాయికి వస్తుందని ఎపిక్‌ రీసెర్చ్‌ అంచనా వేస్తోంది.You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 27th November 2018

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇవి..! సన్‌ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌:- జపాన్‌కు చెందిన పోలా ఫార్మా కంపెనీ కొనుగోలు చేస్తున్నట్లు సన్‌ఫార్మా సోమవారం ప్రకటించింది. పోలా ఫార్మా జపాన్‌లో చర్మసంబంధిత వ్యాధుల జనరికల్‌ ఔషధాలను తయారు చేస్తుంది. ఈ కొనుగోలుతో పోలా ఫార్మాకు చెందిన రెండు మానుఫ్యాక్చరింగ్‌ యూనిట్లు సన్‌ఫార్మా చేతికి దక్కనున్నాయి. ఈ డీల్‌ విలువ భారత కరెన్సీలో సుమారు రూ.7.7 కోట్లు. పోలా ఫార్మాను చేజిక్కుంచుకోవడంతో

హెల్త్‌ ప్లాన్‌ తీసుకునే ముందు... ఒక్క నిమిషం

Tuesday 27th November 2018

వైద్య బీమా ప్రాధాన్యంపై సామాన్యుల్లోనూ అవగాహన పెరుగుతోంది. ఏటేటా వైద్య బీమా ప్లాన్‌ తీసుకునే సగటు మధ్యతరగతి వాసుల సంఖ్య వృద్ధి చెందుతోంది. చిన్న అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినా బిల్లులు వేలల్లో, లక్షల్లో అవుతున్న తరుణంలో బీమా తీసుకోవడం ఆర్థికంగా ఒకింత భద్రతతో కూడిన చర్యే. అయితే, హెల్త్‌ ప్లాన్‌ తీసుకునే వారు ముఖ్యంగా గమనించాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిని బ్యాంక్‌బజార్‌ సీఈవో ఆదిల్‌ శెట్టి తెలియజేశారు.    వేచి ఉండే కాలం ప్రతీ

Most from this category